“బేబీ” ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది…ఇక ఓటీటీ ప్రేక్షకులకు పండుగే.

విజయ్ దేవరకొండ బ్రదర్ ‘ఆనంద్ దేవరకొండ, సాయి రాజేష్’ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “బేబీ”. ఈ చిత్రంపై విడుదలకు ముందే ప్రేక్షకులు భారీ అంచనాలు పెంచుకున్నారు. రిలీజ్ తర్వాత అంచనాలకు మించి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. దీంతో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అని ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు రిలీజ్ అయింది.

గత కొంతకాలంగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటీటీ కి బాగా అలవాటు పడిపోయారు ప్రేక్షకులు… అందుకే ఈమధ్య ప్రతి ఒక్క మూవీ “OTT” లో విడుదలైన తర్వాత అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా సూపర్ హిట్ మూవీ “బేబీ” కూడా ”OTT” రిలీజ్ కు రెడీ అయిపోయింది….. భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న “బేబీ” మూవీ “ఓ టీ టీ” విడుదల తేదీ కూడా వచ్చేసింది. ఈ చిత్రం ఆగస్టు 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం…. ఇక ఈ మూవీ “ఓటిటి”లో కూడా భారీ వసూలు చేస్తుందని నమ్మకంతో ఉన్నారు చిత్ర నిర్మాతలు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page