క్యూట్ మాటలతో ‘హోమ్లీ గర్ల్’ లుక్స్ తో ప్రేక్షకుల మది లో చోటు సంపాదించుకున్న “కలర్స్” స్వాతికి సంబంధించిన! ఓ వార్త నెటింట్లో లో వైరల్ అవుతుంది. స్వాతి త్వరలో భర్త నుంచి విడిపోతుందని,దీని సారాంశం… ఇటీవల ఆమె తన ఇన్స్టా ఎకౌంట్ నుంచి తన భర్త ఫోటోలు తొలగించేసిందని విడాకుల దిశగా ఇది తొలి అడుగని నెటిజెన్స్ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. నిప్పు లేనిదే పొగ రాదని, గతంలో విడాకులకు పూర్వం సమంత, నిహారిక కూడా ఇలాగే తమ భాగస్వాముల పిక్స్ మీడియా నుంచి తొలగించారని గుర్తు చేస్తున్నారు.
సుమారు రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే విధంగా, విడాకులు వార్త హల్చల్ చేసింది. అప్పట్లో “కలర్స్” స్వాతి అకస్మాత్తుగా పిక్స్ ను తొలగించడంతో నెటిజన్స్ కొంత ఆందోళనకు లోనయ్యారు. ప్రేక్షకులలో కలకలం రేగింది. దాంతో ఆమె స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలోని భర్త ఫోటోలను ఆర్ కుట్ లో పెట్టుకున్నట్టు చెప్పిన ఆమె తన ఫోన్లోని భర్త ఫోటోలను కూడా చూపించాల్సి వచ్చింది. ఏదేమైనా! ఈ వార్త గురించిన స్పష్టమైన సమాచారం తెలుసుకోవాలంటే ప్రేక్షకులు కొంత సమయం వేచి చూడాల్సిందే…….
Leave a Reply