మహేష్ బాబు ‘గుంటూరు కారం’ నుండి బిగ్ అప్డేట్ లీక్ చేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి…

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ గా ”గుంటూరు కారం” తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే ‌.ఇప్పటికే విడుదలైన వీడియోలు, పోస్టర్లు సినిమాపై భారీ అంజనలను ఓ రేంజ్ లో పెంచేశాయి. తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ను లీక్ చేసింది.

మొదట పూజ హెగ్డే ప్రధాన కథానాయకగా,శ్రీ లీల సహాయక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో పూజ హెగ్డే స్థానంలో శ్రీ లీల ఎంపికైనట్లు టీ టౌన్ నుంచి పుకార్లు వస్తున్నాయి‌. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కూడా ఒక భాగం అని ఇటీవల జరుగుతున్న సిచువేషన్స్ బట్టి తెలుస్తుంది.

మీనాక్షి “ఖీలాడి” మరియు “హిట్ 2” చిత్రాలలో తన పాత్ర ద్వారా ఫేమ్ తెచ్చుకుంది. మరియు “గుంటూరు కారం”లో రెండవ మహిళ ప్రధాన పాత్రకు ఎంపికయింది . అయితే ఈ సినిమాలో ఆమె హాజరయ్యే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ధ్రువీకరించలేదు.. అయితే మీనాక్షి చౌదరి తాను ఈ చిత్రంలో పనిచేస్తున్నట్టు ధ్రువీకరించింది .‌..

అయితే విజయ్ ఆంటోనీ యొక్క ”హత్య” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మీనాక్షి ఈ చిత్రంలో తన ఉనికిని ద్రువీకరించింది .సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమాలో భాగమైనందుకు కృతజ్ఞతలు తెలిపింది…. “గుంటూరు కారం” కోసం పనిచేసిన అనుభవాన్ని పంచుకోమని మీడియా అడిగినప్పుడు నటి సరదాగా నో ‘లీక్స్’ అని వ్యాఖ్యానించింది. కానీ “గుంటూరు కారం”లో భాగమైనందుకు నిజంగా కృతజ్ఞతలు.. నేనెప్పటినుంచో మహేష్ బాబు గారి అభిమానిని ..మేము మా మొదటి షెడ్యూల్ ని పూర్తి చేశాము, మరియు నా మొదటి రోజు మొదటి షాట్ మహేష్ బాబు సర్ తో జరిగింది ..నేను మహేష్ సార్ మరియు త్రివిక్రమ్ సార్ ఇద్దరికీ కృతజ్ఞతతో ఉంటాను .. వీధి కాంబినేషన్ కి హిట్ పెయిర్ అనే పేరు ఉంది .నేను ఉత్సాహంగా ఉన్నాను……

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న “గుంటూరు కారం” చిత్రానికి గాను తమన్ సంగీతం సమకూరుస్తున్నారు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page