‘సదా పెళ్లి చేసుకోకపోవడం వెనుక ఇంత పెద్ద రహస్యం దాగి ఉందా… పెళ్లిపై మొదటి సారి నోరు విప్పిన సదా!

ప్రముఖ సీనియర్ హీరోయిన్ “సదా” పెళ్లి పై తనకునన్న అభిప్రాయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

‘జయం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అందాల భామ “సదా”. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ”సదా” తెలుగులో ఉదయ్ కిరణ్, అల్లరి నరేష్, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలతో నే కాక, తమిళ మలయాళo సినిమాల్లో అగ్రతారల సరసన నటించింది. అపరిచితుడు సినిమాలో విక్రమ్ సరసన ఈ ముద్దుగుమ్మ నటించింది. అప్పట్లో ఈమె పేరు మారుమ్రోగింది. కానీ మెల్లగా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఈ అమ్మడు సినిమాల్లో కనిపించకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్గా సత్తా చాటాలని పలు టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంతవరకు సదా పెళ్లి చేసుకోలేదనేప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలిపింది. నేను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇంత సంతోషంగా ఉన్నాను. నాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఉంది. వైల్డ్ లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం, జంతువులను ప్రేమించడం చాలా ఇష్టమని తెలిపింది. పెళ్లి చేసుకుంటే ఇవన్నీ నాకు దొరకవు ముఖ్యంగా మనల్ని అందరూ ఒకేలా అర్థం చేసుకోలేరు. పైగా ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా విడిపోతున్నారు. దానికన్నా పెళ్లి చేసుకోకపోవడమే చాలా బెటర్ అంటూ తన మాటల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చెప్పినా మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కొంతమంది నెటిజెన్స్ ఈమె మాటలతో ఏకీభవిస్తే, మరి కొందరు విమర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page