రెండో పెళ్లికి సిద్దమవుతున్న ఐశ్వర్య రజనీకాంత్… పెళ్లికొడుకు ఎవరంటే?

తమిళ నటుడు ధనుష్ ,ఐశ్వర్య రజనీకాంత్ దంపతులు విడిపోతున్నట్లుగా గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే .18 ఏళ్ల వారి వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు, వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు .కానీ మళ్ళీ కొద్ది రోజుల కిందట విడాకులు రద్దు చేసుకున్నారంటూ, పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ వార్తలపై అటు ధనుష్ కానీ ,ఇటు ఐశ్వర్యరజినీకాంత్ గాని ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో వీళ్ళిద్దరూ మళ్లీ కలవడం అనేది అసాధ్యమని! అభిమానులు కామ్ అయిపోయారు.

అయితే తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్ గా ఉంటున్నారు .అంతే కాకుండా ఓ సినిమాకు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఐశ్వర్య రజినీకాంత్ పై ఇలాంటి పుకార్లు రావడానికి ప్రధాన కారణం? ఈమధ్య కోలీవుడ్కు చెందిన ఓ హీరోతో ఆమె కనిపించడం అని తెలుస్తోంది.

చెన్నైలోని ఓ రిసార్ట్స్ లో అతనితో ఆమె సన్నిహితంగా మెలుగుతూ కనిపించడంతో ఈ రెండో పెళ్లికి రెడీ అయ్యింది అని పుకార్లు బలంగా వ్యాపిస్తున్నాయి. ఇందులో ఎంత మేరకు నిజముందో తెలియదు. ఈ విషయంపై ఐశ్వర్య రజనీకాంత్ స్పందిస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. లేదంటే ఇలాంటి పుకార్ల వల్ల రజనీకాంత్ కుటుంబం ఇమేజ్ దెబ్బతింటుందని వారు తెలుపుతున్నారు.

కారణం ఏంటనేది ఇప్పటికీ పూర్తిగా బయటకు తెలియదు. తామిద్దరం విడిపోతున్నట్లు మొదట ఐశ్వర్య రజినీకాంత్ ప్రకటించగా ,తర్వాత ధనుష్ ప్రకటించారు. దీంతో అంతా అవాక్కయ్యారు. కానీ ‘సుచీ’ లీక్స్ లో ధనుష్ ఫోటోలు బయటకు వచ్చిన రోజు నుంచే వీధి మధ్య గొడవ స్టార్ట్ అయిందని ప్రచారం ఉంది. ఆ తర్వాత ధనుష్ ఓ హీరోయిన్ తో చనువుగా ఉండడం ఐశ్వర్య కి నచ్చలేదని అందుకే ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది అని టాక్ ఉంది. కోలీవుడ్లో ధనుష్ కి ఉన్న ఎఫైర్స్ విషయంలో ఐశ్వర్య రజనీకాంత్ చాలా కాలంగా భరిస్తూ వచ్చి చివరకు చేసేదేమీ లేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీవర్గాలు పేర్కొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page