విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా నుండి ఇటీవల ఓ పోస్ట్ రిలీజ్ అయింది. ఇందులో విజయ్ దేవరకొండ పేరు ముందు The (ది) అని ఉంది. దీనికి అనసూయ “బాబోయ్ పైత్యం ఏం చేస్తాం అంటకుండా చూసుకుందాం” అంటూ పరోక్షంగా సెటైర్లు వేసింది. దీంతో ఆమెపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో అనసూయని ఇంకాస్త ఎక్కువగా టార్గెట్ చేశారు. అయితే అనసూయ విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేయడం అనేది కొత్త విషయం ఏం కాదు.
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో అనసూయ గొడవ ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. అసలు అనసూయ – విజయ్ దేవరకొండ వివాదం ఇప్పటిది కాదు. అర్జున్ రెడ్డి చిత్రం నుండి కొనసాగుతుంది. కొన్నాళ్లు అనసూయ విజయ్ దేవరకొండ మీద ఎలాంటి కామెంట్ చేయలేదు. లైగర్ ప్లాప్ టాక్ తెచ్చుకోగా అనసూయ పరోక్షంగా ఓ ట్వీట్ చేశారు. అమ్మను తిట్టిన వాళ్లకు ఇలాంటి ఫలితాలే వస్తాయని విజయ్ దేవరకొండను టార్గెట్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. అప్పట్లో అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వివాదం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ అయింది. తాజాగా మళ్లీ విజయ్ దేవరకొండ పేరు ముందు ది అని పెట్టడాన్ని ఆమె తప్పు పట్టారు.
అభిమానులు మళ్లీ అనసూయని టార్గెట్ చేయడంతో అనసూయ ఓ లైవ్ వీడియో ని చేసి అందులో తన కడుపు మంటని బయటపెట్టింది. అనసూయ ఈ వీడియోలో మీడియా సంస్థలను, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని ఏకిపారేశారు. నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు ట్రోల్స్ చేసి మీ పరువే పోగొట్టుకుంటున్నారని ఆమె పరోక్షంగా చెప్పారు. ఫలానా హీరో ఫ్యాన్స్ అనసూయను వేధించారు,ట్రోల్స్ చేశారు, వెంటపడ్డారు ఇది కాదు. ఇంకా మీకు దునియా దారి అర్థం కావడం లేదు. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు, అన్నవాడి నోరే కంపు, చేతగాని వాళ్లు అదుపు తప్పారు. ఇది మీరు పెట్టాల్సిన థంబ్ నెయిల్. బెటర్ లక్ నెక్స్ట్ టైం, అంటూ వీడియోని ఎండ్ చేశారు.
ఈ వివాదంలో కొందరు విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలవడం విశేషం. డైరెక్టర్ హరీష్ శంకర్ విజయ్ దేవరకొండకు బర్తడే విషెస్ తెలియజేస్తూ అనసూయకు చురకలు అంటించారు. ఇక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమె మీద ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. వార్తల్లో నిలవడానికి ఫేమస్ సెలబ్రిటీస్ మీద ట్రోల్ చేస్తుందని ఏకిపారేస్తున్నారు.
Leave a Reply