సూపర్ హిట్ “భగవంత్ కేసరి”… 2వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్!!..

నందమూరి నటసింహం “బాలకృష్ణ” , అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి సినిమా రీసెంట్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే…. మొదటి రోజు నుంచి కలెక్షన్ల సునామీని కురిపిస్తోంది.. ఫస్ట్ డే భారీ గ్రాస్ సొంతం చేసుకోగా రెండో రోజులో అడుగుపెట్టి అదే జోరును కొనసాగించింది!!!..

మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది…. మొదటి రోజు ఈ సినిమా రూ. 33 కోట్లలకు పైగా వసూళ్లను రాబట్టింది… ఈ మూవీకి రెండో రోజులో గట్టి పోటీ ఎదురైంది “రవితేజ” నటించి “టైగర్ నాగేశ్వరరావు” సినిమా నుండి భారీ పోటీ ఎదురైంది… అయినప్పటికీ మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ఉండడంతో రెండో రోజు కూడా భారీ వసూళ్లు అందుకుంది…

మొత్తంగా రెండు రోజుల్లో రూ. 51 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్నట్లు సమాచారం… రెండో రోజు శుక్రవారం వర్కింగ్ డే అయినప్పటికీ బాలయ్య మూవీ భారీగానే వసూలు రాబట్టింది.మ!!!…. దీంతో బాలయ్య మూవీ రెండు రోజుల్లోనే హాఫ్ సెంచురీ కొట్టేసింది!!!… ఒకవైపు “లియో” మరొకవైపు “టైగర్ నాగేశ్వరరావు” సినిమాలను ఎదుర్కొని దీటుగా మంచి కలెక్షన్స్ ని సంపాదించనని చెప్పుకోవచ్చు…. ఆఫ్లైన్ టికెట్స్ సేల్స్ పై ఎక్కువ డిపెండ్ అయిన సినిమా అన్నిచోట్ల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అంచనాలను మించితే ఈ ఈ సినిమా కలెక్షన్ల  రేంజ్ ఇంకా మించిపోవచ్చు.

యాక్షన్ ప్లస్ ఎమోషనల్ మూవీగా భగవంత్ కేసరి ప్రేక్షకుల నుండి మంచి టాక్ ని అందుకుంది… ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్గా నటించగా బాలకృష్ణ కూతురిగా శ్రీ లీల నటించింది… షైన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు.. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు… ఇక ఇప్పటికే భారీ కలెక్షన్లు అందుకున్న భగవంత్ కేసరి లాంగ్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే!!…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page