“టైగర్ నాగేశ్వరరావు” మూవీ రివ్యూ… మాస్ మహారాజా సినిమా ఎలా ఉందంటే?

మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” ఈ మూవీ స్టోరీ స్టువర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయినా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్…. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ అగర్వాల్ సమర్పణలు అభిషేక్ అగర్వాల్ నిర్మించారు…. ఇక ఈ మూవీలో హీరోయిన్స్ గా నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు!!…

అయితే రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీగా బడ్జెట్ పాన్ ఇండియా లెవెల్ లో రూపొందించిన టైగర్ నాగేశ్వరరావు పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి!!.. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసాలా ఉంది…. అంతేకాక సౌత్ తో పాటు నార్త్ లో కూడా ప్రమోషన్స్ గ్రాండ్గా నిర్వహించడంతో “టైగర్ నాగేశ్వరరావు “మూవీపై భారీగా హైప్ క్రియేట్ అయింది…. ఇలా రకరకాల ఫీట్స్ చేసి,హైప్ క్రియేట్ చేసి భారీ అంచనాల నడుమ  ఈరోజు(అక్టోబర్ 20) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది…. ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు పలుచోట్ల ఫస్ట్ డే షో పడిపోయింది. ఇక రికార్డ్స్ నే తరువాయి… మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో చూద్దాం…

సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పలు రకాలుగా వ్యక్తపరుస్తున్నారు . పలువురు నెటిజెన్స్ టైగర్ నాగేశ్వరావు కథేంటి? సినిమాకు ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? తదితర విషయాలను పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా చర్చలకు తెర లేపారు…. అయితే టైగర్ నాగేశ్వరరావుకు ట్విట్టర్లో మంచి స్పందన లభిస్తుంది…. డార్క్ క్యారెక్టర్ లో రవితేజ యాక్షన్ హైలెట్ అని మాస్ మహారాజా  ఫ్యాన్స్ థియేటర్లో ముందర సంబరాలు అంబరాన్ని అంటిస్తున్నారు….

ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి.. చాలామంది సినీ లవర్స్ ట్రైన్ సీక్వెన్స్ గురించి చర్చిస్తున్నారు. అయితే ఈ మూవీలో 1980 పదశకంలో దొంగతనాలతో గడగడలాడించిన స్టువర్ట్ పురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు పాత్రలో మాస్ మహారాజా రవితేజ తన ఫ్యాన్సును ఎంతగానో అంచనాలకు తగినట్లుగా తన నటనతో  మెప్పించారని చెప్పుకోవచ్చు!!!.. ఈ మూవీలో రవితేజ మాస్ ఎంట్రీ ఎలివేషన్లు దొంగతనాల యాక్షన్ సీక్వెన్స్ ట్విస్టులు పోలీసుల ట్రాప్ సీన్లు కొన్ని ఎమోషన్స్ సన్నివేశాలు ఈ మూవీకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి….

అయితే ఈ మూవీలో లవ్ ట్రాక్ కొంత వర్క్ అవుట్ కాలేదని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో రన్ టైం ఎక్కువగా ఉండడం వలన కొంత సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కానీ సినిమాలోని క్యారెక్టర్ లను తీర్చిదిద్దిన విధానం యాక్షన్ సీన్స్ వేరే లెవల్లో హాలీవుడ్ ను మించి ఉన్నాయి. ఇంటర్వెల్ క్లైమాక్స్ సన్నివేశాలు అదిరిపోయాయి. మ్యూజిక్ BGM చాలా బాగుంది. ఈ టైగర్ నాగేశ్వరరావు మూవీ ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ సూపర్ గా ఉంది . వి ఎఫ్ ఎక్స్ అంతగా  క్వాలిటీగా కనబడలేదు.

టోటల్ గా చెప్పాలంటే ఈ మూవీ మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కు  హిట్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన మూవీలలో కంటే బెస్ట్ ఫెరఫామెన్స్ తో ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడని చెప్పుకోవాలి. ఓవరాల్ గా టైగర్ నాగేశ్వరరావు ఒక బ్లాక్ మాస్టర్ మూవీ మాస్ ప్రేక్షకులకు ఇక జాతరే జాతర.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page