Saindhav Teaser: “సైకో వెంకీ” అదుర్స్…. లెక్క మార్చేసిన సైంధవ్ టీజర్!!! మీరు చూసేయండి…

“విక్టరీ వెంకటేష్” హీరోగా “శైలేష్ కొలను” దర్శకత్వంలో ఓ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాదు!! ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ మూవీ కావడం విశేషం… దీంతో ఈ సినిమా కోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!!… రీసెంట్ గానే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే… ఇక ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది… ఓసారి కత్తి మరోసారి గన్ పడుతూ వెంకిని ఎంతో పవర్ఫుల్ గా టీజర్ లో ఆవిష్కరించారు…

టీజర్ అత్యంత ఆసక్తిగా సాగింది… కూతురు, భార్యతో ఆనందంగా గడుపుతున్న హీరో జీవితం కొందరి కారణంగా చిన్న భిన్నం అవుతుంది… ఓ మాఫియా పైకి వన్ మాన్ ఆర్మీగా వెంకటేష్ యుద్ధం మొదలుపెడతాడు… చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే వాళ్లకు ఆయుధాలతో శిక్షణ ఇచ్చి టెర్రరిస్ట్ గా మార్చి ఓ గ్యాంగ్ పై హీరో తిరగబడతారని తేజ చూస్తేనే అర్థమవుతుంది…. “లెక్క మారుతి రా నా కొడకల్లారా” అంటూ టీజర్ చివర్లో వెంకటేష్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది ఈ టీజర్ వెంకటేష్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది…

సైంధవ సినిమాతో మెట్టు మొదటి సారిగా బాలీవుడ్ నటుడు “నవాజుద్దీన్ సిద్ధికి” టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు… జిస్షు సేమ్ గుప్తా, ముఖేష్ రిషి కూడా విలన్స్ గా నటించారు… వెంకీ భార్యగా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది… ఓ కీలక పాత్రలో “రుహాణీ శర్మ” నటిస్తుంది… ఇక టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్ తో నింపేశారు…. వెంకీ యాక్షన్ హీరో అవతారం అదిరిపోయింది… డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి!!…

ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో రానుంది…  జనవరి 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..  ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.  ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను అప్పుడే మొదలు పెట్టేశారు… మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్స్ విడుదల చేశారు… విజువల్స్ మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది.

ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరా మెన్ గా గ్యారి బిహెచ్ ఎడిటర్ గా అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కిషోర్ తాళ్లూరు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ “సైంధవ్” మూవీ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషల్లో మరియు హిందీలో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page