ఏపీలో మరో వందేభారత్ రైలు పట్టాలెక్కబోతోంది.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా జెండా ఊపి ఈ రైలును ఆదివారం (24 సెప్టెంబర్ 2023) ప్రారంభిస్తారు. విజయవాడ నుంచి తమిళనాడు రాజధానితోపాటు తిరుపతి ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేందుకు రేణిగుంట మీదుగా చెన్నై చేరుకుంటుంది. అదే మార్గంలో చెన్నై నుంచి విజయవాడకు వస్తుంది.
మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు ప్రయాణం..
- విజయవాడలో సాయంత్రం 3.20 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది.
- చెన్నై సెంట్రల్ స్టేషన్లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.10కి విజయవాడ చేరుకుంటుంది.
- మధ్యలో తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో హాల్ట్ ఉండేలా ఈ రైలు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు ఈ వందేభారత్ రైలు సర్వీసును నిర్వహిస్తారు.
- ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోల్‌తో పాటు మొత్తం 8 కోచ్ లు, 530 సీట్లతో ఈ రైలును రూపొందించారు.
రైలు ప్రయాణించే టైమింగ్స్ ఇలా…
- చెన్నై – విజయవాడ ట్రైన్ టైమింగ్స్
స్టేషన్ | చేరుకునే సమయం |
చెన్నై | 5.30 AM |
రేణిగుంట జంక్షన్ | 7.05 AM |
నెల్లూరు | 8.39 AM |
ఒంగోలు | 10.09 AM |
తెనాలి జంక్షన్‌కు | 11.21 AM |
విజయవాడ | 12.10 PM |
- విజయవాడ – చెన్నై ట్రైన్ టైమింగ్స్
స్టేషన్ | చేరుకునే సమయం |
విజయవాడ | 3.20 PM |
తెనాలి జంక్షన్ | 3.49 PM |
ఒంగోలు | 5.03 PM. |
నెల్లూరు | 6.19 PM. |
రేణిగుంట జంక్షన్ | 8.05 PM |
చెన్నై సెంట్ర | 10 PM |
టికెట్ ధరలు
1. విజయవాడ నుంచి చెన్నై సెంట్రలు కేటరింగ్ చార్జీలతో..
- ఏసీ చైర్ కార్: రూ. 1,420
- ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ కార్ రూ.2,630
కేటరింగ్ చార్జీ లేకుండా…
- ఏసీ చైర్ కార్: రూ. 1,135
- ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ.2,280
2. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడకు కేటరింగ్ చార్జీలతో..
- ఏసీ చైర్ కార్: రూ. 1,320
- ఎగ్జిక్యూటివ్ క్లాస్ .2,540
కేటరింగ్ చార్జీ లేకుండా..
- ఏసీ చైర్ కార్: రూ. 1,135
- ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ కార్ : రూ.2,280
Leave a Reply