APPSC GROUP 2 లో జరిగిన కీలక మార్పులు ఇవే.. గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు..

appsc recruitment

ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసులు… ప్రభుత్వ ఉద్యోగార్థులు ఎంతో ఆసక్తి చూపే ఉద్యోగాలు! గ్రూప్-2 ఎం పిక ప్రక్రియలో విజయం సాధించేందుకు లక్షల మంది అహర్నిశలు కృషి చేస్తున్న పరిస్థితి! నోటిఫికేషన్ కోసం వేచి చూడకుండా.. పరీక్ష ఎప్పుడు జరిగినా జాబ్ కొట్టాలనే లక్ష్యంతో రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీపడుతుంటారు! ఇలాంటి వారికి మేలు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా గ్రూప్ 2 పరీక్ష విధా నంలో కీలక మార్పులు ప్రకటించింది. అన్ని నేపథ్యాల అభ్యర్థులకు అనుకూలంగా ఉండేలా .. గ్రూప్-2 మెయిన్ విధానంలో మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్ష విధానంలో తాజా మార్పులు, సిలబస్ అంశాలు, వాటిపై పట్టు సాధించడమెలాగో తెలుసుకుందాం…..

» ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్ష విధానంలో మార్పులు

» అభ్యర్థులపై భారం తగ్గించే దిశగా నిర్ణయం » మెయిన్స్లో 300 మార్కులకు రెండు పేపర్లు

» యధాతథంగా స్క్రీనింగ్ టెస్ట్

» సరైన వ్యూహంతో చదివితే విజయం ఖాయం

‘గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్య ర్ధులు ఒకే సబ్జెక్ట్ను స్క్రీనింగ్, మెయిన్స్ రెండింటికీ చదవాల్సి వస్తోంది. దీంతో వారికి విలువైన సమయం వృథా అవుతోంది. ఏపీ ప్రభుత్వం తీసు కున్న తాజా నిర్ణయంతో అభ్యర్థులపై ఒత్తిడి తగ్గ డమే కాకుండా.. వారు ప్రిపరేషన్కు సరైన సమయం కేటాయించుకునే ఆస్కారం లభిస్తుంది’ -ఇది ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్షలో మార్పులపై నిపుణుల అభిప్రాయం.

నిపుణుల కమిటీ సిఫార్సులు

గ్రూప్-2 మెయిన్ పరీక్ష సిలబస్, టాపిక్స్, పేపర్ల విషయంలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ.. ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల ప్రకారం-గ్రూప్-2 మెయిన్ పరీక్షలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

గ్రూప్ 2 మెయిన్ ఇక రెండు పెపేర్లే

ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం- గ్రూప్-2 ఎంపిక ప్రక్రియలో రెండో దశ అయిన మెయిన్ ఎగ్జామినేషన్లో కీలక మార్పులు చేశారు.

* ఇంతకాలం 3 పేపర్లుగా నిర్వహిస్తున్న మెయిన్ పరీక్షలో ఇక నుంచి రెండు పేపర్లే ఉంటాయి.

* కొత్త విధానం ప్రకారం- ప్రతి పేపర్కు 150 మార్కులు చొప్పున మొత్తం 300 మార్కులకు మెయిన్ నిర్వహిస్తారు. అంటే ఇకపై రెండు పేపర్లు పేపర్ 1, పేపర్ 2 మాత్రమే ఉంటాయి.

ఆ మెయిన్ పేపర్-1లో 2 సెక్షన్లు ఉంటాయి. మొ దటి సెక్షన్లో ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర, సాంస్కృతిక ఉద్యమాలు; రెండో సెక్షన్లో భారత రాజ్యాంగ సమీక్ష సబ్జెక్ట్లు ఉంటాయి.

అదేవిధంగా పేపర్-2 మొదటి విభాగంలో.. భా రత, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ; రెండో విభాగం లో సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ లు ఉంటాయి.

* ఇలా రెండు పేపర్ల నేపథ్యంలో.. ఒక్కో పేపర్కు 150 మార్కులు చొప్పున మొత్తం 300 మార్కు లకు మెయిన్ ఎగ్జామినేషను నిర్వహిస్తారు.

మూడో పేపర్ తొలగింపు

గ్రూప్-2 మెయిన్ తాజా మార్పుల కోణంలో కీలకమైన అంశం.. ఇప్పటి వరకు ఉన్న మూడో పేపరు తొలగించడం, ఈ పేపర్లో ప్లానింగ్ ఇన్ ఇండియా, ఇండియన్ ఎకానమీ, సమకాలీన సమ స్యలు, ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యంగా గ్రామీణ ప్రాం తాల్లో అభివృద్ధి వంటి అంశాలున్నాయి. ఈ పేపర్

పూర్తిగా అకడమిక్ ఎకనామిక్స్ నేపథ్యం ఉన్న వారికి అనుకూలంగా ఉందని.. దీని వల్ల ఇతర నేప ద్యాల విద్యార్థులకు అవకాశాలు సన్నగిల్లుతున్నా యనే అభిప్రాయం వ్యక్తమైంది. వీటిని పరిగణన లోకి తీసుకున్న ఏపీపీఎస్సీ నిపుణుల కమిటీ.. మూడో పేపర్ అవసరం లేదని పేర్కొంది. ఈ పేప ర్ను తొలగించొచ్చని సిఫార్సు చేసింది. దీంతో ఈ మూడో పేపరు పూర్తిగా తొలగించారు. అయితే దీనికి బదులుగా కొత్తగా పేర్కొన్న పేపర్-2లో భారత్, ఏపీ ఆర్ధిక వ్యవస్థలను చేర్చారు.

స్క్రీనింగ్ టెస్ట్ యధాతధం

గ్రూప్-2 ఎంపిక ప్రక్రియలో తొలి దశగా పేర్కొ నే స్క్రీనింగ్ టెస్ట్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతమున్న విధానంలో స్క్రీనింగ్ టెస్ట్ ఒక పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్లలో 150 మార్కులకు ఉంటుంది.

రెండుసార్లు చదవాల్సిన శ్రమ లేకుండా

• ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్షలో మార్పులు తీసుకోవడానికి ప్రధాన కారణం.. పలు అం శాలు.. తొలి దశ స్క్రీనింగ్ టెస్ట్లో పాటు, మెయిన్ ఎగ్జామ్లోనూ పునరావృతం అవుతుం డడమే. అభ్యర్థులు కూడా ఆయా టాపిక్స్ను స్క్రీనింగ్ టెస్ట్లకు, మెయిన్ ఎగ్జాము రెండు సార్లు చదవాల్సి వస్తోంది. దీంతో సమయం సరి పోక ఇబ్బంది పడుతున్నారు.

| పాత విధానంలో స్క్రీనింగ్ టెస్ట్లో జనరల్ స్టడీస్ పేపర్… మెయిన్ పరీక్షలోనూ ఉంది. సిల బస్ అంశాలు కూడా ఒకే విధంగా ఉన్నాయి.

= దీంతో అభ్యర్థులు జనరల్ స్టడీస్ న్ను రెండుసార్లు అధ్యయనం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల సమయం వృథా అవడమే కాకుండా.. అప్పటికే స్క్రీనింగ్ టెస్ట్లో ఈ అంశాలపై నిర్వ హించిన పరీక్షలో విజయం సాధించిన వారికి.. రెండో దశలో మళ్లీ ఇవే టాపిక్స్ పరీక్ష అవసరం. లేదనే ఉద్దేశంతో జనరల్ స్టడీస్ ను తొలగించి. నట్లు తెలుస్తోంది.

సైన్స్ అండ్ టెక్నాలజీకి చోటు

|గ్రూప్-2 మెయిన్ ఎగ్జామినేషన్ మార్పుల్లో మరో ముఖ్యమైన అంశం.. రెండో పేపర్లో సెక్ష న్-2గా సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాన్ని కొత్తగా చేర్చడం. ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్ధులకు సైన్స్ అండ్ టెక్నాల జీపై అవగాహన తప్పనిసరిగా మారింది. దీం తో కొత్తగా ఈ అంశాన్ని చేర్చారు. ఇప్పటివరకు ఉన్న విధానంలో ఏ పేపర్లోనూ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ కు చోటు లేదు. తాజా నిర్ణ యంతో అభ్యర్థులు ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ పైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

ఆ మొత్తంగా చూస్తే.. గ్రూప్-2 పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం అభ్యర్థులపై ఒత్తిడిని తగ్గించడమే కాకుం డా… పరీక్షకు సన్నద్ధమయ్యే వారు తమ సమ యాన్ని సమర్ధంగా వినియోగించుకునే అవకా శం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకే టాపిక్ను మరోసారి అధ్యయనం చేయా ల్సిన అవసరం లేకుండా.. ఆ సమయాన్ని వేరే టాపిక్కు కేటాయించుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

గ్రూప్-2 కొత్త ఎంపిక విధానం

= మొదటి దశ స్క్రీనింగ్ టెస్ట్; గ్రూప్-2లో మొదటి దశగా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిటిటీ అంశాలతో 150 మార్కులకు నిర్వహిస్తారు.

ఆ రెండో దశ మెయిన్ ఇలా: స్క్రీనింగ్ టెస్ట్లో పొం దిన మార్కులు, ప్రతిభ ఆధారంగా.. 1.50 నిష్ప త్తిలో రెండో దశ మెయిన్క ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష రెండు పేపర్లుగా 300 మార్కులకే ఉంటుంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది.

PaperSubjectMarks
1సెక్షన్-1: సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రప్రదేశ్లోని సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు) సెక్షన్-2: భారత రాజ్యాంగం సమీక్ష150
2సెక్షన్-1: భారత్, ఏపీ ఆర్ధిక వ్యవస్థ సెక్షన్-2: సైన్స్ అండ్ టెక్నాలజీ150
 మొత్తం300

పట్టు సాధించడానికి మార్గాలివే

హిస్టరీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. ప్రాచీన చరిత్ర మొదలు ఆధునిక చరిత్ర వరకూ.. ముఖ్యమైన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర గురించి అధ్యయనం చేయాలి. భారతదేశ చరిత్రకు సంబం ధించిన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా.. భారత జాతీయోద్యమంపై ప్రధా నంగా దృష్టి పెట్టాలి. ఆంధ్ర ప్రాంత ఉద్యమాలకు సంబంధించి ఆంధ్ర జనసంఘం, ఆంధ్రమహాస భల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల గురించి తెలు సుకోవాలి. వారి ఆధ్వర్యంలో జరిగిన సభలు, సమావేశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. విశా లాంధ్ర ఉద్యమానికి సంబంధించి పెద్దమనుషులు ఒప్పందంలోని కీలక అంశాలు తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చరిత్రకు సంబంధించి శాత వాహనుల కాలం నుంచి తూర్పు చాళుక్యుల వర కు.. అన్ని రాజ వంశాల కాలంలో ముఖ్య ఘట్టాలు, కళలు, సాహిత్యాభివృద్ధికి చేసిన కృషి, ముఖ్యమైన నిర్మాణాలు – వాటి విశిష్టత (ఉదా: బౌద్ధ స్థూపా లు) గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి.

పాలిటీ: గ్రూప్-2 మెయిన్ పేపర్-2లో సెక్షన్- 2గా పేర్కొన్న భారత రాజ్యాంగ సమీక్ష విషయం పట్టు సాధించాలి. భారత రాజ్యాంగం లో పాలిటీపై ముఖ్య లక్షణాలు ప్రవేశిక: ప్రాథమిక విధులు; ప్రాథమిక హక్కులు; ఆదేశిక సూత్రాలు; భారత సమాఖ్య: విశిష్ట లక్షణాలు; కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల మధ్య అధికారాల విభజన, శాసన, కార్యని ర్వాహక, న్యాయవ్యవస్థ పాత్రలపై నిర్దేశిత సిలబస్ ప్రకారం-లోతుగా అధ్యయనం చేయాలి. పంచా యతీరాజ్ వ్యవస్థ, 73,74 రాజ్యాంగ సవరణలు; వాటి ప్రాముఖ్యత; తేదీలు వంటి వాటిపై దృష్టి సారించాలి. కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యని ర్వాహక విధుల విభజన, కేంద్ర రాష్ట్ర సంబం త్వాల మధ్య అధికారాల విభజన; శాసన, కార్యని ర్వాహక, న్యాయవ్యవస్థ పాత్రలపై నిర్దేశిత సిలబస్ ప్రకారం-లోతుగా అధ్యయనం చేయాలి. పంచా యతీరాజ్ వ్యవస్థ; 73,74 రాజ్యాంగ సవరణలు; వాటి ప్రాముఖ్యత; తేదీలు వంటి వాటిపై దృష్టి సారించాలి. కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యని ర్వాహక విధుల విభజన, కేంద్ర రాష్ట్ర సంబం ధాలు గురించి రాజ్యాంగంలో పేర్కొన్న అధికరణ లను అధ్యయనం చేయాలి. కేంద్ర-రాష్ట్ర సంబంధా ల విషయంలో అవసరమైన సంస్కరణలు, ఆయా కమిషన్ల సిఫార్సులు (ఉదా: రాజమన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్ తదితర) అధ్యయనం చేయా లి.ఆయా రాజ్యాంగ పదవులు (రాష్ట్రపతి, గవర్నర్). నియామకం తీరుతెన్నులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తాజాగా రాజ్యాంగ సవరణల ద్వారా రూపొందిన కొత్త చట్టాలపై అవగాహన మేలు చేస్తుంది.

భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ

గ్రూప్-2 మెయిన్ పేపర్ 2లో సెర్షన్-1గా ఉన్న ఈ అంశానికి సంబంధించి భారత్లో పంచ వర్ష ప్రణాళికల నుంచి ప్రారంభించి తాజా ఆర్థిక పరిణామాల వరకు.. అన్ని అంశాలను అధ్యయనం చేయాలి. 1956 నుంచి అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ఆర్బీఐ ఏర్పాటు, నూతన విదేశీ వాణిజ్య విధానం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి తెలుసుకోవాలి దేశంలో సహజ వనరుల లభ్యత, ఆర్థికాభివృద్ధి దిశగా అవి దోహదపడు తున్న తీరుపై అధ్యయనం చేయాలి. కోర్ ఎకాన మీకి సంబంధించి ద్రవ్యం, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనా స్త్రీల నిర్వచనాలు సిద్ధాంతాలు తెలుసుకోవాలి. అదే విధంగా జాతీయాదాయ భావనలు, జీడీపీ, తలసరి ఆదాయం వంటి బేసిక్ కాన్సెప్టపై పరి పూర్ణ అవగాహన అవసరం. వీటికితోడు ఆర్ధిక రం గంలో తాజా పరిణామాల గురించి కూడా చద వాలి. ఆర్ధిక సంఘం సిఫార్సులు, తాజా బడ్జెట్ గణాంకాలు వంటి వాటిపై అవగాహన ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి సహజ వనరుల లభ్యత మొదలు సామాజిక ఆర్థిక సంక్షేమ పథకాల వరకూ..అన్నింటినీ అధ్యయనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని ముఖ్యమైన వనరులు, అవి లభించే ప్రాంతాలు, పంటలు- దిగుబడి కార కాల గురించి తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రాం తంలో పంచవర్ష ప్రణాళికల అమలు తీరుతెన్ను లపై అధ్యయనం చేయాలి. ఏపీ ప్రభుత్వం ఆమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారులు, బడ్జెట్ కేటాయింపులపై అవగాహన ఏర్పరచుకోవాలి.

సైన్స్ అండ్ టెక్నాలజీ

గ్రూప్-2 మెయిన్ పేపర్ 2లో కొత్తగా చేర్చిన టాపిక్.. సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనిపై పట్టు సాధించడం కోసం అభ్యర్థులు భారత అభివృద్ధిలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర; మోడ్రన్ ట్రెండ్స్ ఇన్ లైఫ్ సైన్సెస్: అభివృద్ధి, వాతావరణ సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. కోర్ సైన్స్ అంశాల పైనా పట్టు సాధించాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయలాజికల్ సైన్సెస్లో ఆయా అంశాలకు సంబంధించి ప్రాథమిక భావనలు, వాటి అనువర్తనాలు, ప్రమాణాల గురించి తెలుసుకోవాలి. దేశ శాస్త్ర సాంకేతిత రంగంలో తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. ఇస్రో ప్రయోగాలు, డిఆర్డిఓ క్షిపణి వ్య వస్థ, ఆయుధ వ్యవస్థల గురించి తెలుసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page