Vande Bharat Express Train Specialties – వందేభార‌త్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే

About Vande Bharat Express (వందే భారత్ ఎక్స్ప్రెస్) :

వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ అనేది సెమీ-హై-స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు, దీన్ని భారతీయ రైల్వే నిర్వహిస్తుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ని డిజైన్ చేసి తయారు చేసింది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కింద మొదటి రైలు ₹97 కోట్లతో 18 నెలల్లో తయారు చేయబడింది.ప్రస్తుతం రెండో దశ లో నిర్మించబడిన వందే భారత్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి .
మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 18, 2019 న ప్రారంభమైంది. ఢిల్లీ – వారణాసి (ఉత్తర ప్రదేశ్) మార్గంలో ప్రారంభమైంది.

Specialities of Vande Bharat Express (ప్రత్యేకతలు ఇవే):

వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ట్రైన్
గరిష్టంగా 160 kmph వెంగంతో ప్రయాణించేలా దీన్ని రూపొందించారు.. అయితే ప్రస్తుతం వాటికి తగ్గట్టు ట్రాకులను తయారుచేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి దీనిని 130 కిలోమీటర్లు గరిష్ట వేగంతో నడుపుతున్నారు.

వందే భారత్ ఎక్ష్ప్రెస్స్ ట్రైన్ పూర్తిగా భారత్ లో ఉత్పత్తి చేయబడింది. అందుకే ఈ ట్రైన్ పేరును 2019 లో ట్రైన్ 18 నుంచి వందే భారత్ ఎక్ష్ప్రెస్స్ గా మార్చడం జరిగింది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ (EC) మరియు చైర్ కార్ (CC) అనే రెండు తరగతుల సీటింగ్ ఉన్నాయి. EC సీట్లు 2×2 పద్ధతిలో, CC సీట్లు 3×2 పద్ధతిలో ఏర్పాటు చేయబడ్డాయి.

వందే భారత్ ఎక్స్ప్రెస్ లో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. ఈ ట్రైన్ పూర్తిగా ఏసి కొచులతోటి ఉంటుంది. ఇందులో Wifi సౌకర్యం కూడా ఉంటుంది.

పందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రతి సీటును ఎంతో సౌకర్యవంతంగా రూపొందించారు.. ప్రతి సీటుకి చార్జింగ్ పాయింట్ ఉంటుంది. Executive Coaches లో సీట్లను 180 డిగ్రీలు తిప్పుకునేలా రూపొందించారు.

వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఆటోమేటిక్ డోర్లు, సీసీటీవీ కెమెరాలు, 32-అంగుళాల స్క్రీన్‌లు ప్రయాణికులకు ఆడియో-విజువల్ ప్యాసింజర్ సమాచారాన్ని అందిస్తాయి.

ఇప్పటి వరకు నాలుగు దశల్లో వీటిని డెవలప్ చేస్తున్నారు. ఇప్పటివరకు రెండో దశలో నిర్మాణం అయిన VB 2.0 ను అందుబాటులోకి తెచ్చారు. మూడో దశలో VB 3.0 లో స్లీపర్ కోచులను కూడా ప్రవేశ పెట్టనున్నారు.

Vande Bharat Train in Telugu States – తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించబడిన వందే భారత్ ఎక్ష్ప్రెస్

సంక్రాతి రోజు అనగా 15 జనవరి 2023 న తెలుగు రాష్ట్రాల్లో తోలి వందే భారత్ ట్రైన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.ఇది సికింద్రాబాద్ నుంచి వైజాగ్ మధ్యలో ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ వరంగల్ , ఖమ్మం , విజయవాడ మరియు రాజమండ్రి లో కూడా ఆగుతుంది.

విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20833) ఉదయం 05.45 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం రైలు (20834) సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మధ్యలో ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌లో రెండు వైపులా ఆగుతుంది.

Vizag to Secunderabad Vande Bharat Train Fare – టికెట్ ధరలు

AC Chair Car (CC) fare:

  • from VSKP to SC – Rs 1,720
  • from VSKP to Rajahmundry – Rs 625
  • from VSKP to Vijayawada Junction – Rs 960
  • from VSKP to Khammam – Rs 1,115
  • from VSKP to Warangal – Rs 1,310

Executive Chair Car (EC) fare :-

  • from VSKP to SC – Rs 3,170
  • from VSKP to Rajahmundry – Rs 1,215
  • from VSKP to Vijayawada Junction – Rs 1,825
  • from VSKP to Khammam – Rs 2,130
  • from VSKP to Warangal – Rs 2,540

Trains Launched So far – ఇప్పటివరకు ప్రారంబించిన ట్రైన్స్ మరియు రూట్స్

New Delhi – Varanasi Vande Bharat Express (stops : Kanpur Central and Prayagraj Junction)

New Delhi – Shri Mata Vaishno Devi Katra Vande Bharat Express (stops: Ludhiana Junction and Jammu Tawi)

Mumbai Central – Gandhinagar Capital Vande Bharat Express (stops: Surat, Vadodara Junction and Ahmedabad Junction)

New Delhi – Amb Andaura Vande Bharat Express (stops: Chandigarh Junction)

MGR Chennai Central – Mysuru Vande Bharat Express (Katpadi Junction and KSR Bengaluru)

Bilaspur – Nagpur Vande Bharat Express (Raipur Junction, Durg Junction and Gondia Junction)

Howrah – New Jalpaiguri Vande Bharat Express (Bolpur Shantiniketan, Malda Town and Barsoi)

Visakhapatnam – Secunderabad Vande Bharat Express (stops: Rajamundry, Vijayawada Junction, Khammam and Warangal)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!