మన దేశం లో వేగవంతమైన, సురక్షితమైన, లగ్జరీ ప్రయాణాన్ని అందిస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ లలో ఇక స్లీపర్ వేరియంట్లు రానున్నాయి. 2024 వరకు వీటిని అందుబాటులోకి తీసుకురావాలని భారతీయ రైల్వే భావిస్తోంది.
ఇప్పటివరకు చైర్ కార్ బోగీలకే పరిమితమైన వందేభారత్ రైళ్లలో త్వరలో స్లీపర్ కోచ్ లు రానున్నాయి. ఈ మేరకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ కోచ్ ల తయారీకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) కసరత్తు చేస్తోంది. ఈ రైళ్లలో స్లీపర్ వేరియంట్ ను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే యోచిస్తున్నట్లు పేర్కొంది.
2025 సంవత్సరం చివరి నాటికి 278 వందేభారత్ రైళ్లు
- 200 వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ తయారు చేస్తోందని.. ఇందులో స్లీపర్ కోచ్‌ల సౌకర్యం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మేధా, ఐసీఎఫ్ చెన్నై అనే ప్రైవేట్ సంస్థలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను స్లీపర్ క్లాస్‌తో తయారు చేసేందుకు ఆర్డర్‌ను పొందాయి. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఈ నెలాఖరులోగా ఖరారు చేయనున్నారు. 2025 సంవత్సరం చివరి నాటికి 278 వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తాయని అంటున్నారు.
ఆగస్టు 15 నాటికి దేశంలో 75 వందేభారత్ రైళ్లు
- వందేభారత్ సిరీస్‌లో భాగంగా తొలి దశలో 78 రైళ్ల తయారీ పనులు కొనసాగుతున్నాయి. ఈ రైళ్లన్నీ తక్కువ దూరాన్ని కలిగి ఉంటాయి. వీటిలో సీటింగ్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి 8 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి దేశంలో 75 వందేభారత్ రైళ్లు నడుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఎర్రకోట నుంచి ప్రకటించారు. ఈ గడువు సమీపిస్తోంది. టెండర్లు పొందిన రెండు కంపెనీలు వేగంగా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాయి.
Leave a Reply