తెలంగాణ రాష్ట్ర పాలి టెక్నిక్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఒక బ్రాంచిలో చేరిన విద్యార్థులు మరో బ్రాంచికి మారే స్లైడింగ్ ప్రక్రియను ప్రవేశ పెట్టనున్నారు. సైడింగ్ విధానం ద్వారా విద్యార్థులు ఒకే కాలేజీలో ఒక కోర్సు నుండి మరో కోర్సుకు మారే అవకాశం ఉంటుంది.
మరో బ్రాంచికి మారినా ఫీజు రీయింబర్స్మెంట్ పొందేందుకు అర్హులవుతారా?
రెండు విడతల కౌన్సెలింగ్ ముగిశాక అప్పటికే కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరిన వారికి సైడింగ్ నిర్వహిస్తారు. తద్వారా ఓ కళాశాలలో ఖాళీగా ఉన్న బ్రాంచీల్లో ఆ కళాశాలకే చెందిన మరో బ్రాంచి విద్యార్థులు చేరవచ్చు. ఈ ప్రక్రియను కన్వీనర్ ఆధ్వర్యంలో జరపడం వల్ల విద్యార్థులు మరో బ్రాంచికి మారినా ఫీజు రీయింబర్స్మెంట్ పొందేందుకు అర్హులవుతారు.
చివరి విడత సీట్లను జూలై 7న కేటాయించనున్నారు…
స్లైడింగ్ ప్రక్రియ ముగిశాక స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటి వరకు పాలిసెట్ స్పాట్ ప్రవేశాలను కన్వీనర్ ఆధ్వర్యంలో జరుపుతుండగా, ఇక నుంచి కళాశాలల యాజమాన్యాలకే అప్పగించనున్నారు. రాష్ట్రంలో 56 ప్రభుత్వ, 60 ప్రైవేట్ కళాశాలలున్నాయి. మొత్తం 29,396 సీట్లున్నాయి. పాలిసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ముగియగా, చివరి విడత సీట్లను జూలై 7న కేటాయించనున్నారు
(మరిన్ని విద్య ఉద్యోగాల సమాచారం కోసం మన telegram చానల్ లో జాయిన్ అవ్వండి)
Leave a Reply