తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఒక నిమిషం ఆలస్యమైన పరీక్ష హాల్లోకి అనుమతించని నిబంధనని తొలగిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఇంటర్ రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతించాలని ఇంటర్ బోర్డు ఉత్తర్వులలో తెలిపింది.
నిమిషం ఆలస్యం అయినా నిబంధన వల్ల చాలా మంది విద్యార్థులు మనో వేదనకు గురై, ఒత్తిడితో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి వస్తుంది. చాలా సందర్భాలలో విద్యార్థుల ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు తెలిసిందే. అయితే ఈ నిబంధన పై పలుమార్లు గతంలో కూడా విమర్శలు రేకెత్తడంతో, తాజాగా ఇంటర్ బోర్డు అయిదు నిమిషాల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాలలో అనుమతించాలని అధికారులను ఆదేశించింది.
Leave a Reply