TS EAMCET AND PG ECET Schedule Released తెలంగాణ ఎంసెట్ పీజీ ఈ సెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఎంసెట్‌, పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేశారు.

ఈనెల 28న  నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి వెల్లడించారు. మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 30 నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని.. మే 7 నుంచి 11 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.

పీజీ ఈసెట్‌కు ఇలా..

పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌నూ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 28న పీజీ ఈసెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 24 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. మే 21 నుంచి పీజీ ఈసెట్‌ హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. మే 29 నుంచి జూన్‌ 1 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.

పీజీ ఈసెట్‌ ముఖ్యమైన తేదీలివే..

*నోటిఫికేషన్ తేదీ : 28-02-2023

*ఆన్‌లైన్‌ అప్లికేషన్స్ స్వీకరణ తేదీ : 03-03-2023

*ఆన్‌లైన్‌ అప్లికేషన్స్ స్వీకరణ చివరి తేదీ : 30-04-2023

*ఆన్‌లైన్‌ అప్లికేషన్స్‌లో మార్పులు చేసుకునే తేదీలు : 02-05-2023 నుంచి 04-05-2023 వరకు

*250 రూపాయల అపరాధ రుసుముతో ఆన్‌లైన్‌ అప్లికేషన్ చివరి తేదీ : 05-05-2023

*500 రూపాయల అపరాధ రుసుముతో ఆన్‌లైన్‌ అప్లికేషన్ చివరి తేదీ : 10-05-2023

* 2500 రూపాయల అపరాధ రుసుముతో ఆన్‌లైన్‌ అప్లికేషన్ చివరి తేదీ : 15-05-2023

* 5000 రూపాయల అపరాధ రుసుముతో ఆన్‌లైన్‌ అప్లికేషన్ చివరి తేదీ : 24-05-2023

* 21-05-2023 తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

* పరీక్షా తేదీలు : 29-05-2023 నుంచి 01-06-2023 వరకు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!