2023-24 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని వివిద అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కాలేజీల్లో అడ్మిషన్ కొరకు నిర్వహించు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CETs) లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తోంది.
కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CETs) వారీగా పరీక్షా తేదీల వివరాలు:
TS CETs-2023 | Test Date | Timings | |
Fore noon | After noon | ||
TS EAMCET(Engg & Pham.) | 10.05.2023 & 11.05.2023 (Agri.&Pham.) | 09:00 AM to12.00 Noon | 03:00 PM to 06:00 PM |
12.05.2023 to 14.05.2023 (Engineering) | 09:00 AM to12.00 Noon 03:00 PM to 06:00 PM | ||
TS Ed.CET (B.Ed.) | 18.05.2023 | 09:00 AM to 11.00 AM 12.30 PM to 02.30 PM 04:00 PM to 06:00 PM | |
TS ECET (B.Tech. Lateral Entry) | 20.05.2023 | 09:00 AM to Noon | |
TS LAWCET & TS PGLCET (Law Courses) | 25.05.2023 | 09:30 AM to 10.30 AM 12.30 PM to 02:00 PM to 03:30 PM 05:00 PM | |
TS ICET (MBA and MCA) | 26.05.2023 & 27.05.2023 | 10.00 AM to 12:30 PM | 02:30 PM to 05:00 PM |
TS PGECET (M.Tech. /M.Arch.) | 29.05.2023 to 01.06.2023 | 10:30 AM to 12:00 Noon | 02:30 PM to 04:00 PM |
పరీక్షా కేంద్రాల సంఖ్య
- తెలంగాణ: 104
- ఆంధ్ర ప్రదేశ్: 33
అభ్యర్థులు మరియు తల్లిదండ్రులకు ముఖ్యమైన సూచనలు
* పరీక్ష కేంద్రం ఉన్న ప్రదేశాన్ని తెలుసుకోవడం కోసం అభ్యర్థి పరీక్షా కేంద్రాన్ని ముందుగానే సందర్శించాల్సి వుంటుంది.
* మొదటి పరీక్షా సేషన్ కు గాను ఉదయం 07:30 ని.ల నుండి పరీక్షా కేంద్రములోకి అనుమతించడబడతారు. అలాగే రెండవ సెషన్ కు గాను మధ్యాహ్నం 01.30 ని.ల నుండి పరీక్షా కేంద్రాములోకి అనుమతించబడతారు.
* పరీక్ష ప్రారంభమైన తర్వాత అభ్యర్థులను ఎట్టి పరిస్థితిలో పరీక్ష హాలులోకి అనుమతించబడరు. అనగా మొదటి సెషన్ కు ఉదయం 09.00 గంటల తర్వాత, రెండవ సెషన్కు మధ్యాహ్నం 03.00 గంటల తర్వాత (అతను/ఆమె ఒక నిమిషం ఆలస్యమైనప్పటికీ అనుమతించబడరు) అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష ముగిసే వరకు (అనగా, మొదటి సెషన్ కు మధ్యాహ్నం 12.00 ని.ల వరకు మరియు రెండవ సెషన్ సా. 06.00 ని.ల వరకు) పరీక్షా హాల్ నుండి బయటకు వెళ్లడానికి అనుమతించబడదు.
* పరిక్షా హాల్ లోపలికి చెక్-ఇన్ విధానంలో బయోమెట్రిక్ డేటా (కుడి చేతి బొటనవేలు ముద్ర మరియు ఛాయాచిత్రం) క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అలాగే అభ్యర్థులను పరీక్షా హాల్లోకి అనుమతించడానికి సంబదిత TS-EAMCET-2023 అధికారుల పర్యావేక్షణలో మీ గుర్తింపు దృవపత్రాలను పరిశీలించి – తనిఖీ చేసి వాటిని దృవీకరించిన తర్వాతనే అభ్యర్థులను పరీక్షా హాల్లోకి అనుమతిస్తారు.
* అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, టాటూలు, ఇంకా మొదలైన బాహ్య డిజైన్లు/ నమూనాలను అవి ఏవి కూడ లేకుండా బయోమెట్రిక్ డేటా (కుడి చేతి బొటనవేలు ముద్ర మరియు ఛాయాచిత్రం) సేకరణకు ప్రయోజనకరంగా ఉండే విధంగా అభ్యర్థులు వారి చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించడమైనది.
అభ్యర్థులు పరీక్ష హాలులోకి ఈ క్రింద తెల్పిన వాటిని తమ వెంట తీసుకెళ్లాలి
- బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్
- పరిక్షా హాల్ టికెట్
- ఎస్సీ/ఎస్టీ కేటగిరికి సంబందించిన అభ్యర్థులు ఎవరైనా ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను సమర్పించే సమయంలో వారి కుల ధృవీకరణ పత్రము నెంబరు ను ఆన్లైన్ నమోదు చేయనిచో వారు కుల ధృవీకరణ పత్రమును సమర్పించ వలసివుంటుంది.
ఈ క్రింద పేర్కొన్న వస్తువులను అభ్యర్థులు పరీక్ష హాలులోకి అనుమతింప బడవు.
- కాలిక్యులేటర్లు, గణితం / లాగ్ టేబుల్స్, పేజర్లు, సెల్ ఫోన్లు రిస్ట్-వాచీలు లేదా ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మరియు వ్యక్తిగత వస్తువులను పరీక్ష హాల్లోకి తీసుకెళ్లడం ఖచ్చితంగా నిషేధించబడింది.
- ద్విభాషా ప్రశ్న పత్రంలోని అనువాదంలో ఏదైనా అస్పష్టత ఉంటే (లేదా) ఏదైనా వ్యత్యాసం ఉంటే, ఇంగ్లీష్ వర్షన్ ప్రశ్నను ఫైనల్ గా పరిగణించబడును.
- * ఇన్విజిలేటర్ ఇచ్చే సూచనలను అభ్యర్థులు తప్పక పాటించాల్సి వుంటుంది.
- * అభ్యర్థి గుర్తించేందుకు వీలుగా తప్పకుండా ఈ పేర్కొన్న ఏదైనా ఒక దాని ఒరిజినల్ కాఫీని తమ వద్ద కల్గివుండాలి (ఫోటోకాపీ కాదు / స్కాన్ కాపీ కాదు).
- కళాశాల ఐ.డి. కార్డు/ఆధార్ కార్డు / డ్రైవింగ్ లైసెన్స్ / పాస్పోర్ట్ / పాన్ కార్డు / ఓటర్ ఐ.డి కాని కల్గివుండాలి.
- * అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్లో సంతకం చేసినట్లుగానే ఇన్విజిలేటర్ సమక్షంలో హాల్ టిక్కెట్ పై సంతకం చేయాల్సి వుంటుంది.
ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, TS EAMCET -2023 ఆన్లైన్ పరీక్ష మరియు ఇతర కామన్ ఎంట్రెన్స్ టేస్ట్ లకు CETలకు హాజరయ్యే అభ్యర్థులు అనుసరించాల్సిన సూచనలను మరియు సంబంధించిన ముఖ్యాంశాలపై విస్తృత ప్రచారం ఇవ్వాలని మీడియా స్నేహితులందరినీ అభ్యర్థిస్తున్నాము. అలాగే నోటిఫికేషన్ విడుదల చేసిన నాటినుండి నేటి వరకు నిరంతర మద్దతు తెలుపుతున్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
Leave a Reply