చంద్రయాన్-3ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా అడుగుపెట్టిన ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు.
చంద్రయాన్-3ను విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలతోపాటు సిబ్బందిని ప్రధాని మోడీ అభినందించారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం నేరుగా బెంగుళూరు చేరుకున్నారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసి భారత ఖ్యాతిని దశదిశలుగా వ్యాపింప చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకుని వారిని ప్రధాని మోడీ అభినందించారు.
జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అని నినదించిన నరేంద్ర మోడి..
భారతదేశానికి ఇది సరికొత్త వేకువని ప్రధాని మోడీ కొనియాడారు. జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అని నినదించి ప్రజలను ఉత్సాహపరిచారు. ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తలతో మాట్లాడుతూ.. ఈరోజు భారత్ చంద్రుడిపై అడుగు పెట్టింది. భారతదేశం ప్రపంచానికి వెలుగులు విరజిమ్ముతుంది భారత్ సత్తా ఏంటో ఈ రోజు ఇస్రో ప్రపంచానికి చూపించింది.. ఇస్రో శాస్త్రవేత్తల కృషికి, నిబద్ధతకు సెల్యూట్ చేస్తున్నాను. చంద్రయాన్-3 విజయం దేశ ప్రజల్లో సంతోషాన్ని కలిగించింది. ఇది మామూలు విజయం కాదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకెళ్తంది. ప్రతీ ఇంటిపైనే కాదు.. చంద్రుడిపై కూడా భారత జెండా ఎగురుతోంది. ఇస్రో సాధించిన విజయం దేశానికే గర్వకారణం. భారతదేశం యొక్క శక్తి సామర్ధ్యాలను ప్రపంచమంతా కీర్తిస్తోంది. ఎవ్వరూ సాధించలేని విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారు. దేశాభివృద్ధిలో స్పేస్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది.అని కొనియాడారు..
చంద్రయాన్-3 అడుగుపెట్టిన స్థలాన్ని శివశక్తి స్థల్ గా నామకరణం…
- చంద్రయాన్-3 అడుగుపెట్టిన స్థలాన్ని శివశక్తి స్థల్‌గా నామకరణం చేస్తున్నాం. చంద్రయాన్-2 దిగిన ప్రాంతాన్ని తిరంగా పాయింట్‌గా పేరు పెడుతున్నాం. ఈ ప్రయోగంలో మహిళా సైంటిస్టుల పాత్ర ఎంతో ఉంది. నేడు భారత సాంకేతిక శక్తిని ప్రపంచమంతా చూస్తోంది. అంతరిక్ష రంగంలో భారతదేశం చరిత్ర సృష్టించింది. ఇస్రో శాస్త్రవేత్తలు దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారు. చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టిన ఆగస్టు 23ను ఇకపై మనం నేషనల్ స్పేస్ డేగా జరుపుకుందామంటూ ప్రధాని మోడీ ప్రసంగించారు.
Leave a Reply