ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు గాను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో గ్రంథాలయాలను స్థాపించడం జరిగింది. భారత స్వాతంత్ర పోరాటంలో ఈ గ్రంథాలయాలు ప్రజలను చైతన్య పరచడంలో తమ వంతు పాత్రను పోషించాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని గ్రంథాలయ ఉద్యమంలోని ముఖ్యమైన సంఘటనలను ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ గ్రంథాలయ ఉద్యమం ఈ విధంగా సాగింది [ Library Movement in Telangana]
- 1872లో సికింద్రాబాద్ లో సోమసుందర్ మొదలియార్ తెలుగు ప్రాంతాల్లోనే మొట్టమొదటి గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
- అదే ఏడాది 1872లో శంకరమఠ్ శంకరానంద, ఇక సికింద్రాబాద్ లో సార్వజనీక గ్రంథాలయాలను ముదిగొండ శంకరాచార్యులు స్థాపించారు.
- 1892లోఅసఫియా లైబ్రరీని స్థాపించారు.
- 1895లో శాలిబండలో భారత్ గుణవర్థక సంస్థ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.
- బొల్లారంలో అల్బర్ట్ రీడింగ్ రూంను 1896లో ఏర్పాటు చేశారు.
- తెలంగాణ గ్రంథాలయోద్యమానికి ఆద్యుడు, పితామహుడు కొమర్రాజు లక్ష్మణరావు.
- మునగాల సంస్థానాధీశుడు నాయని వెంకటరంగారావు వద్ద కొమర్రాజు లక్ష్మణరావు దివాన్ గా పనిచేశారు.
- ఆ నాయని వెంకటరంగరావు, రావిచెట్టు రంగారావులతో కలసి కొమర్రాజు లక్ష్మణరావు 1901లో హైదరాబాద్ లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం గ్రంథాలయం ఏర్పాటు చేశారు.
- హన్మకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయాన్ని 1904లో ఏర్పాటు చేశారు.
- 1905లో సికింద్రాబాద్లో ఆంధ్ర సంవర్ధని గ్రంథాలయం ఏర్పాటు చేశారు.
- 1906లో విజ్ఞాన చంద్రికా మండలిని కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు ఏర్పాటు చేశారు.
- తెలుగు ప్రాంతంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన మొదటి సంస్థ విజ్ఞాన చంద్రికా మండలి.
- లక్ష్మణరావు రచించిన ఆంధ్రుల చరిత్రను విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురించింది.
- 1910లో ఖమ్మంలో ఆంధ్ర భాషా నిలయం ఏర్పాటు చేశారు.
- 1913లో వరంగల్ జిల్లా మడికొండలో ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయం ఏర్పాటు చేశారు.
- 1913లో సికింద్రాబాద్లో సంస్కృత కళావర్ధిని గ్రంథాలయాన్ని స్థాపించారు.
- 1918లో హైదరాబాద్ లో రాజబహదూర్ వెంకటరామిరెడ్డి చొరవతో రెడ్డి హాస్టల్ గ్రంథాలయం ఏర్పడింది.
- 1924 నుంచి 1932 వరకు సురవరం ప్రతాపరెడ్డి, రెడ్డి హాస్టల్ గ్రంథాలయానికి కార్యదర్శిగా పనిచేశారు.
- వీర సావర్కర్ రచించిన వార్ ఆఫ్ ఇండిపెండెంట్స్ అనే గ్రంథం రెడ్డి హాస్టల్ గ్రంథాలయంలో ఉండటంతో సురవరం ప్రతాపరెడ్డి తన కార్యదర్శి పదవిని కోల్పోయారు.
- గ్రంథాలయోద్యమకారుల కోసం సురవరం ప్రతాపరెడ్డి రచించిన గ్రంథం తెలంగాణాంధ్రుల కర్తవ్యం.
- 1918లో నల్లగొండలో ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం స్థాపించారు.
- 1918లో నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటలో ప్రజల సహకారంతో ఆంధ్ర ప్రకాశిని అనే గ్రంథాలయాన్ని పువ్వాడ వెంకటప్పయ్య అనే ఉపాధ్యాయుడు స్థాపించాడు.
- పువ్వాడ వెంకటప్పయ్య తెలుగు పుస్తకాల ముద్రణకు స్థాపించిన సంస్థ కృషి ప్రచారిణి గ్రంథమాల.
- 1920లో సికింద్రాబాద్ లో మాడూరి రాఘవులు స్థాపించిన గ్రంథాలయం భాషా కవల్లి.
- హైదరాబాద్ లో అల్గంజ్లో బాలసరస్వతి గ్రంథాలయాన్ని 1923లో ఏర్పాటు చేశారు.
- 1923లో కొండా వెంకటరంగారెడ్డి తన సొంత ఖర్చులతో వేమన ఆంధ్ర భాషా నిలయం ఏర్పాటు చేశారు.
- 1923లో ఖమ్మంలో ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.
- 1925లో ఆంధ్ర సోదరీ సమాజ గ్రంథాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు.
- 1926లో ఆది హిందూ లైబ్రరీని బి.ఎస్.వెంకట్రావు ఏర్పాటు చేశారు.
- దక్కన్ వైశ్య సంఘ గ్రంథాలయాన్ని 1926లో ఏర్పాటు చేశారు.
- మెదక్ జిల్లాలోని జోగిపేట గ్రంథాలయాన్ని 1930లో ఎప్పుడు ఏర్పాటు చేశారు.
Leave a Reply