గూగుల్ అకౌంట్ వాడే వారికి హెచ్చరిక.. ఇలా చేస్తే మీ అక్కౌంట్ శాస్వితంగా డిలీట్ అవుతుంది.. పూర్తి వివరాలు ఇవే..

గూగుల్ అకౌంట్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది.. అటువంటి గూగుల్ అక్కౌంట్ నీ ఈ మధ్య అసలే వాడటం లేదా? దాని వంక కన్నెత్తి చూసి రెండేళ్లయిందా? అయితే అది ఒక శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది.

ఈ మేరకు కొత్త పాలసీని 2023 డిసెంబర్ 1 నుంచి గూగుల్ అందుబాటులోకి తెస్తోంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తూ గూగుల్ ఈ వారమే తన యూజర్లం దరికి మెయిల్స్ పంపింది. తాను అందించే అన్ని సర్వీసులు, ప్రొడక్టులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

డేటా పూర్తిగా గోప్యంగా ఉంచడమే మా లక్ష్యం

“మా యూజర్లు ఆకౌంట్ను వాడటం మానేసినా వారి డేటా పూర్తిగా గోప్యంగా. సురక్షితంగా ఉండేలా చూడటమే మా లక్ష్యం. అకౌంట్ డిలీషన్ అందులో భాగమే” గూగుల్ ప్రకటించింది.

ఎవరి అకౌంట్లు డిలీట్ చేయబోతున్నారు?

  • గూగుల్ అకౌంట్ ను రెండేళ్ల పాటు సైన్ ఇన్ చేయకపోతే, వాడకపోతే..
  • ఒకసారి డిలీట్ చేసిన అకౌంట్ తాలూకు జీ మెయిల్ అడ్రసు ఇంకెవరికీ కేటాయించబోరు.
  • సేఫ్టీ, సెక్యూరిటీ కారణాల రీత్యా తన పాలసీని ఇలా అప్డేట్ చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది.
  • అయితే ఆకౌంట్ను డిలీట్ చేసే ముందు గూగుల్ పలుమార్లు రిమైండర్ మెయిల్స్ పంపుతుంది. అవి సదరు అకౌంట్తో పాటు యూజర్ తాలూకు రికవరీ ఆకౌంట్కు కూడా వెళ్తాయి.
  • ఏదైనా చర్య తీసుకోవడానికి కనీసం 8 నెలల ముందు నుందే ఈ మెయిల్స్ రావడం మొదలవుతుంది.

ఇలా చేస్తే మీ గూగుల్ అకౌంట్ సేఫ్….

  • తరచూ లాగిన్ అవుతూ ఉన్నా…
  • కనీసం రెండేళ్లకు ఒక సొచైనా లాగిన్ అయినా..
  • గూగుల్ డ్రైవ్ వాడినా..
  • మెయిల్ పంపినా, చదివినా..
  • యూట్యూబ్లో వీడియో చూసినా…
  • ఏ గూగుల్ యాప్ డౌన్లోడ్ చేసినా.. థర్డ్పార్టీ యాప్, సర్వీస్ లను గూగుల్ ద్వారా సైన్ ఇన్ చేసినా.. మీ గూగుల్ ఖాతాకు ఎలాంటి ధోకా ఉండదు..

వీళ్ళకి మినహాయింపులున్నాయ్..

గూగుల్ అకౌంట్ డిలీషన్ పాలసీకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వాటి ప్రకారం రెండేళ్ల పాటు వాడకంలో లేని ఆకౌంట్లను డిలీట్ చేసి కొత్త విధానం ఈ కింది వాటికి వర్తించదు.

  • యూట్యూబ్ చానల్స్, వాలాకు, కామెంట్లున్న గూగుల్ అకౌంట్
  • డబ్బులతో కూడిన గిఫ్ట్ కార్డులున్న జీ మెయిల్ అకౌంట్
  • పబ్లిష్డ్ అప్లికేషన్ ఉన్న అకౌంట్

ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం క్రింది ఇవ్వబడిన మన telegram చానల్ లో జాయిన్ అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!