2018లో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది. జవాబు పత్రాలను మాన్యువల్ విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పును వెల్లడించింది.
ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ మళ్ళీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. ఈ ఎంపిక ఆరు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేస్తూ తీర్పులో వెల్లడించింది
Leave a Reply