ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 3 నుంచి ఒంటి పూట బడులు ప్రకటిస్తూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఒంటిపూట బడుల టైమింగ్: ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుంది.
అయితే ఎక్కడైతే టెన్త్ పరీక్షలు జరుగుతాయో ఆ పాఠశాలల్లో రెండు పూటలా అనగా పూర్తి రోజు సెలవు గా ప్రకటించడం జరిగింది. అయితే వాటి బదులు మరో రోజున వారికి పాఠాలను నిర్వహించాలని పేర్కొంది.
ఏప్రిల్ 03 నుంచి 18 వరకు ఉదయం 9.30 నుంచి 12.45 pm వరకు జరగనున్న నేపథ్యంలో మొత్తం 3,349 పాఠశాలలో పూర్తిగా పరీక్షలు అయిపోయే వరకు పరీక్ష దినాలలో 6 రోజులు సెలవు ప్రకటించడం జరిగింది. అయితే ఈ సెలవులను 30 ఏప్రిల్ లోపు కవర్ చేయాలని ఆదేశించింది.
ఏప్రిల్ 30 లోపు అని పని దినాలలో ఈ వంటి పూట బడులు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత వేసవి సెలవులను జూన్ 11 వరకు ఇస్తారు. అదే విధంగా, ఏప్రిల్ నెల లో రెండవ శనివారం కూడా పని దినం గా పేర్కొనడం జరిగింది.
ప్రభుత్వం జారీ చేసిన పూర్తి ఉత్తర్వుల వివరాలను కింద చూడవచ్చు.
Leave a Reply