తాజాగా ఏపీ ఇంటర్ బోర్డు (AP inter board) 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 295 రోజులకు సంబంధించి 227 పనిదినాలుగా పేర్కొంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ ప్రక్రియ మే 15 నుంచి ప్రారంభంకానుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో రిజర్వేషన్లకు అనుగుణంగా మాత్రమే ప్రవేశాలు…
ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిప్రకారం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ-ఎ 29 శాతం, బీసీ-బి 10 శాతం, బీసీ-సి 1 శాతం, బీసీ-డి 7 శాతం, బీసీ-ఈ 4 శాతం వంతున సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. అలాగే విభిన్న ప్రతిభావంతులకు 3 శాతం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా విద్యార్ధులకు 5 శాతం, ఎక్స్-సర్వీస్‌మెన్‌ల పిల్లలకు 3 శాతం, ఈబీసీలకు 10 శాతం వంతున అడ్మిషన్లలో అవకాశం కల్పించాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో june1 నుంచి తరగతులు
ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌కి 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, అలాగే వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. అదేవిధంగా మార్చి 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు.
కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ప్రవేశాలు
ఇంటర్మీడియట్‌లో చేరబోయే విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చే క్రమంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది. ఈమేరకు బోర్డు సూచించిన విధంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని శేషగిరి బాబు అన్ని ఇంటర్ కళాశాలలకు ఆదేశాలు జారీచేశారు.
Leave a Reply