2022-23 విద్యా సంవత్సరమునకు గాను 05-02-2023 న జరుగుతున్న జాతీయ ఉపకారవేతన పరీక్ష (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష) హాల్ టికెట్ప్ విడుదల.
2022-23 విద్యాసంవత్సరమునకు గానూ జరగనున్న జాతీయ ఉపకార వేతన పరీక్ష (NMMS) ది. 05-02-2023 (ఆదివారం) ఉదయం 10:00 గంటల నుండి మద్యాహ్నం 1:00 గం. వరకు జరుగును. ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు స్కూల్ లాగిన్ లో అందుబాటులో ఉంచడమైనది. కావున సంబంధిత ఉపాధ్యాయులు పాఠశాల U- DISE కోడ్ ను ఉపయోగించి లాగిన్ అయి తమ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి దేవానంద రెడ్డి గారు తెలియజేశారు.
Leave a Reply