తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేసింది. ఇంటర్ మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయించే విధానాన్ని రాష్ట్ర సర్కారు తీసేసింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
ఎంసెట్ ర్యాంకుల ద్వారానే ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ
ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండా ఎంసెట్ ర్యాంకుల ద్వారానే ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇస్తున్నారు. కార్పొరేట్ కాలేజీలలో విద్యాభ్యాసం చేసిన వారికే ర్యాంకులు దక్కడంతో పాటు, ఇతరత్రా అవకతవకలకు పాల్పడుతున్నారనే అభియోగాలు ఉన్నాయి. కార్పొరేట్ కాలేజీల ర్యాంకుల దందాపై గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం అధ్యాయనం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ఉత్తర్వులు వెలువరించింది.
2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇక నుంచి ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండా ఎంసెట్ ర్యాంకుల ద్వారానే ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు
Event | Date |
EAMCET notification will be given on | February 28, 2023 |
Applications will be accepted from | March 3 to April 4 2023 |
EAMCET is accepting applications with late fee | May 2, 2023 |
EAMCET hall tickets can be downloaded from | April 30, 2023 |
The exam will be held from | May 7 to 11 2023 |
Leave a Reply