ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్ – 2023 లో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేయిటేజి ను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటర్ లో ఈఏపీ సెట్ వెయిటేజ్ ఎంత
EAPCET లో ఇంటర్ మార్కులకు 25 శాతం వేటేజ్ జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కంటే ముందు కూడా ఇదే weightage కల్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో ఉన్నత విద్యా మండలి పేర్కొంది.
ఇక ఈఏపి సెట్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్ లో తప్పనిసరిగా కనీసం 45% మార్కులతో పాస్ అవ్వాల్సి ఉంటుంది.ఈఏపీసెట్ లో వచ్చిన మార్కులకు 75 శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటిస్తారు. ఈ ర్యాంకుల ఆధారంగానే విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరుగుతుంది.
సిలబస్ ను కుదించిన ఇంటర్ బోర్డు
EAPCET – 2023లో సిలబస్ పైన ఉన్నత విద్యామండలి క్లారిటీ ఇవ్వడం జరిగింది. కోవిడ్ సమయం లో తరగతులు, పరీక్షలు సరిగా నిర్వహించక పోవడంతో సంబంధిత సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనుకబడ్డారు. దీంతో ఇంటర్ బోర్డు 30 శాతం మేర సిలబస్ ను కుదించింది. అప్పట్లో నిర్వహించిన పరీక్షలకు కుదించిన SYLLABUS నే పరిగణ లోకి తీసుకుంది. దీంతో ఈఏపీ సెట్ పరీక్షల్లోనూ ఉన్నత విద్యామండలి, ఇంటర్ బోర్డు నిర్ణయించిన విధానాన్నే అనుసరించాల్సి వచ్చింది.
ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే ఈసారి నర్సింగ్
ఈసారి కొత్తగా నర్సింగ్ సీట్లను ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయనున్నట్లు ప్రకటిస్తూ ఉన్నత విద్యామండలి మరొక నోటిఫికేషన్ ను జారీ చేసింది. రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు ఏపీ ఈఏపీసెట్ – 2023 ర్యాంకుల ఆధారంగానే ఉండనున్నాయి.
EAPCET 2023 SCHEDULE విడుదల
S.No | Activity | Date & Time |
1 | Notification of AP EAPCET – 2023 | 10.03.2023 |
2 | Commencement of submission of Online Applications | 11.03.2023 |
3 | Last date for submission of Online Applications without Late fee | 15.04.2023 |
4 | Last date for submission of Online Applications with late fee of Rs.500/- | 30.04.2023 |
5 | Last date for submission of Online Applications with late fee of Rs.1000/- | 05.05.2023 |
6 | Correction of Online Data already submitted by the candidates | 04.05.2023 to 06.05.2023 |
7 | Last date for submission of Online Applications with late fee of Rs.5000/- | 12.05.2023 |
8 | Last date for submission of Online Applications with late fee of Rs.10000/- | 14.05.2023 |
9 | Downloading of Hall-tickets from the website https://cets.apsche.ap.gov.in/eapcet | From 09.05.2023 |
10 | Dates of AP EAPCET 2023 Examination (Engineering) | 15.05.2023 to 18.05.2023 |
11 | Dates of AP EAPCET 2023 Examination (Agriculture & Pharmacy) | 22.05.2023 to 23.05.2023 |
12 | Uploading of Preliminary keys (Both Streams) | 24.05.2023 9.00 am |
13 | Date and Time of Engineering Objections (Both Streams) | 24.05.2023 9.00 am to 26.05.2023 9.00 am |
Leave a Reply