రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరగనున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందిలేకుండా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నారు. వారికి అవసరమైన ఫర్నిచర్, మంచినీటి సదుపాయంతో పాటు అత్యవసర సమయాల్లో సేవలందించేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులు ఒత్తిడికి
గురికాకుండా చర్యలు చేపట్టారు. కొత్తగా పునర్విభజించిన 26 జిల్లాల ప్రాతిపదికన ఇవి జరుగుతాయి.
ఈసారి మొత్తం 6.64 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాకపోకలకు అనువుగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. సెల్ ఫోన్లో లాప్టాప్ లు ట్యాబ్లు కెమెరాలు ఇయర్ ఫోన్స్ డిజిటల్ పరికరాల నిషేధం. రాష్ట్రంగా 3,449 పరీక్ష కేంద్రల ఏర్పాటు… అన్ని చోట్ల 144 సెక్షన్ విధింపు
- ఈ పరీక్షలు ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు 3.15 గంటల పాటు నిర్వహణ
- అభ్యర్థులను ఉదయం 8.45 నుంచి 9.30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రాలలోకి అనుమతి
- ఏప్రిల్ 19 నుంచి 26 వరకు మూల్యాంకనం
విద్యార్థులకు సూచనలు
- హాల్‌టికెట్లు పొందాక విద్యార్థులంతా తమ పేరు, పుట్టిన తేదీ, ఫొటో వంటి అన్ని వివరాలను సరిచూసుకోవాలి. వాటిలో పొరపాట్లు గమనిస్తే పాఠశాల హెడ్‌మాస్టర్/ ప్రిన్సిపాల్‌ని సంప్రదించాలి.
- విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్‌లను తమతో పాటు పరీక్షకు తీసుకెళ్లాలి. హాల్‌టికెట్ లేకపోతే పరీక్షకు అనుమతించరు.
- పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్పీకర్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్, కెమెరాలు, ఇయర్ ఫోన్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదు. ఎవరైనా వాటిని లోపలకు తీసుకువెళ్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు.
- విద్యార్థులు ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ ప్రశ్నలను వేర్వేరు సమాధాన పత్రాల్లో రాయాలి. ఈ రెండింటి కోసం వేర్వేరుగా 12 పేజీల సమాధానాల బుక్‌లెట్లు ఇస్తారు.
- విద్యార్థులను అత్యవసర పరిస్థితుల్లో మినహా 12:45 గంటల వరకు పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించరు.
- ప్రశ్నపత్రాల లీక్ అని తప్పుడు, నిరాధారమైన పుకార్లకు పాల్పడకూడదు. వదంతులను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
- పరీక్ష సమయంలో అక్రమాలకు పాల్పడేవారిపై, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు ఉంటాయి. అలాంటివారిని తదుపరి పరీక్షలు రాయనీయరు.
- విద్యార్థి పేరు, రోల్ నంబర్, ఇతర వివరాలను 24 పేజీల జవాబు బుక్‌లెట్, మ్యాప్ లేదా గ్రాఫ్ షీట్‌లోని ఏ పేజీలోనూ రాయకూడదు.
- కాగా పరీక్షలు జరిగే రోజుల్లో ఎంఈవోలు, హెచ్‌ఎంలు, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ల విధులపైనా సూచనలు జారీ చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
పరీక్షలకు హాజరైన విద్యార్థులు రాకపోకలకు వీలుగా ఆర్టీసీ కూడా చర్యలు తీసుకుంది. అన్ని రూట్లలో ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపనున్నారు. హాల్ టికెట్ ఉన్న అభ్యర్థులు అన్ని పరీక్షల రోజుల్లో వారి నివాసం నుంచి పరీక్ష కేంద్రానికి ఉచితంగా ప్రయాణించడానికి అనుమతి
విద్యార్థులకు ఇచ్చే గ్రాఫ్లు, మ్యాప్ పాయింట్లు, సమాధానాలు బుక్లెట్ల పై రోల్ నెంబర్, పేరు వంటివి రాయకూడదు. గ్రాఫ్లు, మ్యాప్ పాయింట్లు అటు ఇటు కాకుండా ఉండేందుకు బుక్లెట్లపై క్రమ సంఖ్యను రాసేలా చూడాలి
Leave a Reply