ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 9వ తేదీ నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. మొత్తం 10 రోజులు ఈ సెలవులు ఉండనున్నాయి
సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలతో పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని స్కూళ్లను హెచ్చరించింది.
సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. వాస్తవానికి జనవరి 16 వరకూ సెలవులుంటాయని అనుకున్నా ఆ తరువాత మార్పు జరిగింది. ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు పదిరోజుల పాటు సెలవులు ప్రకటించింది. తిరిగి 19వ తేదీన స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి.
ఈసారి జనవరి 13 రెండవ శనివారం, 14వ తేదీ ఆదివారం భోగి పండుగ, జనవరి 15వ తేదీ సంక్రాంతి పండుగలున్నాయి. రెండ్రోజులు సాధారణ పబ్లిక్ హాలిడేస్ రావడంతో 18 వరకూ సెలవులు పొడిగించినట్టు సమాచారం. ఇక కాలేజీలకు జనవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉండే అవకాశం ఉంది.
జనవరి 13వ తేదీన రెండో శనివారం కాగా.. 14న భోగి, 15వ తేదీన సంక్రాంతి, 16వ తేదీన కనుమ పండుగలు ఉన్నాయి. ఇక ఈ సెలవులతో పాటు జనవరిలో 26న రిపబ్లిక్ డే సందర్భంగా సెలవు ఉంది. జనవరి 7, 14, 21, 28 ఆదివారం సందర్భంగా సెలవులు ఉన్నాయి.
Leave a Reply