ఇండియన్ పాలిటి – రాష్ట్ర ప్రభుత్వం

,

కేంద్రప్రభుత్వంలో చెప్పుకున్న విధంగానే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా 3 శాఖలుంటాయి. రాష్ట్రంలో ఈ మూడు శాఖల కలయికే రాష్ట్ర ప్రభుత్వం అవి

1. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ

2. రాష్ట్ర కార్యనిర్వహక శాఖ

3. న్యాయ శాఖ

  • రాజ్యాంగంలోని 6వ భాగం ఆర్టికల్ 168 నుంచి 212 వరకు రాష్ట్ర శాసన వ్యవస్థ గురించి పేర్కొంటుంది.
  • రాష్ట్ర శాసన నిర్మాణశాఖలో గవర్నర్, శాసనసభ లేదా రెండు సభల సభ్యులు ఉంటారు.
  • గవర్నర్ శాసన నిర్మాణశాఖలో అంతర్భాగమే 2 సభలున్న రాష్ట్రాల శాసనసభల్లో మొదటి సభను విధానసభ (శాసనసభ) అని, రెండో సభని విధాన పరిషత్ లేదా విధాన మండలి (శాసన మండలి) అని అంటారు

రిజర్వేషన్లు

  • రాజ్యాంగంలోని ఆర్టికల్ 332 ప్రకారం రాష్ట్ర విధాన సభల్లో ఎస్సీ, ఎస్టీలకు కొన్ని స్థానాలు రిజర్వ్ చేస్తారు.
  • జనాభా ప్రాతిపదికను రిజర్వే షన్లను అమలు చేస్తున్నారు.
  • ఆర్టికల్ 333- ప్రకారం రాష్ట్ర = శాసన సభల్లో ఆంగ్లో ఇండి యన్లకు తగినంత ప్రాతినిధ్యం లేదని గవర్నర్ భావిస్తే, ఆంగ్లో ఇండియన్ నుంచి ఒకరిని గవర్నర్ నామినేట్ చేస్తారు.

ఎన్నిక విధానం

  • విధాన సభకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి.
  • రాష్ట్రాన్ని విధానసభ నియోజక వర్గాలుగా విభజిస్తారు. ఆ నియోజక వర్గాల్లోని ఓటర్లు ప్రత్యక్షంగా ప్రతినిధులను ఎన్నుకుంటారు.

బిట్ పాయింట్స్

భారతదేశంలో అత్యధికంగా విధానసభ స్థానాలున్న రాష్ట్రాలు..

  1. ఉత్తరప్రదేశ్ -403
  2. పశ్చిమ బెంగాల్ – 294
  3. మహారాష్ట్ర -288
  4. బిహార్ -243
  • భారతదేశంలో తక్కువ విధానసభ స్థానాలున్న రాష్ట్రం – సిక్కిం (32 స్థానాలు).
  • తక్కువ విధానసభ స్థానాలున్న రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉన్నా రా ష్ట్రాలు- మిజోరం, గోవా (40) 60 విధానసభ స్థానాలున్న రాష్ట్రాలు – అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ,మణిపూర్,
  • ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ శాసనసభ స్థానాలున్న రాష్ట్రం- అస్సోం (126)
  • విధానసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం- ఢిల్లీ, పాండిచ్చేరి.
  • అతి తక్కువ విధానసభ స్థానాలున్న శాసనసభ – పాండిచ్చేరి (30)
  • సౌత్ ఇండియాలో ఎక్కువ విధా నసభ స్థానాలున్న రాష్ట్రం – తమిళనాడు (235)

విధానసభ పదవీకాలం

  • సాధారణంగా విధానసభ పదవీ కాలం 5 ఏళ్లు
  • ఈ సభ తొలి సమావేశం జరిగిననాటి నుంచి 5ఏళ్ల పాటు సభ కొనసాగుతుంది.
  • ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన విధానసభ రద్దవుతుంది.

గమనిక:

  • 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విధానసభ కాలపరిమితిని అయిదేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచారు.
  • 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా కాల పరిమితిని తిరిగి ఐదేళ్లకు తగ్గించారు.
  • జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు విధానసభ కాలపరిమితిని ఒక సంవత్సరం పోడిగిస్తూ పార్లమెంట్ శాసనం చేయగలదు.
  • విధానసభ కాలపరిమితి ముగి యక ముందే ముఖ్యమంత్రి సలహాపై గవర్నరు సభను రద్దు చేయవచ్చు.

విధానసభ సభ్యుల అర్హతలు:

  • భారతీయ పౌరుడై ఉండాలి.
  • కనీస వయో పరిమితి 25 ఏళ్లు
  • పార్లమెంట్ నిర్ణయించే ఇతర అర్హతలుండాలి

స్పీకర్ వ్యవస్థ

  • స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రొటెం స్పీకర్, ప్యానల్ స్పీకర్ అనే వ్యవస్థ ఉంటుంది.
  • శాసనసభ ప్రారంభ సమావేశం రోజునే సభ్యులు తమలో ఒకరి ని స్పీకర్గాను మరొకరిని డిప్యూటీ స్పీకర్గానూ ఎన్ను కుంటారు.
  • స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తాం
  • సభ రద్దయినా స్పీకర్పదవి రాద్ధు కాదు నూతన విధానసభకు ఎన్నికలు జరిగి కొత్త స్పీకర్ ఎంపికై పద వి చేపట్టే వరకూ స్పీకర్ పద విలో కొనసాగవచ్చు.
  • స్పీకర్ పదవీకాలం 5 ఏళ్లు
  • ఒక వ్యక్తి ఎన్నిసార్లయినా స్పీకర్ పదవి చేపట్టవచ్చు.

డిప్యూటీ స్పీకర్

  • స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీక ర్ సభకు అధ్యక్షత వహిస్తారు.
  • ఒకవేళ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు రెండూ ఖాళీగా ఉంటే విధానసభలో ఒకరిని స్పీకర్ విధులు నిర్వర్తించాలని తాత్కాలిక స్పీకర్గా గవర్నర్ నామినేట్ చేస్తారు.

ప్రొటెం స్పీకర్

ఎన్నికల తర్వాత జరిగే మొదటి సమావేశానికి సీనియర్ సభ్యు ని గవర్నర్ ప్రొటెం స్పీకర్గా నియమిస్తారు. సభ్యులతో ప్రమా – గ్రూప్స్ ణస్వీకారం చేయించి, కొత్తస్పీకర్ ఎన్నికను నిర్వహిస్తారు.

ప్యానెల్ స్పీకర్

విధానసభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభా కార్యకలాపాల నిర్వహణకు హాజరుకాలేనప్పుడు, సభాకార్యక లాపాల నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు ప్యానెల్ స్పీక ర్లను ఆరుగురిని స్పీకర్ నామినేట్ చేస్తారు.

Pages: 1 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!