ఆ 20 యూనివర్సిటీలలో డిగ్రీలు చేశారా? అయితే మీ డిగ్రీ లు చెల్లవన్న యూజీసీ.. దేశవ్యాప్తంగా 20 ఫేక్ యూనివర్సిటీలు.. ఆంధ్రాలో రెండు..

మన దేశంలోని ఫేక్ యూనివర్సిటీల జాబితాను ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 20 యూనివర్సిటీలను నకిలీవిగా గుర్తించింది.

ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది నకిలీ యూనివర్సిటీలు

దేశంలోని ఫేక్ యూనివర్సిటీల జాబితాను ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 20 యూనివర్సిటీలను నకిలీవిగా గుర్తించింది. ఫేక్ యూనివర్సిటీలు అధికంగా దేశరాజధానిలో ఉన్నట్లు యూజీసీ తెలిపింది. ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. ఢిల్లీ తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లో నాలుగు, ఏపీలో రెండు, బెంగాల్‌లో రెండు నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటితోపాటు కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరిలలో ఒక్కోటి చొప్పున ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. 

రాష్ట్రాల వారీగా వున్న ఫేక్ యునివర్సిటిలు….

  • ఆంధ్రప్రదేశ్‌లోని ఫేక్ యూనివర్సిటీలు..

1) గుంటూరులోని కాకుమానివారితోటలో క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ.

2) విశాఖలోని బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియాను నకిలీవిగా యూజీసీ ప్రకటించింది.

  • ఢిల్లీలో ఫేక్ యూనివర్సిటీలు..

3) ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్

4) కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్- దర్యాగంజ్

5) యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ

6) వొకేషనల్ యూనివర్సిటీ

7) ఏడీఆర్ సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్సిటీ

8) ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్

9) విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్

10) ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం)

  • ఉత్తరప్రదేశ్‌లోని ఫేక్ యూనివర్సిటీలు..

11) గాంధీ హిందీ విద్యాపీఠ్

12) నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి

13) నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ)

14) భారతీయ శిక్షా పరిషత్ ఉన్నట్టు తెలిపింది.

  • పశ్చిమబెంగాల్‌లోని ఫేక్ యూనవర్సిటీలు..

15)  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్‌నేటివ్ మెడిసిన్

16)  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్

  • కర్ణాటలోని ఫేక్ యూనివర్సిటీలు..

17) బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ. కేరళలోని ఫేక్ యూనివర్సిటీలు..

18) సెయింట్ జాన్స్ యూనివర్సిటీ.

  • మహారాష్ట్రలోని ఫేక్ యూనివర్సిటీలు..

19) రాజా అరబిక్ యూనివర్సిటీ పుదుచ్ఛేరిలోని ఫేక్ యూనివర్సిటీలు..

20) శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!