తెలంగాణ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల

,

తెలంగాణ మోడల్ స్కూల్స్ లో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. 2023-24 సంవత్సరం
ప్రవేశాల నోటిఫికేషను మోడల్ స్కూల్స్ డైరెక్టర్ ఉషారాణి సోమవారం విడుదల చేశారు. 6వ తరగతితో పాటు,
7-10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశారు. దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభంకానుండగా, ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 16న నిర్వహిస్తారు. ఫలితాలను మే 15న ప్రకటిస్తారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లు ఉండగా, 6వ తరగతిలో 19,400సీట్లతోపాటు, 7-10 తరగతుల్లో మరికొన్ని ఖాళీ సీట్లున్నాయి. విద్యార్థులు http://telanganams.cgg.gov.in వెబ్సైటు సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజుగా జనరల్ విద్యార్థులు రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ, ఈడబ్లూఎస్ విద్యార్థులు రూ.125 ఫీజుగా చెల్లించాలన్నారు. ప్రవేశాలు ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు చెప్పారు.

ప్రవేశాల షెడ్యూల్

  1. ఆన్లైన్లో దరఖాస్తు: 10-01-2023 నుంచి 15-02-2023
  2. హాల్ టికెట్ల డౌన్లోడ్: 08-04-2023
  3. పరీక్షతేదీ: 16-04-2023 సమయం: 6వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు
    7-10 తరగతుల్లో ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
  4. ఫలితాల ప్రకటన 15-05-2023
  5. పాఠశాలల వారీగా ఎంపికైనవారి జాబితా ప్రకటన 24-05-2023
  6. సర్టిఫికెట్ వెరిఫికేషన్ 25-5-2023 నుంచి 31-5-2023 వరకు
  7. క్లాసులు నిర్వహణ 1-6-2023

TSMS Application 2023 Important Links

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!