CURRENT AFFAIRS OCTOBER 2022 from October 1 to October 31
Prime Minister Launches 5G services: దేశంలోనే తొలిసారిగా 5G సేవలు. అక్టోబర్ 1 న ఢిల్లీలో ప్రారంభించిన ప్రధాని. తొలి దశలో హైదరాబాద్ సహా 13 నగరాల్లో 5 G సేవలు అందుబాటులోకి వచ్చాయి .

టెలికాం రంగ దిగ్గజం – రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ CMD ముఖేష్ అంబానీ, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మరియు ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా – ప్రధానమంత్రితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎయిర్టెల్ , జిఓ , వోడాఫోన్ ఐడియా మరియు అదానీ సంస్థలు 5జి స్పెక్ట్రమ్ ను దక్కించుకున్నాయి.
Swacch Sarvekshan 2022: స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకులను ప్రకటించిన పట్టణాభివృద్ధి శాఖ. ఇండోర్, సూరత్, నవి ముంబై కు వరుసగా తొలి మూడు ర్యాంకులు. నాలుగో స్థానంలో విశాఖపట్నం, 5వ స్థానంలో విజయవాడ, 7 స్థానంలో తిరుపతి ఉన్నాయి. అఖిల భారత స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ మూడు టాప్ ర్యాంక్‌లను కైవసం చేసుకుంది.
ఈ సారి కూడా ఇండోర్ తన నంబర్ 1 స్థానాన్నినిలుపుకుంది. గతేడాదితో పోలిస్తే విశాఖపట్నం ఐదు ర్యాంకులు ఎగబాకింది. ఇండోర్ 7,500కి 7,146 స్కోర్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. విశాఖపట్నం 6,701 స్కోర్‌ను పొందగా, విజయవాడ 6,699 తో చేరుకుంది. తిరుపతి 6,585 పాయింట్లు సాధించింది.

Swacch Bharat 2022 Campaign : కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్వచ్ఛభారత్ క్యాంపెయిన్ (swacch bharat 2022 campaign (month long program) ను ప్రయాగరాజ్ నుంచి ప్రారంభించారు. అదేవిధంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పెషల్ స్వచ్ఛత క్యాంపెయిన్ 2.0 ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ అధికారులను మరియు ప్రజలను పరిశుభ్రత మరియు సంబంధిత కార్యక్రమాల్లో మరింత బాధ్యతాయుతంగా పాల్గొనేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం.
Global Innovative Index 2022 లో భారత్ ర్యాంక్స్ ఆరు ర్యాంకులు మెరుగుపడి 40 కి చేరింది. 2015 లో 81 లో ఉన్న ర్యాంక్ 2022 నాటికి 40 కి చేరింది. మొత్తం 132 దేశాలకు గాను ఈ ర్యాంకింగ్స్ ను విడుదల చేయడం జరిగింది.
World Intellectual Property Organisation (WIPO) ప్రతి ఏటా ఈ ర్యాంకింగ్స్ ను విడుదల చేస్తుంది.

36th National Games : 36వ నేషనల్ గేమ్స్ ను గుజరాత్ లోని అహ్మదాబాద్, వడోదర లో ప్రారంభించిన ప్రధానమంత్రి. 29 సెప్టెంబర్ న ప్రారంభించిన ప్రధానమంత్రి. ఈ సారి Savaj ను అఫిషియల్ మస్కట్ గా ప్రదర్శించారు.

Noble Prize in Medicine: వైద్య రంగంలో స్వీడన్ దేశానికి చెందిన స్వాంటే పాబో(Svante Paabo) కు ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ వరించింది. మానవ పరిణామ క్రమంలో భాగంగా Neanderthals జాతి జీనోమ్ పరిశోధనలకు గాను ఈయన కు 2022 నోబెల్ పురస్కారం దక్కింది.

Noble Prize in Physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి ఈ ఏడాది నోబెల్ ప్రైజ్. Alain Aspect ( France), John F. Clauser ( USA), Anton Zeilinger (Austria)

“ఫోటాన్స్ మరియు క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ పై పరిశోధనల కు గానూ వీరికి నోబుల్ వరించింది”
UNCTAD Annual Trade and Development Report : యునైటెడ్ నేషన్స్ – ఐక్యరాజ్యసమితికి సంబంధించిన UNCTAD వార్షిక వాణిజ్యం మరియు అభివృద్ధి నివేదిక (Annual Trade and development Report) ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022 సంవత్సరానికి గాను 2.6% పెరగనున్నట్లు అంచనా వేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 0.9% తక్కువ. ఈ వృత్తి 2023 కి మరింత క్షీణించి 2.2% గా ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
Noble Prize in Chemistry: రసాయన శాస్త్రంలో 2022 సంవత్సరానికి గాను ముగ్గురికి నోబెల్ పురస్కారం వరించింది.Carolyn R. Bertozzi(USA),Morten Meldal(Denmark), K. Barry Sharpless(USA) లకు సంయుక్తంగా ఈ సారి నోబుల్ దక్కింది.
(“for the development of click chemistry and biorthogonal chemistry”) క్లిక్ కెమిస్ట్రీ మరియు బయోఆర్తోగోనల్ కెమిస్ట్రీ అభివృద్ధి కోసం వీరు చేసిన పరిశోధనలకు సంబంధించి ఈ పురస్కారం దక్కింది.

Noble Prize in Literature: ఫ్రెంచ్ రచయిత్రి “అన్నీ ఎర్నాక్స్” కు ఈ ఏడాది సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారం దక్కింది. “ప్రధానంగా ఆమె రచనా శైలి ఆత్మకథనాత్మక (autobiographical) విధానంలో ఉంటుంది. ఆమె తన రచనల్లో సునిశిత, సాహసోపేత మార్గంలో మూలాలను, సామాజిక బంధనాలను వెలికితీస్తారని నోబెల్ కమిటీ ప్రశంసించింది.”

Modhera, first Complete solar Village: దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయిలో సోలార్ విద్యుదీకరణ చేయబడ్డ తొలి గ్రామంగా గుజరాత్ లోని మోదేరా (modhera) గ్రామం నిలిచింది. గుజరాత్ లోని మెహ్సాన (Mehsana) జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో 1000కు పైగా సోలార్ ప్యానెళ్లను గ్రామ ఇళ్లపై ఏర్పాటు చేసి, గ్రామస్తులకు 24 గంటలూ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు.

Noble Prize in Peace : (నోబుల్ శాంతి పురస్కారం) : 2022 శాంతి బహుమతిని బెలారస్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్ బిలియాట్స్‌కీ, రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్ మరియు ఉక్రేనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు అందించారు.

Noble Prize in Economics: బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై పరిశోధనలకు గాను Ben S Bernanke, Douglas W Diamond, Philip H Dybvig లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది.

IMF Indian GDP Growth Rate Prediction: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను భారత 6.8 శాతానికి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ పేర్కొంది. జూలైలో పేర్కొన్న 7.4% నుంచి ప్రస్తుతం 6.8% వృద్ది రేటు ను తగ్గించింది. RBI 7.0 % మరియు ప్రపంచ బ్యాంక్ 6.5% గా వృద్ధి రేటును ప్రకటించాయి

50th CJI of India : భారతదేశ 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా జస్టిస్ డివై చంద్ర చూడ్ పేరును ప్రతిపాదించిన ప్రస్తుత చీఫ్ జస్టిస్ యు యు లలిత్.. రాష్ట్రపతి ఆమోదం . నవంబర్ 9న బాధ్యతలు చేపట్టనున్న చంద్ర చూడ్.

AFWWA World Record : 41,541 ఉన్ని టోపీలతో గిన్నిస్ రికార్డు భారత వైమానిక దళ సిబ్బంది సతీమణులు 41,541 ఉన్ని టోపీలను ప్రదర్శించడం ద్వారా గిన్నిస్ రికార్డును స్థాపించారు. ఇవన్నీ చేతితో అల్లినవే కావడం విశేషం. వాయుసేన సిబ్బంది సతీమణుల సంఘానికి చెందిన దాదాపు 3 వేల మంది మహిళలు వీటిని తయారు చేశారు. . AFWWA 52వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఘనతను సాధించారు.

Aluminium Goods Rail : దేశంలోనే తొలిసారిగా అల్యూమినియం గూడ్స్ రైలు రేక్.
అల్యూమినియంతో తయారైన గూడ్స్ రైలును రైల్వే శాఖ తొలిసారి భువనేశ్వర్ నుంచి నడిపింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ జెండా ఊపి దీన్ని ప్రారంభించారు. ఉక్కుతో తయారైన రేక్ కన్నా ఇది అతి తేలికగా ఉండటంతో పాటు ఎక్కువ సామగ్రిని తరలించేదిగా రూపొందింది. బెస్కో లిమిటెడ్ వ్యాగన్ డివిజన్, హిండాల్కో సంయుక్త భాగస్వామ్యంతో తయారైంది. ప్రస్తుతమున్న రేక్ కన్నా ఇది 180 టన్నుల తక్కువ బరువు ఉంది
అంతే బరువు ఉన్న సామగ్రిని అదనంగా మోసుకెళుతుంది.
One Nation One Fertilizer: ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన – ఒక దేశం ఒక ఎరువు పథకం మరియు 600 ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను (PMKSK) ప్రారంభించిన ప్రధాన మంత్రి.
One Nation One Fertilizer Scheme కింద సబ్సిడీ కింద అందిస్తున్న అన్ని ఎరువులను (యూరియా, డి-అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ), ఎన్పీకే వంటివి) దేశవ్యాప్తంగా ఒకే బ్రాండ్ భారత్ క్రింద విక్రయిస్తారు.ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు (పిఎంకెఎస్ కె) కింద ఇప్పటికే ఉనికిలో ఉన్న 600 జిల్లా స్థాయి రిటైల్ షాపులను పునర్నిర్మించి,వ్యవసాయ ఇన్ పుట్లు, సేవల పరంగా మరిన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ కేంద్రాలను పిఎం కిసాన్ సమ్మేళన్ సందర్భంగా అక్టోబర్ 17 న ప్రధానమంత్రి ప్రారంభించారు.

AICC New Prez Mallikarjuna Kharge : కాంగ్రెస్ కొత్త సారథి గా మల్లిఖార్జున ఖర్గే . కర్ణాటక సీనియర్ నేత, దళిత కుటుంబానికి చెందిన 80 ఏళ్ల మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 84 శాతం పైగా ఓట్లు సాధించి, ప్రత్యర్థి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్పై విజయం సాధించారు. పోలైన 9,385 ఓట్లలో ఖర్గేకు 7,897, థరూర్కు 1,072 లభించాయి. 416 ఓట్లను చెల్లనవిగా ప్రకటించారు.

World Under 23 Wrestling Championship 2022 – ప్రపంచ అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో అమన్ సెహ్రావత్ స్వర్ణం, వికాస్, నితీష్లకు కాంస్యాలు.
రెజ్లింగ్‌లో యువకుడు అమన్ సెహ్రావత్ స్పెయిన్‌లోని పాంటెవెద్రాలో జరిగిన U-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు. 16 ఏళ్ల అమన్ సెహ్రావత్ ఫైనల్లో టర్కీకి చెందిన జూనియర్ యూరోపియన్ రజత పతక విజేత అహ్మత్ డుమాన్‌ను 12-4 తేడాతో ఓడించి స్వర్ణం గెలుచుకున్నాడు.
ప్రపంచ అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో మరో రెండు పతకాలు భారత్ సొంతమయ్యాయి. గ్రీకో రోమన్లో వికాస్ (72 కేజీలు), నితీష్ (97 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. కాంస్య పతక పోరులో వికాస్ 6-0తో డిగో కొబాయాషి (జపాన్)ని ఓడించగా ఐగర్ ఫెర్నాండో (బ్రెజిల్)పై నితీష్ సాంకేతిక ఆధిపత్యంతో విజయం సాధించాడు.

ISSF World Championship : ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఈజిప్టులోని కైరోలో జరిగిన ISSF రైఫిల్/పిస్టల్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2022 లో భారత షూటర్లు 12 స్వర్ణాలు, 9 రజతాలు మరియు 13 కాంస్యాలతో 34 పతకాలను గెలుచుకున్నారు.
పూర్తి విజేతల లిస్ట్ కొరకు క్లిక్ చేయండి. Click here for complete list of winners
Chandrayan 3 : 2023 జూన్లో చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో
జాబిల్లిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తలపెట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జూన్లో ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమ్నాథ్ వెల్లడించారు. మునుపటితో పోలిస్తే మరింత బలమైన రోవర్ను దాని ద్వారా చంద్రుడిపైకి పంపనున్నట్లు తెలిపారు. భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్’ను 2024 చివర్లో చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన చెప్పారు.
వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి ముందు ఆరు ప్రయోగాత్మక పరీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. యాత్ర మధ్యలో వ్యోమగాములకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వారిని సురక్షితంగా తిరిగి భూమిపైకి చేర్చే సామర్థ్యాలను సముపార్జించుకోనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తొలి ‘అబార్ట్ మిషన్’ను 2023 తొలినాళ్లలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దిల్లీలో సోమ్నాథ్ ఈ మేరకు కీలక వివరాలు వెల్లడించారు.

BDL New Launches : బీడీఎల్ అధునాతన ఉత్పత్తుల ఆవిష్కరణ
ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ‘సంగ్రామిక’, యాంటీ ట్యాంక్ వెపన్ సిస్టమ్ ‘సంహారిక’, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వెపన్ సిస్టం నమూనాలను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు, గుజరాత్లోని గాంధీనగర్లో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్పో – 2022లో బీడీఎల్ ఛైర్మన్, ఎండీ సిద్ధార్థ్ మిశ్రా అందించారు.
For More Details click here
ISRO Launched Heaviest Rocket LVM3- M2 : ISRO ద్వారా అత్యంత బరువైన LVM3 ప్రయోగం విజయవంతం – 36 వాణిజ్య ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టిన ఇస్రో
మొత్తం 43.5 మీటర్ల పొడవైన ఈ రాకెట్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి అక్టోబర్ 23 అర్ధరాత్రి 12.07 గంటలకు నింగికి ఎగిసింది.
For ISRO LVM3 Mission Complete details click here

Rishi Sunak Elected as new Prime Minister of UK – రిషి సునాక్ నూతన ప్రధాని గా ఎన్నికయ్యారు .
25 అక్టోబర్ 2022 న ఈయన బ్రిటన్ ప్రధాని గా బాధ్యతలు చేపట్టారు.
12 మే 1980 సౌతాంప్టన్, హాంప్‌షైర్, ఇంగ్లాండ్ లో ఈయన జన్మించారు. భారతీయ పంజాబీ సంతతికి చెందిన ఆగ్నేయ ఆఫ్రికాలో జన్మించిన హిందూ తల్లిదండ్రులు, యశ్వీర్ మరియు ఉషా సునక్ దంపతులకు సునాక్ జన్మించారు.
తోలి భారతియా మూలాలు కల్గిన బ్రిటన్ ప్రధానిగా సునాక్ నిలిచారు. ఇక వీరి భార్య అక్షత మూర్తి , ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులైన నారాయణ మూర్తి కుమార్తె . రిషి మరియు అక్షత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు .

Indian Navy Participates in Maiden Trilateral Exercise with Mozambique and Tanzania:
భారతదేశం-మొజాంబిక్-టాంజానియా త్రైపాక్షిక విన్యాసం యొక్క మొదటి ఎడిషన్ 27 అక్టోబర్ 2022న టాంజానియాలోని దార్ ఎస్ సలామ్‌లో ప్రారంభమైంది.
మొజాంబిక్ మరియు టాంజానియాతో కలిసి భారత నౌకాదళం తొలి త్రైపాక్షిక వ్యాయామంలో పాల్గొంది. గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్, INS తార్కాష్, చేతక్ హెలికాప్టర్ మరియు మార్కోస్ ద్వారా ఇండియన్ నేవీ ప్రాతినిధ్యం వహిస్తుంది.

BPCL recognized as country’s most sustainable oil & gas company: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ‘మహారత్న’ మరియు ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ అయిన ఈ సంస్థ , S&P Dow Jones Sustainability Indices (DJSI) Corporate Sustainability Assessment (CSA) rankings 2022 ఎడిషన్‌లో ఈ సంస్థ ద్వారా సుస్థిరత పై పనితీరుకు గాను భారతీయ చమురు మరియు గ్యాస్ రంగంలో No.1 ర్యాంక్‌ను సాధించింది.

FIFA 2022 U-17 Women’s World Cup: స్పెయిన్ టైటిల్ కైవసం
నవీ ముంబైలోని D. Y. పాటిల్ స్టేడియంలో 2022 U-17 మహిళల ప్రపంచ కప్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ స్పెయిన్ 1-0 తో కొలంబియాను ఓడించింది. నైజీరియా మూడో స్థానంలో నిలిచింది.ఈ టోర్నీ లో భారత జట్టు చిట్ట చివరన నిలిచింది. ఈ టోర్నీ 7 వ ఎడిషన్ కాగా తోలి ఎడిషన్ 2008 లో జరిగింది. ఇక భారత్ లో ఈ అండర్ 17 FIFA వరల్డ్ కప్ జరగడం ఇది రొండో సారి. 2017 లో భారత్ మేన్స్ U -17 ఫిఫా వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చింది.

Indian Hockey Team defeated Australia to win Sultan of Johor Cup 2022 – సుల్తాన్ జోహార్ కప్ హాకీ టోర్నమెంట్ 2022 లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ నెగ్గిన ఇండియా.

ఫైనల్ లో ఆస్ట్రేలియాను ఓడించి మూడోసారి సుల్తాన్ జోహార్ కప్‌ను భారత్ గెలుచుకుంది.
French Open 2022 Badminton : Satwiksairaj Rankireddy and Chirag won men’s doubles title
పారిస్‌లో అక్టోబర్ 30 న జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన లు చింగ్ యావో-యాంగ్ పో హాన్‌లను 21-13, 21-19తో వరుస గేముల్లో ఓడించి, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 2022 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ కైవసం చేసుకుంది. దీనితో, సాత్విక్ మరియు చిరాగ్‌లు ఈ సంవత్సరం వారి మొట్టమొదటి సూపర్ 750 మరియు రెండవ BWF వరల్డ్ టూర్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నారు. ఆగస్టు లో ఈ ఇద్దరి జోడి 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో ఇంగ్లండ్‌కు చెందిన బెన్ లేన్ మరియు సీన్ వెండీని ఓడించి బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది .

Leave a Reply