1. Digital Rupee: భారత ఆర్థిక రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. బిట్‌కాయిన్ వంటి ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధ ప్రత్యామ్నాయమైన డిజిటల్ రూపాయి ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) తొలి పైలట్ ప్రాజెక్టుగా నవంబరు 1న (మంగళవారం) ప్రారంభించనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రకటించింది. సీబీడీసీని తొలుత టోకు లావాదేవీలకు (హోల్‌సేల్ ట్రాన్సాక్షన్స్) మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రిటైల్ లావాదేవీల కోసం డిజిటల్ రూపీ తొలి పైలట్ ప్రాజెక్టును డిసెంబరు 1 నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. తొలి విడతగా, ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కస్టమర్లు-మర్చంట్లతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌లకు మాత్రమే డిజిటల్ రూపాయి ద్వారా రిటైల్ లావాదేవీలు జరిపే అవకాశం కల్పించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. డిజిటల్ రూపీ (హోల్‌సేల్) తొలి పైలట్ ప్రాజెక్టుగా సెకండరీ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీ లావాదేవీల సెటిల్‌మెంట్ యూజ్ కేస్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది.
2. EPFO@70 న్యూదిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఈపీఎఫ్‌వో 70వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ నిర్మాణంలో, దేశవ్యాప్త అమృత్ మహోత్సవ్ వేడుకల్లో ఈపీఎఫ్‌వో ముఖ్య పాత్ర పోషించిందని ప్రముఖంగా ప్రస్తావించారు.70 ఏళ్ల ఈపీఎఫ్‌వో చరిత్రను వివరిస్తూ “ఈపీఎఫ్‌వో @70 – ప్రయాణం” పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. సంస్థ 70 సంవత్సరాల ఉనికిపై ‘ఈపీఎఫ్‌వో@70’ పేరుతో ప్రదర్శించిన ఒక డాక్యుమెంటరీ చిత్రం, దశాబ్దాలుగా ఈ సంస్థ సాధించిన విజయాలను వివరించింది.
3. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ లోని హోలోంగీ లో గ్రీన్ ఫీల్డ్ ఎయర్ పోర్టు కు ‘డోనీ పోలో ఎయర్ పోర్ట్, ఈటానగర్’ అనే పేరు ను పెట్టేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
4. Niveshak Didi: కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన తపాలా విభాగం కింద ఏర్పాటయిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ), ‘నివేశక్ దీదీ’ పేరిట భారతదేశంలో మొట్టమొదటి నీటిపై తేలే ఆర్థిక అక్షరాస్యత శిబిరాన్ని జమ్ము&కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఇవాళ నిర్వహించింది. “మహిళల ద్వారా, మహిళల కోసం” ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
5. 2020-21 సంవత్సరానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పనితీరు గ్రేడింగ్ సూచిక నివేదిక విడుదల చేసిన విద్యా మంత్రిత్వ శాఖ.విద్యా రఁగంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు 2020-21 సంవత్సరంలో కనబరిచిన పనితీరు గ్రేడింగ్ సూచిక నివేదికను పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం విడుదల చేసింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోని పాఠశాల విద్యా వ్యవస్థ పనితీరును సాక్ష్యం ఆధారిత సమగ్ర విశ్లేషణ ఆధారంగా రూపొందిన ప్రత్యేక సూచికను నివేదికలో పొందుపరిచారు. 14.9 లక్షల పాఠశాలలు, వివిధ సామాజిక, ఆర్థిక రంగాలకు చెందిన దాదాపు 26.5 కోట్ల మంది విద్యార్థులు, 95 లక్షల మంది ఉపాధ్యాయులతో భారతీయ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్ద విద్యా వ్యవస్థ గా గుర్తింపు పొందింది.మొత్తం 7 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు- కేరళ, పంజాబ్, చండీగఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ 2020-21లో లెవెల్ II (స్కోరు 901-950) ను చేరుకున్నాయి.
6. ‘అర్బన్ మొబిలిటీ ఇండియా’ (యూఎంఐ) సదస్సు &ప్రదర్శన-2022 ఈ నెల 4-6 తేదీల్లో కొచ్చిలో జరిగింది.15వ ‘అర్బన్ మొబిలిటీ ఇండియా’ (యూఎంఐ) సదస్సు & ప్రదర్శన-2022 నవంబర్ 4, 2022న కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో జరిగింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పూరి, కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభించారు.
7. 59 నిమిషాల్లో 23 ‘బంగీజంప్స్’ చేసి లిండా ప్రపంచ రికార్డుఇంగ్లండ్‌కు చెందిన లిండా పాట్గియేటర్ అనే యాభై ఏళ్ల మహిళ 59 నిమిషాల్లో 23 ‘బంగీజంప్స్’ పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. 19 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా మహిళ వెరోనికా పేరిట ఉన్న రికార్డు (గంటలో 19 బంగీజంప్స్)ను తిరగరాశారు. దక్షిణాఫ్రికాలోని బ్లౌక్రన్స్ వంతెన ఈ అరుదైన ఘట్టానికి వేదికైంది. బ్లౌక్రన్ నదిపై 216 మీటర్ల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు.
8. విజన్ 2030: కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ బిల్డ్ ఇండియా” అనే థీమ్‌తో న్యూ ఢిల్లీలో 12వ ఎడిషన్ ఆఫ్ ఇండియా కెమ్-2022ను కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభించారు.
9.సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) చరిత్రలో మొదటిసారిగా, ఇద్దరు మహిళా అధికారులు ఇన్‌స్పెక్టర్ జనరల్ (IG) స్థాయికి చేరుకున్నారు, IG సీమా ధుండియా మరియు IG అన్నీ అబ్రహం అనే ఈ ఇద్దరు మహిళలు ఈ ఘనత ను సాధించారు.
10. ఇన్వెస్ట్ కర్నాటక 2022 సమ్మిట్‌ను ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విర్చ్యుయల్ విధానం లో ప్రారంభించారు.
11. బ్లూ వేల్ – భూమిపై అతిపెద్ద క్షీరదం – ఫిన్ మరియు హంప్‌బ్యాక్ తిమింగలాల వలె ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ మైక్రోప్లాస్టిక్‌లను మింగేస్తుందని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. ఒక పరిశోధన ఇటీవల మూడు జాతుల బలీన్ తిమింగలాలు – బ్లూ, ఫిన్ తిమింగల మైక్రోప్లాస్టిక్‌ల పరిమాణాన్ని అంచనా వేసింది. మరియు హంప్‌బ్యాక్ – US పసిఫిక్ తీరంలో. ప్రస్తుతం మహాసముద్రాలను కలుషితం చేస్తున్న అపారమైన మైక్రోప్లాస్టిక్‌ల గురించి ఈ అధ్యయనం వెలుగులోకి వచ్చింది. నీలి తిమింగలాలు ప్రతిరోజూ దాదాపు 10 మిలియన్ మైక్రోప్లాస్టిక్ ముక్కలను మింగవచ్చు లేదా దాదాపు 95 పౌండ్ల ప్లాస్టిక్ ఫిన్ తిమింగలాలు 6 మిలియన్ మైక్రోప్లాస్టిక్ ముక్కలను మింగేస్తాయి, ఇది 57 పౌండ్లకి సమానం. ప్లాస్టిక్ క్రిల్-తినే హంప్‌బ్యాక్ తిమింగలాలు ప్రతిరోజూ 4 మిలియన్ మైక్రోప్లాస్టిక్ ముక్కలను (38 పౌండ్లు) తినేస్తాయి
12. ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నివేదిక: ఆఫ్రికాకు రక్షణ ఎగుమతి చేసే అగ్రగామిగా భారత్ నిలిచింది. ఇది భవిష్యత్తులో ఖండం యొక్క సముద్ర, అంతరిక్ష మరియు రక్షణ అవసరాలను తీర్చగలదు. మారిషస్, మొజాంబిక్ మరియు సీషెల్స్ 2017 మరియు 2021 మధ్య భారతదేశంలో తయారు చేయబడిన ఆయుధాలను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి.
13. ఇజ్రాయిల్ ఎన్నికలలో బెంజిమెన్ నేతన్యహు మెజార్టీ సాధించారు. తద్వారా తదుపరి ఇజ్రాయిల్ ప్రధానిగా ఈయన తిరిగి ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈయన ఇప్పటికే గతంలో 15 సంవత్సరాలు ఇజ్రాయిల్ ప్రధానిగా పనిచేస్తారు. 2021 వరకు ప్రధాని గా కొనసాగారు.
14. పీపీపీ ప్రాజెక్టుల అభివృద్ధి వ్యయానికి ఆర్థిక సహకారం అందించేందుకు రూపొందిన ‘ఐఇపిడిఎఫ్ పథకం (ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ స్కీమ్) 03.11.2022న ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రకటించింది. ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం అందిస్తూ దేశంలో నాణ్యమైన మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేసే అంశానికి ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రాధాన్యత ఇస్తున్నది. మౌలిక సౌకర్యాల కల్పన రంగంలో ప్రైవేటు రంగం ఎక్కువగా పాల్గొనేలా చూసేందుకు విధాన రూపకల్పన చేయడానికి ఆర్థిక వ్యవహారాల విభాగం కృషి చేస్తున్నది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రైవేటు పెట్టుబడులు వచ్చేలా చూసేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) ప్రోత్సహించాలని ఆర్థిక వ్యవహారాల విభాగం నిర్ణయించింది. పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా నాణ్యతతో పూర్తి చేయడానికి అవకాశం కలుగుతుంది. అవసరమైన ప్రాంతాల్లో ప్రైవేటు రంగానికి ఆర్థిక, సాంకేతిక సహకారం అందించేందుకు కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. పీపీపీ విధానాన్ని ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా పీపీపీ ప్రాజెక్టుల అభివృద్ధికి అవసరమయ్యే నిధులు సమకూర్చడానికి ‘ఐఇపిడిఎఫ్ పథకం (ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ స్కీమ్)కి ఆర్థిక వ్యవహారాల విభాగం రూపకల్పన చేసింది.
15. యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్, సాధారణంగా కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ ఆఫ్ ది UNFCCC, లేదా COP27, 27వ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 6 నవంబర్ నుండి 18 నవంబర్ 2022 వరకు షర్మ్ ఎల్ షేక్, ఈజిప్ట్ లో నిర్వహించబడుతోంది.
16. ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2022లో ఇంగ్లండ్ ట్రోఫీ విజేతగా నిలిచింది. T20 ఫైనల్ 2022 మ్యాచ్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ 20 ఓవర్లలో 137 పరుగులు (137/8) చేయగా, ఇంగ్లండ్ 19 ఓవర్లలో 5 వికెట్ల (138/5) స్కోరును ఛేదించింది. ఈ టోర్నీకి ఈ ఏడాది ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చింది. ICC T20 ప్రపంచ కప్ 2022 16 అక్టోబర్ 2022న కార్డినియా పార్క్ స్టేడియం, గీలాంగ్‌లో ప్రారంభమైంది మరియు ఫైనల్ మ్యాచ్ 13 నవంబర్ 2022న జరిగింది.
ఈ సీజన్ రికార్డులు
ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: సామ్ కుర్రాన్
టాప్ స్కోరర్: విరాట్ కోహ్లీ
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్: వనిందు హసరంగా
17. జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC సభ్యురాలిగా నసీమా ఖాతున్ బిహార్ ముజఫర్‌పుర్‌లోని వేశ్యావాటికలో పుట్టి పెరిగిన ఓ అమ్మాయి, ఇప్పుడు ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సలహా బృందంలో సభ్యురాలిగా చోటు దక్కించుకున్నారు. ఆమె పేరు నసీమా ఖాతూన్. స్వస్థలం, ముజఫర్‌పుర్‌లోని చతుర్భుజ్ స్థాన్ అనే రెడ్‌లైట్ ఏరియా. నిజానికి ఆమె తండ్రిని చతుర్భుజ్ స్థాన్‌కు చెందిన ఓ వేశ్య దత్తత తీసుకుంది. నసీమా అక్కడే పుట్టి పెరిగారు.
18. ఈ ఆర్థిక సంవత్సరం భారత GDP వృద్ది రేటును 7% సవరిస్తూ మూడీస్ అంచనా ను ప్రకటించింది. Moodys ఇన్వెస్టర్స్ సర్వీస్ గత మేలో 8.8%, సెప్టెంబర్ లో 7.7% నుంచి ప్రస్తుతం ఏడు శాతానికి సవరించింది.
19. జాతిపిత మహాత్మా గాంధీ పై వ్రాసిన ‘బాలల తాత బాపూజీ’ కి గాను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కారాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కవి డాక్టర్ పత్తిపాక మోహన్ ఢిల్లీలో పొందారు. తెలుగు భాషకు సంబంధించి ఈ అవార్డు పొందారు. ఈయనతోపాటు దేశంలో 22 భాషల్లోనీ రచయితలకు ఈ అవార్డు అందించి సత్కరించారు.
20. 800 కోట్లకు ప్రపంచ జనాభా..గత 12 ఏళ్లలో 100 కోట్లు పెరిగిన జనం.2023లో చైనా జనాభాను అధిగమించనున్న భారత్. భారత జనాభా వృద్ది లో స్థిరత్వం కొనసాగుతుందని UNFPA వెల్లడించింది. ప్రస్తుతం భారత్ లో టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.2 ఉండగా రాబోయే రోజుల్లో ఇది 2 కి పడిపోతుందని అంచనా వేసింది. #studybizz
21. నాసా ప్రయోగించిన మూన్ రాకెట్ Artemis 1 విజయవంతమైంది. చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ప్రయోగంగా చెప్పబడుతున్న ఈ రాకెట్ ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి ఎగిసింది . మొత్తం 25 రోజులు పాటు 13 లక్షల మైళ్ళు ఈ రాకెట్ ప్రయాణించనుంది.
22. పశ్చిమ బెంగాల్ నూతన గవర్నర్ గా సివి ఆనంద్ బోస్ ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.
23. మెట ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా సంధ్యా దేవనాథన్ ను నియమిస్తూ సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థ మెటా నిర్ణయం తీసుకుంది. మెటా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లకు మాతృ సంస్థ.
24. భారత అంతరిక్షయాన రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు షార్‌లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి తొలి ప్రైవేటు రాకెట్ ‘విక్రమ్-ఎస్’ నింగిలోకి వెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ.. విక్రమ్-సబ్ ఆర్బిటల్ (వీకేఎస్) ఈ ప్రైవేట్ రాకెట్‌ను అభివృద్ధి చేసింది. ఈ మొట్టమొదటి మిషన్‌కు ‘ప్రారంభ్’ అని నామకరణం చేశారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ హాజరయ్యారు. విక్రమ్-ఎస్ రాకెట్.. సింగిల్ స్టేజ్ సబ్-ఆర్బిటల్ లాంచ్ వెహికల్ కావడం ప్రత్యేకత. ఈ రాకెట్ మూడు పేలోడ్‌లను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.విక్రమ్ సారాభాయ్‌కి నివాళిగా..అంతరిక్ష రంగంలో అడుగుపెట్టేందుకు ప్రైవేటు రంగానికి మన దేశంలో రెండేళ్ల క్రితమే అనుమతి లభించింది. అప్పటి నుంచి స్కైరూట్ ఏరోస్పేస్ ఈ రాకెట్ అభివృద్ధి పనుల్లో నిమగ్నమైంది. చాలా తక్కువ ఖర్చుతో, రెండేళ్లలోనే ఈ రాకెట్‌ను తయారుచేసినట్లు సంస్థ సీఈఓ పవన్ కుమార్ గతంలో వెల్లడించారు. మన దేశంలో అంతరిక్ష ప్రయోగాలకు అంకురార్పణ చేసిన ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్‌కి నివాళిగా తమ రాకెట్‌కు ‘విక్రమ్-ఎస్’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ రాకెట్ ప్రయోగం కోసం స్కైరూట్.. ఇటీవల 51 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.408 కోట్లు) పెట్టుబడిని సమీకరించింది. మింత్రా వ్యవస్థాపకుడు ముఖేశ్ బన్సల్, గూగుల్ బోర్డు సభ్యుడు శ్రీరామ్.. ఈ సంస్థకు పెట్టుబడులు సమకూర్చిన వారిలో ఉన్నారు..
25. దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ ఆతిధ్య సేవల పురస్కారం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రామోజీ ఫిలిం సిటీకి దక్కింది.
26. Table Tennis Asia Cup 2022 : బ్యాంకాక్ లో జరిగిన టేబుల్ టెన్నిస్ ఆసియా కప్ 2022లో భారత ప్లేయర్ మౌనిక బాత్ర (manika batra) రికార్డు సృష్టించారు. ఆసియా కప్ లో కాంస్య పథకం నెగ్గి, ఈ పథకం గెలిచిన తొలి భారత క్రీడాకారిణి గా నిలిచారు. మూడుసార్లు ఆసియా కప్ ఛాంపియన్ అయినటువంటి జపాన్ క్రీడాకారిని హీనా హైతా(hina hayata) పై గెలిచి కాంస్య పథకం అందుకున్నారు.
27. హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ (Indian Racing League) నవంబర్ 19 20 తేదీలలో హుస్సేన్ సాగర్ వద్ద జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఫార్ములా ఈ రేస్ (formula e race FIA) నిర్వహించనున్న నేపథ్యంలో ఇండియన్ రేసింగ్ లీగ్ ను ప్రస్తుతం నిర్వహించారు.
28. FIFA World Cup Qatar 2022 ఎడారి దేశంలో ‘ఫిఫా’ తఫాను.- అరబ్ దేశమైన ఖతర్ వేధికగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ పోటీలు జరుగుతున్నాయి. భారత కాలం మన ప్రకారం నవంబర్ 20 రాత్రి 9 గంటల 30 నిమిషాలకు వరల్డ్ కప్ 2022 అటహాసంగా ప్రారంభమైంది. తొలిమ్యాచ్‌లో ఈక్వెడార్‌తో ఖతర్ పోటీ పడ్డాయి. ఇప్పటిదాకా ఎన్నడూ ప్రపంచకప్‌లో ఆడేందుకు అర్హత సాధించని ఖతార్, ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వడమేకాకుండా, అవకాశం దక్కించుకుంది. 2006లో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఖతర్‌లో మరో మెగా క్రీడా సంబరం ఇదే కావడం విశేషం.
29. చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు లభించింది – నవంబర్ 20న IFFI ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార & ప్రసార మంత్రి (I&B) అనురాగ్ ఠాకూర్ ఈ అవార్డును ప్రకటించారు.9 రోజుల పాటు సాగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నవంబర్ 28న ముగిసింది.ముగింపు రోజున చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను ప్రధానం చేశారు.
30. తెలంగాణలో 2020 తో పోలిస్తే 2022 నాటికి భూగర్భ జలాల రీఛార్జ్ 16.63 శతకోటి ఘనపు మీటర్ల నుంచి 21.11 శతకోటి ఘనపు మీటర్లకు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా 2022 నివేదిక వెల్లడించింది.
31. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలిగా 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్ రిటైర్డ్ అధికారి ప్రీతి సూదన్ బాధ్యతలు చేపట్టారు. ఆమెతో యుపిఎస్సి చైర్మన్ మనోజ్ సోనీ ప్రమాణం చేయించారు.
32. శ్రీహరికోటలో తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ( ప్రయోగ వేదిక ): భారతీయ అంతరిక్ష రంగం మరో కీలక అడుగు ముందుకు వేసింది. ఇస్రా ఉపగ్రహాల ప్రయోగ క్షేత్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట ప్రాంగణంలో చెన్నైకి చెందిన అంతరిక్ష అంకుర సంస్థ అగ్నికుల్ కాస్మోస్ (Agnikul Cosmos) తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ మరియు అగ్నికుల్ మిషన్ కంట్రోల్ సెంటర్ ను నవంబర్ 28 న ప్రారంభించింది.
33. CCRS Director General – Meena Kumariచెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ సంస్థకు డైరెక్టర్గా ఉన్న ప్రొఫెసర్ ఆర్ మీనా కుమారి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధా సి సి ఆర్ ఎస్ కు డైరెక్టర్ జనరల్ అయ్యారు. ఆ కేంద్రం అత్యున్నత కమిటీ ఆమె నియామకాన్ని ఖరారు చేసింది. దీంతో ఆమె రెండు హోదాల్లోనూ కొనసాగుతున్న తొలి మహిళగా రికార్డ్ సృష్టించారు
34. భారత ఒలింపిక్ సంఘం తొలి మహిళా అధ్యక్షురాలిగా పి.టి.ఉష. దిగ్గజ స్ప్రింటర్ పిటి ఉషా చరిత్ర సృష్టించారు. పరుగుల రాణిగా పేరుగాంచిన ఆమె, భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ తొలి మహిళా అధ్యక్షురాలుగా ఆమె ఎన్నికయ్యారు.మరోవైపు ఐఓఏ ఉపాధ్యక్షుడిగా ఒలంపిక్ కాంస్య విజేత గగన్ నారంగ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
35. BCCI Guinness Record: బీసీసీఐ మరో ఘనత సాధించింది. టి20 మ్యాచ్ కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన విషయంలో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది మే 29న ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ ను 1,01,566 మంది ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రస్తుతం ఈ సంఖ్య గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకుంది.
36. IBA Youth World Boxing Championships – ప్రపంచ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2022 .ప్రపంచ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2022 స్పెయిన్ దేశం ల నుసియా లో 14 నుంచి 26 నవంబర్ వరకు జరిగింది. ఇందులో మొత్తం 73 దేశాల నుంచి 598 మంది బాక్సర్లు పాల్గొన్నారు.10 పథకాలు (5 బంగారు పతకాలతో) Ukraine మొదటి స్థానంలో నిలవగా, ఇండియా మొత్తం 11 పథకాలు నెగ్గింది. ఇందులో నాలుగు బంగారు పతకాలు, మూడు వెండి పథకాలు నాలుగు పసిడి పథకాలు ఉన్నాయి.ఇండియా నుంచి పథకాలు సాధించిన విజేతల లిస్ట్ Gold: Men: Vishvanath Suresh, VanshajWomen: Devika Ghorpade,RavinaSilver: Men: AshishWomen: Bhawna Sharma, KirtiBronze: Women: Tamanna, Kunjarani Devi Thongam, Lashu Yadav, Muskan.
Leave a Reply