ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 మరియు TET పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది, పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థుల నుండి వచ్చిన విన్నపం ద్వారా పరీక్షలకు సిద్దమవ్వడానికి సమయం కావాలని వారు కోరడం జరిగింది. వారి విజ్ఞప్తులని పరిశీలించిన పిమ్మట అభ్యర్థులకు పరీక్షలకు తగిన సమయం ఇవ్వాలని గ్రూప్-2 మరియు TET పరీక్షలను వాయిదా వేయడం జరిగియున్నది, కొత్త పరీక్ష తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలియజేసారు.
గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు నిర్వహించినటువంటి గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి మెయిన్ పరీక్షలు జూలై 28 నుంచి జరగాల్సి ఉండగా, ఎన్నికల కారణంగా సరిగా ప్రిపేర్ కాలేకపోయామని కొంత సమయం కావాలని నిరుద్యోగులు అధికార పార్టీ నేతలను కోరడం జరిగింది. పలువురు మంత్రి లోకేష్ కు కూడా విన్నవించడం జరిగింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.
Leave a Reply