ఎంటి ? అప్పుడే బిగ్ బాస్ ఫైనల్ ఆహ్? అని అనుకుంటున్నారా? బిగ్ బాస్ ఫ్యాన్స్ కి ఇది కొంచెం బాధ కలిగించే విషయం అయితే కొందరికి అయితే హమ్మయ్యా అయిపోతుంది అని సంబరపడే వాళ్ళు ఉన్నారు.. అయితే బిగ్ బాస్ సీజన్ 6.. అన్నీ సీజన్ల మాదిరిగానే 100 రోజుల ఆట. వందరోజులు కంప్లీట్ అయిన తరువాతి ఆదివారం లో ప్రతి సారి బిగ్ బాస్ ఆట ముగుస్తుంది. మరి ఈ సీజన్ లో కూడా అంతేనా? ఫైనల్ డేట్ ఎప్పుడు? ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ సీజన్ 6 గత సీజన్ లతో పోలిస్తే అత్యంత పేలవమైన trp రేటింగ్ లను మూట కట్టుకుందనే చెప్పాలి.. ఇది కొంతమందికి వినడానికి కష్టంగా ఉన్నా , ఈ సీజన్ లో రేటింగ్స్ పడిపోయాయి అనేది నమ్మాల్సిన విషయం.
అందరూ ఈ సారి సేఫ్ గేమ్స్ ఎక్కువ ఆడుతుండడంతో బిగ్ బాస్ ఎక్కువ గా ఇన్వాల్వ్ అయ్యి షో ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా ఈ షో నిన్నటితో ఆరో సీజన్ 92 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది.
మొత్తం 21 మంది కంటెస్టెంట్స్‌తో ఆరంభమైన ఈ రియాలిటీ షో , అత్యంత వరస్ట్ సీజన్‌గా మిగిలింది.
ప్రస్తుతం హౌస్‌లో 8 మంది కంటెస్టెంట్స్ మిగిలి ఉన్నారు. వీళ్లలో టాప్ 5 తో ఫినాలే జరగనుంది. ఇందులో టాప్ 5,4,3 కంటెస్టెంట్స్ ముందు ఎలిమినేట్ అయితే, విన్నర్ మరియు రన్నర్ ని ఒకే సారి ప్రకటించడంతో ఈ సీజన్ ముగుస్తుంది.
ఇక ఎండ్ కార్డ్ ఎప్పుడంటే..
మొత్తం వంద ఎపిసోడ్‌లు అంటారు కానీ, ప్రతి సీజన్ సెంచరీ మార్క్ ని క్రాస్ చేస్తుంది. అంటే 100 ఎపిసోడ్‌లు పూర్తి అయిన తర్వాత.. మరో రెండు వారాలు కొనసాగించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే ఈ సీజన్ విషయానికి వస్తే.. డిసెంబర్ 18 తో సీజన్ 6 కి ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంది. ఈరోజుతో 93 ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 6 వచ్చే సండే కి 98 ఎపిసోడ్‌లకు చేరుతుంది. కాబట్టి ఆ తరువాత వచ్చే ఆదివారం అనగా.. డిసెంబర్ 18న (ఆదివారం) గ్రాండ్ ఫినాలే ఉండే అవకాశం ఉంది. ఆరోజునే బిగ్ బాస్ సీజన్ 6 విజేతను, రన్నర్ ను మరియు టాప్ 3,4,5 క్యాండిడేట్స్ ని ప్రకటించబోతున్నారు. కాగా 105వ ఎపిసోడ్‌తో బిగ్ బాస్ సీజన్ ముగిస్తుంది.