BIGG BOSS Season 6 : ఇదేం బిగ్ బాస్ ఫినాలే..టాప్ లో నిలిచినా 50 లక్షలు పోగొట్టుకున్న శ్రీహాన్.. టైటిల్ గెలిచినా సంతోషంగా లేని రేవంత్?

Bigg Boss తెలుగు చరిత్ర లోనే అత్యంత పేలవమైన ఫినాలే గా Bigg Boss Season 6 నిలిచిందనే చెప్పాలి.ఫినలే కోసం ఎంతగానో ఎదురు చూసిన ప్రేక్షకులకు చివరకు నిరాశే మిగిలింది.

అటు గెలిచిన రేవంత్ కి, శ్రిహాన్ కి కూడా సంతృప్తి లేదనేది పబ్లిక్ టాక్. అంతే కాదు, స్టేజ్ పైన ఇద్దరు ఎక్స్ప్రెషన్ కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి..

పప్పులో కాలేసిన శ్రీహాన్..

ఎవ్వరూ ఊహించని విధంగా శ్రీహాన్ కి అత్యధిక ఓట్స్ వచ్చినా, తనపైన తనకే నమ్మకం లేకపోవడం, తోటి ఎక్స్ కంటేస్టెంట్స్ , పేరెంట్స్ డబ్బులు తీసుకోమని చెప్పడం.. శ్రీహాన్ కొంప ముంచిందనే చెప్పాలి.40 లక్షల డబ్బులు తీసుకోకుండా ఉండి ఉంటే, సుమారు కోటి విలువైన డబ్బులు, ప్లాట్ , కార్ దక్కేది.

ట్రాఫి గెలిచినా రేవంత్ కి 100% హ్యాపీనెస్ లేకుండా పోయిందా?

అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే, అప్పటివరకు చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్న రేవంత్ చివరకు శ్రీహన్ తప్పుకోవడం తో ట్రాఫీ అందుకున్నాడు. అయితే అప్పటి వరకు తనకే టాప్ ఓట్లు వచ్చి ఉంటాయి అని భావించిన రేవంత్ కు నాగార్జున గారు టాప్ ఓటర్ షేర్ శ్రీహన్ కి వచ్చింది అని ప్రకటించగానే నిరాశ పడినట్లు కనిపించారు.బిగ్ బాస్ చరిత్ర లోనే ఇటువంటి ఫినాలే…ఇటువంటి ట్విస్ట్ ఇప్పటి వరకు మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు చూడలేదు..టాప్ 3 స్థానంలో గతంలో సోహైల్ డబ్బులు తీసుకొని వెళ్ళాడు. కానీ టాప్ 2 నిష్క్రమించడం ఇదే తొలిసారి. Bigg Boss season 6 Telugu Winner గా మొత్తానికి రేవంత్ నిలిచాడు.

ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో ఉన్న సందేహాలు..

ఎందుకు నాగార్జున గారు టాప్ 2 నిష్క్రమించడానికి కి అంత అమౌంట్ ఆఫర్ ఇచ్చారు?ఎందుకు ఫినాలే ను అంత నిరాశగా మిగిల్చారు..!శ్రీహన్ కు అసలు నిజంగానే ప్రేక్షకులు అన్ని ఓట్స్ వేశారా లేకా బయట నుంచి ఏమైనా కిరికిరి ఉందా?బిగ్ బాస్ 6 లో ఎవరికి సరైన టాప్ 1 స్థానం దక్కక పోవడంతో , మిగిలిన కంటేస్టెంట్స్ ఫీలింగ్ ఎంటి?

ఏదీ ఏమైనా ఈ సీజన్ అటు రేటింగ్స్ పరంగా ఇటు ప్రేక్షకులను మెప్పించడం లో ఇతర సీజన్స్ తో పోలిస్తే ఫెయిల్ అయిందనే అనిపిస్తుంది..వచ్చే సీజన్ అయినా గొప్పగా ఉండాలని ఆశిద్దాం.

Share with your friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *