➤ Telangana Kanti Velugu Scheme Update:
ప్రారంభమైన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం
100 పని దినాల్లో రాష్ట్రం మొత్తం పరీక్షలు నిర్వహించేలా కార్యచరణ
రాష్ట్ర వ్యాప్తంగా 1500 కంటి వెలుగు బృందాలు.
తెలంగాణ కంటి వెలుగు పథకం : రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకాన్ని 2018 లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలను , మందులను ఉచితంగా ప్రభుత్వం పంపిణి చేస్తుంది. అంతేకాకుండా ఎవరికైతే శస్త్రచికిత్సలు అవసరమో వారికి కూడా ప్రభుత్వమే ఉచితంగా చేస్తుంది.
i. తెలంగాణ పౌరులందరికీ కంటి పరీక్షలు (Universal Eye Screening) చేయడం.
ii. అవసరమయ్యే అన్ని కేసులలో ఉచితంగా కళ్ళజోడు పంపిణీ చేయాలి.
iii. కంటిశుక్లం, గ్లాకోమా, రెటినోపతి మొదలైన రుగ్మతలు ఉన్న సందర్భాల్లో శస్త్రచికిత్సలు నిర్వహించబడతాయి.
iv. అన్ని సేవలు ఉచితంగా అందించబడతాయి
ఇందుకు అనుగుణంగా కంటివెలుగు శిబిరాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు.
కింది కంటి జబ్బులకు ఉచితంగా చికిత్స అందిస్తారు.
Refraction Errors - వక్రీభవన(చూపు ) లోపాలు
Cataract - కంటిశుక్లం
Vitamin A Deficiency - విటమిన్ ఎ లోపం
Eye infections - కంటి ఇన్ఫెక్షన్లు
Glaucoma - గ్లాకోమా
Corneal Disorders - కార్నియల్ డిజార్డర్స్
Diabetic Retinopathy - డయాబెటిక్ రెటినోపతి
i. ప్రతి శిబిరాన్ని మెడికల్ ఆఫీసర్‌తో కూడిన వైద్య బృందం నిర్వహిస్తుంది,
2-3MPHS (పురుషుడు) & (ఆడ), 1-2 ఆప్టోమెట్రిస్ట్‌లు, ఫార్మసిస్ట్, 2-3 ఆశా వర్కర్లు
మరియు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు.
ii. ప్రతి టీమ్ దగ్గర అవసరమైన పరికరాలు, మెటీరియల్ మరియు మందులు ఉంటాయి;
iii. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని గ్రామ పంచాయతీలు,పట్టణ ప్రాంతాల్లో అన్ని వార్డుల్లో శిబిరాలు నిర్వహిస్తారు.
ప్రతి శిబిరంలో, చికిత్స కోసం వచ్చిన వ్యక్తులందరి డేటా నమోదు చేస్తారు.
శస్త్రచికిత్సకు సంబంధించి తదుపరి సేవలను అలాగే అద్దాల పంపిణీకి సంబందించిన డేటా ను ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ ద్వారా ట్రాక్ చేస్తారు .