Rythu Bandhu 2022: Updates, Payment Status and other links - రైతు బంధు పథకం అప్డేట్స్

#

Rythu Bandhu 2022: Updates, Payment Status and other links - రైతు బంధు పథకం అప్డేట్స్




Rythu Bandhu Cheque distribution venue and scheduleNew

జిల్లాల వారీగా రైతు బంధు చెక్కుల పంపిణి షెడ్యూల్

 



◼️రైతు బంధు పథకానికి సంబంధించి స్టేటస్ ఎలా తెలుసుకోవాలి



STEP 1:
ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి: YSR Rythu Bandhu

STEP 2
Scheme wise లేదా UTR లేదా మీ అకౌంట్ నెంబర్ ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు.

STEP 3
ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది అక్కడ వివరాలను ఎంటర్ చేసి స్టేటస్ చూడవచ్చు.



◼️ రైతు బంధు పథకం మరియు అర్హతలు :

రైతు బంధు పథకాన్ని 2018 మే‌ నెలలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రైతుల కోసం ప్రారంభించబడిన సంక్షేమ పథకం. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది.



ఈ పథకం ద్వారా రూ. 10000 ప్రతి ఎకరాకు రైతులకు వార్షిక ప్రాతిపదికన చెల్లించడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలను ప్రతి ఎకరా చొప్పున రెండు దఫాలు అనగా ఖరీఫ్ మరియు రబీ సీజన్లో రైతులకు అందించడం జరుగుతుంది.

అదే విధంగా ఈ పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు..

ఈ పథకం కింద సహాయం చేసే మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. రైతుబంధు పథకం రాష్ట్ర స్థాయి సంక్షేమ పథకం మరియు అర్హత ఉన్న రైతులు సున్నా వడ్డీ రుణాలు పొందగలిగే అర్హులైన రైతులను ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనం చేకూరుస్తుంది .

ఈ పథకానికి గరిష్ట పరిమితి ఏమీ లేదు ఎంత మొత్తంలో వ్యవసాయ భూమి ఉన్నా కూడా ప్రభుత్వం వారికి నగదు చెల్లిస్తుంది.

ప్రభుత్వం ప్రముఖంగా పెట్టుబడి సహాయం కింద ఈ అమౌంట్ ని రెండు సీజన్లలో అందిస్తుంది. ఎప్పటికప్పుడు నమోదైన భూమి వివరాల ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

▪️ఈ పథకానికి రైతు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.

▪️ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. తాజాగా డిసెంబర్ 10 వరకు నమోదు అయినటువంటి భూ రికార్డులను పరిశీలించి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

▪️ ఈ పథకానికి ధరణి పోర్టల్ లో ఉన్న డేటా ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

▪️రైతుబంధు పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 20 వరకు ఆ గ్రామాల యొక్క వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)కి దరఖాస్తు ఫారంతో పాటుగా, పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాలి.

Note: రైతు బంధు మరియు పీఎం కిసాన్ సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం మీరు ఈ పేజ్ ద్వారా తెలుసుకోవచ్చు!

Share:
#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #