Dalit Bandhu Scheme Telangana - తెలంగాణ దళిత బంధు పథకం

#





"తెలంగాణ దళితబంధు పథకం" అనేది దళితుల సాధికారతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకం. అర్హులైన దళితులకు అనగా షెడ్యూల్డ్ కులాల ( SC ) వారికి ఈ పథకంలో భాగంగా కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.

'దళిత బంధు' అనే ఈ పథకం కింద ఒక కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ఆ కుటుంబానికి నేరుగా రూ.10 లక్షల నగదును బ్యాంకులో వేస్తారు.

మొదటి దశలో తెలంగాణలోని హుజురాబాద్ నియోజకవర్గం లో దళిత కుటుంబాలకు సహాయం చేసినటువంటి ప్రభుత్వం రెండో విడుదల భాగంగా మిగిలిన 118 నియోజకవర్గాలలో మొత్తం 1,35,000 మందికి ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించింది.

ఈ పథకం కింద మొదటి విడత లో పైలెట్ ప్రాజెక్టు గా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలను ఎంపిక చేసి వారిలో అర్హులైన వారికి అమౌంట్ అందించడం జరిగింది. .

రానున్న ఎనిమిదేళ్లలో తెలంగాణలో ప్రతి దళిత కుటుంబానికి సహాయాన్ని అందించనునన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అర్హత:

▶️ పథకం యొక్క దరఖాస్తుదారు తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
▶️ పథకం యొక్క దరఖాస్తుదారు దళిత వర్గానికి చెందినవారై ఉండాలి.
▶️ పథకం దరఖాస్తుదారు దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి.

అవసరమైన పత్రాలు

▶️ కుల ధృవీకరణ పత్రం
▶️ బ్యాంక్ ఖాతా వివరాలు
▶️ చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్
▶️ ఆధార్ కార్డ్
▶️ ఓటరు గుర్తింపు కార్డు
▶️ నివాస రుజువు

ఈ డబ్బును ఏం చేసుకోవాలి?

ఒక్కో దళిత కుటుంబానికి ఇచ్చే రూ.10 లక్షలు డబ్బును సొంత వ్యాపారానికి ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం 47 రకాల వ్యాపారాలను కూడా ప్రభుత్వం సూచించింది. .

డెయిరీ ఫామ్, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, బార్లు, వైన్ తదితర షాపులు కూడా నిర్వహించవచ్చు.

అవి కాకుండా వేరే వృత్తి ఏదైనా ఎంచుకోవాలని అనుకున్నా దళిత కుటుంబాలు తమ ఆలోచనల ప్రకారం నడుచుకోవచ్చు. కలసి పెట్టుబడులు పెట్టుకొని పెద్ద వ్యాపారానికి శ్రీకారం చుట్టాలనుకున్నా వాటిని స్వాగతిస్తామని ప్రభుత్వం తెలిపింది.

లైసెన్సుల జారీలో రిజర్వేషన్లు

దళితుల్లో వ్యాపార అవకాశాలు కల్పించడానికి లైసెన్సుల్లో కూడా వారికి రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

వైన్‌షాపులు, మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, రైసు మిల్లులు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా వారికి లైసెన్సులలో రిజర్వేషన్లు కల్పిస్తుంది.

ఆర్ధిక సాయంతోపాటు దళిత రక్షణ నిధి కింద దళితుల్లో ఎవరైనా ఆపదలో ఉంటే వారిని ఆదుకునేందుకు ఒక నిధిని కూడా ఏర్పాటు చేసింది.ఇందుకోసం 10 లక్షల అమౌంట్ లో 10 వేలు ప్రతి ఒక్కరి నుంచి ప్రభుత్వం ఇందుకు కేటాయిస్తుంది.


నిబంధనలు(Rules):

▶️ లబ్ధిదారుల్ని ఎంపిక చేసిన తర్వాత కలెక్టర్‌ ప్రతి మండలంలో అనువైన బ్యాంకును ఎంపిక చేసి కుటుంబ పెద్ద పేరిట ప్రత్యేకంగా దళిత బంధు ఖాతా తెరిపించాలి. ▶️ ఆయా యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి కలెక్టర్‌ను సంప్రదించి ఆమోదం తీసుకున్న తర్వాతే చెల్లింపులు చేస్తారు.
▶️లబ్ధిదారుడి సామర్థ్యం, అనుభవం, ప్రాధాన్యత, పెట్టుబడి స్థాయి ఆధారంగా యూనిట్‌ తుది ఎంపిక జరుగుతుంది. ఇవన్నీ ఓకే అయిన తర్వాతేయూనిట్‌ను గ్రౌండ్‌ చేసేందుకు కలెక్టర్‌ అనుమతిస్తారు.
▶️ రూ. 9,90,000 ఒకేసారి కాకుండా ప్రాజెక్టు గ్రౌండ్‌ అవుతున్న కొద్దీ విడతల వారీగా విడుదల చేస్తారు.
▶️ గరామాల్లో విభాగాలవారీగా దళితబంధు లబ్ధిదారుల్ని ఒక బృందంగా ఏర్పాటు చేస్తారు. ఇవి తమకు అందే రూ.10 లక్షలను ఎలా వినియోగించబోతున్నాయి? ఎక్క డ వాడబోతున్నాయి? అనే దానిపై ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేయాల్సి ఉంటుంది.
▶️ఈ అంశాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి అనుభవజ్ఞులైన వారితో కలెక్టర్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు.
▶️లబ్ధిదారుడు ఎంపిక చేసుకునే అంశం ఆధారంగా 2 నుంచి 6 వారాల వరకు శిక్షణ అందిస్తారు. అవసరాన్ని బట్టి గ్రామం, మండలం, నియోజకవర్గం స్థాయిలో శిక్షణ ఉంటుంది.
▶️ ప్రాజెక్ట్ విలువ రూ.10 లక్షలకు మించితే కొంతమంది లబ్ధిదారులు కలిసి మరో ప్రత్యేక గ్రూప్‌ను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #