➤ Telangana Double Bedroom Housing Scheme
తెలంగాణ డబుల్ బెడ్ రూం పథకం : పేదలకు 100% సబ్సిడీ తో అనగా ఉచితంగా గృహాలను అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం 2015 అక్టోబర్ నెలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని రూపొందించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు ఎటువంటి అమౌంట్ ను చెల్లించాల్సిన అవసరం లేదు . ఈ పథకం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువున ఉండే BPL కుటుంబాలకు 2BHK అనగ డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేస్తుంది.
"డబుల్ బెడ్‌రూమ్ హౌసింగ్"లో రెండు బెడ్‌రూమ్‌లు, హాల్, కిచెన్ మరియు 560 అడుగుల ప్లింత్ ఏరియాతో కూడిన రెండు టాయిలెట్‌లు ఉంటాయి.
గ్రామీణ ప్రాంతంలో ఒక స్వతంత్ర గృహం కోసం ప్లాట్ ప్రాంతం 125 చదరపు గజాలు కేటాయిస్తారు.
పట్టణ ప్రాంతాల్లోని G++ నమూనా గృహాలలో 36 చదరపు గజాల భూమి కేటాయింపు ఉంటుంది.
వీటిని లబ్దిదారులకు ఉచితంగా కేటాయిస్తారు
ప్రబ్యత్వం ద్వారా నిర్మాణ ఖర్చులు కింది విదంగా ఉంటాయి
The details of unit cost are shown below:
(in Rs)
Sl.No. |
Area |
Unit cost with Infra |
Unit cost without Infra |
||
House |
Infra |
Total |
|||
1 |
Rural |
5,04,000 |
1,25,000 |
6,29,000 |
5,04,000 |
2 |
Urban |
5,30,000 |
75,000 |
6,05,000 |
5,30,000 |
3 |
GHMC up to G+3 |
7,00,000 |
75,000 |
7,75,000 |
7,00,000 |
GHMC C+S+9 |
7,90,000 |
75,000 |
8,65,000 |
7,90,000 |
▶️ పథకం యొక్క దరఖాస్తుదారు తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
▶️ పథకం దరఖాస్తుదారు దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి.
▶️ కచ్చా ఇళ్లు/గుడిసెలు లేదా అద్దె ప్రాపర్టీలలో నివసిస్తున్న దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు (BPL) మాత్రమే ఈ గృహాలకు అర్హులు..