కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న 2024…1954 నుండి 2024 వరకు భారతరత్న అవార్డు విజేతల జాబితా

భారతరత్న పురస్కారం భారతదేశ పౌరులకు అందించే అత్యుత్తమ పురస్కారం. దీనిని జనవరి 2, 1954 సం||లో భారతదేశ మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ గారిచే ప్రారంభించబడింది.

ఈ అవార్డును ప్రజాసేవ, సాహిత్యం, సైన్స్, కళ మరియు ఇతర ఏ రంగంలో అయినా అత్యున్నత పనితీరు కనబరిచిన వారికి అందించడం జరుగుతుంది. ఈ అవార్డును 1 సం||లో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులకు అందిస్తారు.

2024 సంవత్సరానికి గాను కర్పూరీ ఠాకుర్ కు భారత రత్న అవార్డును ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్పూరీ ఠాకుర్ గారి గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం అలాగే ఇప్పటి వరకు భారత రత్న అవార్డులు పొందిన వారి వివరాలను కూడా తెలుసుకుందాం

కర్పూరీ ఠాకుర్ గురించి కొన్ని వివరాలు

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం కృషి చేసి బీహార్ “జన నాయక్”(జననేత) గా ప్రసిద్ధి పొందిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కర్పూరీ ఠాకుర్ 100వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది (మరణాంతరం). ఈ పురస్కారాన్ని పొందిన 49వ వ్యక్తిగా కర్పూరీ ఠాకుర్ నిలిచారు.

జననంజనవరి 24, 1924
మరణం ఫిబ్రవరి 17, 1998.
జన్మ ప్రదేశంబీహార్ లోని సమస్తీపుర్ జిల్లాలో కర్పూరీ గ్రామంలో పేరొందిన పితౌంజియా
తల్లిదండ్రులు గోకుల్ ఠాకుర్, రామ్ దులారీదేవీ

కర్పూరీ ఠాకుర్ రాజకీయ ప్రస్థానం

  • ఈయన విద్యార్థి దశలో ఆల్ ఇండియా స్టూడెంట్ఫెడరేషన్లో చేరడంతో రాజకీయ ప్రస్థానం మొదలైంది.
  • 1942-45 మధ్య క్విస్ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారు.
  • ఈయన 1952 తొలిసారి తేజ్పుర్ నియోజక వర్గం నుంచి సోషలిస్టు పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై చట్టసభలో అడుగుపెట్టారు.
  • 1967-68 మధ్య రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు.
  • ఈయన 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు సోషలిస్టు పార్టీ తరపున, 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు జనతా పార్టీ తరపున ముఖ్యమంత్రిగా సేవలందించారు.
క్ర.సం.భారత రత్న పురస్కార గ్రహీత పేరుపురస్కారం పొందిన సంవత్సరంఅందించిన సేవలు
1డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954కార్యకర్త, రాజనీతిజ్ఞుడు మరియు న్యాయవాది
2చక్రవర్తుల రాజగోపాలాచారి1954భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి
3డా॥ సి.వి. రామన్ 1954భౌతిక శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రవేత్తలు మరియు శాస్త్రవేత్తలు
4డా॥ భగవాన్ దాస్1955కార్యకర్త, తత్వవేత్త మరియు విద్యావేత్త
5డా॥ మోక్షగుండం విశ్వేశ్వరయ్య1955సివిల్ ఇంజనీర్, రాజనీతిజ్ఞుడు మరియు మైసూర్ దివాన్
6పండిత్ జవహర్ లాల్ నెహ్రూ1955కార్యకర్త మరియు రచయిత భారతదేశ ప్రధాన మంత్రిగా పనిచేశారు
7గోవింద్ వల్లభ్ పంత్1957ఉద్యమకారుడు మరియు ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి
8డా॥ ధొండొ కేశవ కార్వే 1958సంఘ సంస్కర్త మరియు విద్యావేత్త
9డా॥ బి.పి. రాయ్1961వైద్యుడు, రాజకీయ నాయకుడు, పరోపకారి, విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్త
1oపురుషోత్తమ దాస్ టాండన్ 1961యునైటెడ్ ప్రావిన్సెస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కార్యకర్త మరియు స్పీకర్
11డా॥ రాజేంద్ర ప్రసాద్1962కార్యకర్త, న్యాయవాది, రాజనీతిజ్ఞుడు మరియు పండితుడు
12డా॥ జాకీర్ హుస్సేన్1963కార్యకర్త, ఆర్థికవేత్త మరియు విద్యా తత్వవేత్త అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా మరియు బీహార్ గవర్నర్‌గా పనిచేశారు.
13డా॥ పాండురంగ వామన్ కానే1963ఇండాలజిస్ట్ మరియు సంస్కృత పండితుడు, ఐదు-వాల్యూమ్‌ల సాహిత్య రచనకు ప్రసిద్ధి చెందారు
14లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం)1966కార్యకర్త మరియు భారతదేశ రెండవ ప్రధాన మంత్రిగా పనిచేశారు
15ఇందిరాగాంధీ (మొదటి మహిళ)1971 భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి
16వి.వి. గిరి1975ట్రేడ్ యూనియన్ వాది
17కుమారస్వామి కామరాజు (మరణానంతరం)1976స్వాతంత్ర్య ఉద్యమకారుడు మరియు రాజనీతిజ్ఞుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి
18మదర్ థెరీసా198oకాథలిక్ సన్యాసిని మరియు మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు.
19ఆచార్య వినోబా భావే (మరణానంతరం)1983కార్యకర్త, సంఘ సంస్కర్త మరియు మహాత్మా గాంధీకి సన్నిహిత సహచరుడు
2oఖాన్ అబ్దుల్ గఫార్1987మొదటి పౌరుడు, స్వాతంత్ర్య కార్యకర్త
21ఎం జి రామచంద్రన్ (మరణానంతరం)1988రాజకీయ నాయకుడిగా మారిన నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి
22 డా॥ బి. ఆర్. అంబేద్కర్ (మరణానంతరం)199oసంఘ సంస్కర్త మరియు దళితుల నాయకుడు
23డా॥ నెల్సన్ మండేలా199oదక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమ నాయకుడు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
24రాజీవ్ గాంధీ (మరణానంతరం)19911984 నుండి 1989 వరకు పనిచేసిన భారతదేశ తొమ్మిదవ ప్రధానమంత్రి.
25సర్దార్ వల్లభాయ్ పటేల్ (మరణానంతరం)1991కార్యకర్త మరియు భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి
26మొరార్జీ దేశాయి1991కార్యకర్త, మరియు భారతదేశ ప్రధాన మంత్రి
27మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (మరణానంతరం)1992కార్యకర్త మరియు విద్యాశాఖ మొదటి మంత్రి
28జె.ఆర్.డి.టాటా 1992పారిశ్రామికవేత్త, పరోపకారి మరియు విమానయాన మార్గదర్శకుడు
29సత్యజిత్ రే1992దర్శకుడు, చిత్రనిర్మాత, రచయిత, నవలా రచయిత
3oడా॥ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్1997ఏరోస్పేస్ మరియు రక్షణ శాస్త్రవేత్త
31గుర్జారీలాల్ నందా1997కార్యకర్త, మరియు భారతదేశ తాత్కాలిక ప్రధాన మంత్రి.
32అరుణా అసఫ్ అలీ (మరణానంతరం)1997కార్యకర్త
33ఎం.ఎస్. సుబ్బలక్ష్మి1998కర్ణాటక శాస్త్రీయ గాయకురాలు
34సి. సుబ్రమణ్యం1998కార్యకర్త మరియు భారతదేశ మాజీ వ్యవసాయ మంత్రి
35జయప్రకాశ్ నారాయణ్ (మరణానంతరం)1999 కార్యకర్త, సంఘ సంస్కర్త
36రవి శంకర్1999సంగీత విద్వాంసుడు, సితార్ వాద్య కారుడు
37అమర్త్య సేన్ 1999ఆర్థికవేత్త
38గోపినాథ్ బొర్దాలాయి (మరణానంతరం)1999కార్యకర్త
39లతా మంగేష్కర్ 2001గాయకురాలు
40బిస్మిల్లా ఖాన్2001హిందుస్థానీ క్లాసికల్ షెహనాయ్ ప్లేయర్
41భీమ్ సేన్ జోషి2009హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు
42సి.ఎన్.ఆర్.రావు2014రసాయన శాస్త్రవేత్త మరియు ప్రొఫెసర్, రచయిత
43సచిన్ రమేష్ టెండూల్కర్ (అతి పిన్న వయస్కుడు)2014క్రికెటర్
44అటల్ బిహారీ వాజ్పేయ్2015తొమ్మిది సార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికై, మూడు సార్లు భారత ప్రధానిగా పనిచేశారు.
45మదన్ మోహన్ మాలవ్యా (మరణానంతరం)4647482015పండితుడు మరియు విద్యా సంస్కర్త.
46నానాజీ దేశముఖ్ (మరణానంతరం)2019భారతదేశం నుండి ఒక సామాజిక కార్యకర్త, విద్య, ఆరోగ్యం మరియు గ్రామీణ స్వావలంబన.
47డా॥ భూపేంద్ర కుమార్ హజారిక (మరణానంతరం)2019అస్సాం నుండి భారతీయ నేపథ్య గాయకుడు, గీత రచయిత, సంగీతకారుడు, గాయకుడు, కవి మరియు చిత్రనిర్మాత.
48ప్రణబ్ ముఖర్జీ 2019భారతీయ రాజకీయ నాయకుడు మరియు భారత జాతీయ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు.
49కర్పూరీ ఠాకుర్ (మరణానంతరం)2024ప్రఖ్యాత సోషలిస్ట్ నాయకుడు మరియు బీహార్ మాజీ ముఖ్యమంత్రి

భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు :

  • సర్వేపల్లి రాధాకృష్ణన్
  • డా॥ రాజేంద్రప్రసాద్
  • డా॥ జాకీర్ హుస్సేన్
  • వి.వి. గిరి
  • అబ్దుల్ కలాం
  • ప్రణబ్ ముఖర్జీ

భారతరత్న అవార్డు పొందిన ప్రధానమంత్రులు :

  • జవహర్ లాల్ నెహ్రూ
  • లాల్‌ బహదూర్ శాస్త్రి
  • ఇందిరాగాంధీ
  • రాజీవ్ గాంధీ
  • మొరార్జీ దేశాయ్
  • గుల్ జారీ లాల్ నంద
  • అటల్ బిహారీ వాజ్‌పేయి

భారతరత్న అవార్డు పొందిన మహిళలు:

  • ఇందిరాగాంధీ
  • మదర్ థెరిసా
  • అరుణా అసఫ్ అలీ
  • ఎం. ఎస్. సుబ్బలక్ష్మి
  • లతా మంగేష్కర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!