భారతరత్న పురస్కారం భారతదేశ పౌరులకు అందించే అత్యుత్తమ పురస్కారం. దీనిని జనవరి 2, 1954 సం||లో భారతదేశ మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ గారిచే ప్రారంభించబడింది.
ఈ అవార్డును ప్రజాసేవ, సాహిత్యం, సైన్స్, కళ మరియు ఇతర ఏ రంగంలో అయినా అత్యున్నత పనితీరు కనబరిచిన వారికి అందించడం జరుగుతుంది. ఈ అవార్డును 1 సం||లో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులకు అందిస్తారు.
2024 సంవత్సరానికి గాను కర్పూరీ ఠాకుర్ కు భారత రత్న అవార్డును ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్పూరీ ఠాకుర్ గారి గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం అలాగే ఇప్పటి వరకు భారత రత్న అవార్డులు పొందిన వారి వివరాలను కూడా తెలుసుకుందాం
కర్పూరీ ఠాకుర్ గురించి కొన్ని వివరాలు
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం కృషి చేసి బీహార్ “జన నాయక్”(జననేత) గా ప్రసిద్ధి పొందిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కర్పూరీ ఠాకుర్ 100వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది (మరణాంతరం). ఈ పురస్కారాన్ని పొందిన 49వ వ్యక్తిగా కర్పూరీ ఠాకుర్ నిలిచారు.
జననం | జనవరి 24, 1924 |
మరణం | ఫిబ్రవరి 17, 1998. |
జన్మ ప్రదేశం | బీహార్ లోని సమస్తీపుర్ జిల్లాలో కర్పూరీ గ్రామంలో పేరొందిన పితౌంజియా |
తల్లిదండ్రులు | గోకుల్ ఠాకుర్, రామ్ దులారీదేవీ |
కర్పూరీ ఠాకుర్ రాజకీయ ప్రస్థానం
- ఈయన విద్యార్థి దశలో ఆల్ ఇండియా స్టూడెంట్ఫెడరేషన్లో చేరడంతో రాజకీయ ప్రస్థానం మొదలైంది.
- 1942-45 మధ్య క్విస్ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారు.
- ఈయన 1952 తొలిసారి తేజ్‌పుర్ నియోజక వర్గం నుంచి సోషలిస్టు పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై చట్టసభలో అడుగుపెట్టారు.
- 1967-68 మధ్య రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు.
- ఈయన 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు సోషలిస్టు పార్టీ తరపున, 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు జనతా పార్టీ తరపున ముఖ్యమంత్రిగా సేవలందించారు.
క్ర.సం. | భారత రత్న పురస్కార గ్రహీత పేరు | పురస్కారం పొందిన సంవత్సరం | అందించిన సేవలు |
1 | డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ | 1954 | కార్యకర్త, రాజనీతిజ్ఞుడు మరియు న్యాయవాది |
2 | చక్రవర్తుల రాజగోపాలాచారి | 1954 | భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి |
3 | డా॥ సి.వి. రామన్ | 1954 | భౌతిక శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రవేత్తలు మరియు శాస్త్రవేత్తలు |
4 | డా॥ భగవాన్ దాస్ | 1955 | కార్యకర్త, తత్వవేత్త మరియు విద్యావేత్త |
5 | డా॥ మోక్షగుండం విశ్వేశ్వరయ్య | 1955 | సివిల్ ఇంజనీర్, రాజనీతిజ్ఞుడు మరియు మైసూర్ దివాన్ |
6 | పండిత్ జవహర్ లాల్ నెహ్రూ | 1955 | కార్యకర్త మరియు రచయిత భారతదేశ ప్రధాన మంత్రిగా పనిచేశారు |
7 | గోవింద్ వల్లభ్ పంత్ | 1957 | ఉద్యమకారుడు మరియు ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి |
8 | డా॥ ధొండొ కేశవ కార్వే | 1958 | సంఘ సంస్కర్త మరియు విద్యావేత్త |
9 | డా॥ బి.పి. రాయ్ | 1961 | వైద్యుడు, రాజకీయ నాయకుడు, పరోపకారి, విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్త |
1o | పురుషోత్తమ దాస్ టాండన్ | 1961 | యునైటెడ్ ప్రావిన్సెస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కార్యకర్త మరియు స్పీకర్ |
11 | డా॥ రాజేంద్ర ప్రసాద్ | 1962 | కార్యకర్త, న్యాయవాది, రాజనీతిజ్ఞుడు మరియు పండితుడు |
12 | డా॥ జాకీర్ హుస్సేన్ | 1963 | కార్యకర్త, ఆర్థికవేత్త మరియు విద్యా తత్వవేత్త అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా మరియు బీహార్ గవర్నర్‌గా పనిచేశారు. |
13 | డా॥ పాండురంగ వామన్ కానే | 1963 | ఇండాలజిస్ట్ మరియు సంస్కృత పండితుడు, ఐదు-వాల్యూమ్ల సాహిత్య రచనకు ప్రసిద్ధి చెందారు |
14 | లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) | 1966 | కార్యకర్త మరియు భారతదేశ రెండవ ప్రధాన మంత్రిగా పనిచేశారు |
15 | ఇందిరాగాంధీ (మొదటి మహిళ) | 1971 | భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి |
16 | వి.వి. గిరి | 1975 | ట్రేడ్ యూనియన్ వాది |
17 | కుమారస్వామి కామరాజు (మరణానంతరం) | 1976 | స్వాతంత్ర్య ఉద్యమకారుడు మరియు రాజనీతిజ్ఞుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి |
18 | మదర్ థెరీసా | 198o | కాథలిక్ సన్యాసిని మరియు మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు. |
19 | ఆచార్య వినోబా భావే (మరణానంతరం) | 1983 | కార్యకర్త, సంఘ సంస్కర్త మరియు మహాత్మా గాంధీకి సన్నిహిత సహచరుడు |
2o | ఖాన్ అబ్దుల్ గఫార్ | 1987 | మొదటి పౌరుడు, స్వాతంత్ర్య కార్యకర్త |
21 | ఎం జి రామచంద్రన్ (మరణానంతరం) | 1988 | రాజకీయ నాయకుడిగా మారిన నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి |
22 | డా॥ బి. ఆర్. అంబేద్కర్ (మరణానంతరం) | 199o | సంఘ సంస్కర్త మరియు దళితుల నాయకుడు |
23 | డా॥ నెల్సన్ మండేలా | 199o | దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమ నాయకుడు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు |
24 | రాజీవ్ గాంధీ (మరణానంతరం) | 1991 | 1984 నుండి 1989 వరకు పనిచేసిన భారతదేశ తొమ్మిదవ ప్రధానమంత్రి. |
25 | సర్దార్ వల్లభాయ్ పటేల్ (మరణానంతరం) | 1991 | కార్యకర్త మరియు భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి |
26 | మొరార్జీ దేశాయి | 1991 | కార్యకర్త, మరియు భారతదేశ ప్రధాన మంత్రి |
27 | మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (మరణానంతరం) | 1992 | కార్యకర్త మరియు విద్యాశాఖ మొదటి మంత్రి |
28 | జె.ఆర్.డి.టాటా | 1992 | పారిశ్రామికవేత్త, పరోపకారి మరియు విమానయాన మార్గదర్శకుడు |
29 | సత్యజిత్ రే | 1992 | దర్శకుడు, చిత్రనిర్మాత, రచయిత, నవలా రచయిత |
3o | డా॥ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ | 1997 | ఏరోస్పేస్ మరియు రక్షణ శాస్త్రవేత్త |
31 | గుర్జారీలాల్ నందా | 1997 | కార్యకర్త, మరియు భారతదేశ తాత్కాలిక ప్రధాన మంత్రి. |
32 | అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) | 1997 | కార్యకర్త |
33 | ఎం.ఎస్. సుబ్బలక్ష్మి | 1998 | కర్ణాటక శాస్త్రీయ గాయకురాలు |
34 | సి. సుబ్రమణ్యం | 1998 | కార్యకర్త మరియు భారతదేశ మాజీ వ్యవసాయ మంత్రి |
35 | జయప్రకాశ్ నారాయణ్ (మరణానంతరం) | 1999 | కార్యకర్త, సంఘ సంస్కర్త |
36 | రవి శంకర్ | 1999 | సంగీత విద్వాంసుడు, సితార్ వాద్య కారుడు |
37 | అమర్త్య సేన్ | 1999 | ఆర్థికవేత్త |
38 | గోపినాథ్ బొర్దాలాయి (మరణానంతరం) | 1999 | కార్యకర్త |
39 | లతా మంగేష్కర్ | 2001 | గాయకురాలు |
40 | బిస్మిల్లా ఖాన్ | 2001 | హిందుస్థానీ క్లాసికల్ షెహనాయ్ ప్లేయర్ |
41 | భీమ్ సేన్ జోషి | 2009 | హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు |
42 | సి.ఎన్.ఆర్.రావు | 2014 | రసాయన శాస్త్రవేత్త మరియు ప్రొఫెసర్, రచయిత |
43 | సచిన్ రమేష్ టెండూల్కర్ (అతి పిన్న వయస్కుడు) | 2014 | క్రికెటర్ |
44 | అటల్ బిహారీ వాజ్‌పేయ్ | 2015 | తొమ్మిది సార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికై, మూడు సార్లు భారత ప్రధానిగా పనిచేశారు. |
45 | మదన్ మోహన్ మాలవ్యా (మరణానంతరం)464748 | 2015 | పండితుడు మరియు విద్యా సంస్కర్త. |
46 | నానాజీ దేశముఖ్ (మరణానంతరం) | 2019 | భారతదేశం నుండి ఒక సామాజిక కార్యకర్త, విద్య, ఆరోగ్యం మరియు గ్రామీణ స్వావలంబన. |
47 | డా॥ భూపేంద్ర కుమార్ హజారిక (మరణానంతరం) | 2019 | అస్సాం నుండి భారతీయ నేపథ్య గాయకుడు, గీత రచయిత, సంగీతకారుడు, గాయకుడు, కవి మరియు చిత్రనిర్మాత. |
48 | ప్రణబ్ ముఖర్జీ | 2019 | భారతీయ రాజకీయ నాయకుడు మరియు భారత జాతీయ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు. |
49 | కర్పూరీ ఠాకుర్ (మరణానంతరం) | 2024 | ప్రఖ్యాత సోషలిస్ట్ నాయకుడు మరియు బీహార్ మాజీ ముఖ్యమంత్రి |
భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు :
- సర్వేపల్లి రాధాకృష్ణన్
- డా॥ రాజేంద్రప్రసాద్
- డా॥ జాకీర్ హుస్సేన్
- వి.వి. గిరి
- అబ్దుల్ కలాం
- ప్రణబ్ ముఖర్జీ
భారతరత్న అవార్డు పొందిన ప్రధానమంత్రులు :
- జవహర్ లాల్ నెహ్రూ
- లాల్ బహదూర్ శాస్త్రి
- ఇందిరాగాంధీ
- రాజీవ్ గాంధీ
- మొరార్జీ దేశాయ్
- గుల్ జారీ లాల్ నంద
- అటల్ బిహారీ వాజ్‌పేయి
భారతరత్న అవార్డు పొందిన మహిళలు:
- ఇందిరాగాంధీ
- మదర్ థెరిసా
- అరుణా అసఫ్ అలీ
- ఎం. ఎస్. సుబ్బలక్ష్మి
- లతా మంగేష్కర్
Leave a Reply