ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచంటే.. పూర్తి వివరాలు ఇవే..

వచ్చే వారం సంక్రాంతి సందడి ఊపందుకోనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు సంక్రాంతి పండుగ సెలవుల్ని (Sankranti Holidays) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవుల్ని ప్రకటించింది

జనవరి 9 నుంచి జనవరి 18 వరకు సెలవులు

ఆంధ్రప్రదేశ్‌లో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు 10 రోజులు ఉంటాయి. జనవరి 9 నుంచి జనవరి 18 వరకు సెలవులు ఉంటాయని అధికారులు ప్రకటించారు. పాఠశాల విద్యార్థులకు 10 సంక్రాంతి సెలవులు రావడం విశేషం

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు జనవరి 19న తిరిగి ప్రారంభం అవుతాయి. ఏపీలో కళాశాలలకు సెలవుల వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ఇక తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు 6 రోజులు సంక్రాంతి సెలవులు ప్రకటించగా, ఇంటర్మీడియట్ కాలేజీలకు మాత్రం కేవలం 4 రోజులే హాలిడేస్ ఇచ్చింది. ఇంటర్ కళాశాల విద్యార్థులకు జనవరి 13 నుంచి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. కాలేజీలు తిరిగి జనవరి 17న తెరుచుకుంటాయి. ఇంటర్ విద్యార్థులకు జనవరి 22 నుంచి 29 వరకు ప్రీ-ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి

జనవరి 13 రెండో శనివారం కాగా, జనవరి 14 ఆదివారం భోగి, జనవరి 15 సోమవారం సంక్రాంతి, జనవరి 16 మంగళవారం కనుమ పండుగలు ఉన్నాయి.

సంక్రాంతి సెలవల్లో ఎటువంటి మార్పు లేదు

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 09/01/2024  నుండి 18/01/2024 వరకు సంక్రాతి సెలవలు.

Last working day: 08/01/24

Re opening: 19/01/24

ఈ రెండు రోజలు తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!