Bigg Boss 7 లాంచ్ ఈవెంట్ లోనే 35 లక్షలు? పెట్టెలో ఏముందో తెలుసా

Bigg Boss 7 Telugu ఏడవ సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

తొలి రోజు 14 మంది కంటెస్టెంట్ల గ్రాండ్ ఎంట్రీ తో ఉల్టా పల్టా సీజన్ అంటూ నాగార్జున బాగానే హైప్ ఇచ్చారు. ఈ షోకి ఖుషి ప్రమోషన్ కి సంబంధించి విజయ్ దేవరకొండ మరియు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్ లో భాగంగా నవీన్ పోలిశెట్టి గెస్ట్లుగా విచ్చేసి సందడి చేశారు.

అయితే ఏ సీజన్లో కూడా జరగని విధంగా తొలిరోజు ఈ ఉల్టా పల్టా బిగ్ బాస్ 7 సీజన్లో ప్రేక్షకులు ఊహించని విధంగా పెద్ద ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఐదు కంటెస్టెంట్లకు 35 లక్షల రూపాయల బ్రీఫ్ కేస్ తీసుకువచ్చి నాగర్జున ఆశ చూపారు.

Bigg Boss 7 Telugu

అసలు 35 లక్షలు కంటెస్టెంట్లు ఎందుకు తీసుకోలేదు?

బిగ్ బాస్ కి సంబంధించి ఇప్పటివరకు మనం ఆరు సీజన్లను చూసాం. ఈ ఆరు సీజన్లో కూడా కొంతమంది చివరి ఎపిసోడ్లో డబ్బులు తీసుకొని నిష్క్రమించిన వాళ్లు ఉన్నారు.

35 లక్షలు తీసుకొని తొలి ఎపిసోడ్ లో వెళ్లడం అంటే ఇంతకన్నా బంపర్ ఆఫర్ ఉంటుందా? మరి ఇంతటి బంపర్ ఆఫర్ ను ఫస్ట్ ఎపిసోడ్ లో ఎవరైనా మిస్ చేసుకుంటారా?

అయితే ఇక్కడే ఒక ట్విస్ట్. బిగ్ బాస్ సీజన్ మధ్యలో కానీ లేదా చివర్లో కానీ ఇలాంటి ఆఫర్ ఇస్తే కొంత మంది ఆశ కలిగి వెళ్లే అవకాశం ఉంటుంది.

కానీ అసలే ఫస్ట్ సీజన్, శుభమా అంటూ ఎంట్రీ ఇచ్చారు.. ఆహా ఓహో మేము అది మేము ఇది. నాదే కప్పు, టైటిల్ అని ఓ గొప్పలు చెప్పుకొని అప్పుడే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇలా అన్ని మాటలు వెనక్కు తీసుకుని వెంటనే డబ్బుతో బయటకు వస్తే పరువు పోతుంది అనుకోవచ్చు కదా.. ఇది ఒక కారణం, ఇంకా బిగ్ బాస్ లో కొన్ని రోజులు అయినా కనబడితే వాళ్ళ కెరీర్ కి ప్లస్ పాయింట్. ఇది కూడా ఆలోచించి ఉండవచ్చు. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే అసలు పెట్టెలో అమౌంట్ ఉందా?

35 lakh brief case

పెట్టెలో అసలు అమౌంట్ ఉందా?

అసలుకే ఫస్ట్ నుంచి నాగార్జున ఉల్టా పల్టా తెగ హైప్ ఇస్తున్నారు. అంటే అనుకున్నది ఒక్కటైతే జరిగేది ఒకటి అని అర్థం. మరి కంటెస్టెంట్ లో నిబద్ధతను తెలుసుకోవడానికి పెట్టెలో ఏమీ పెట్టకుండా ఇలా ఒక చిన్న గేమ్ ఆడి ఉండవచ్చు అని కూడా అనుకుంటున్నారు. ఈ విషయం తెలియనంత అమాయకులు అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లు కాదు కదా. కాబట్టి డబ్బు కి ఆశపడి పెట్టె తీసుకొని బయటికి వస్తే చివరికి అందులో ఏమీ లేకపోతే, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అంటూ అటు పేరు, ఇటు డబ్బు పోతుందని కూడా ఆలోచించి ఉండవచ్చు.

ఏది ఏమైనా బిగ్ బాస్ అనుకున్నది ఏంటంటే, తొలి రోజు కాబట్టి పై కారణాలతో ఎలాగో చాలా వరకు ఈ సూట్ కేస్ ఎవరు తీసుకు వెళ్ళరు అని trp కోసం ఈ ట్విస్ట్ ఇచ్చి ఉండవచ్చు. ఏదైతే నేమి తొలి రోజు అదరగొట్టిన బిగ్ బాస్ సీజన్ 7 , ఇక ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో వచ్చే వారితో ఇంకా ఎలా రసవత్తరంగా మార బోతుందో చూద్దాం.

Bigg
Share with your friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *