PM Poshan Gorumudda Scheme - పీఎం పోషణ గోరుముద్ద

#

PM Poshan Gorumudda Scheme - పీఎం పోషణ గోరుముద్ద





PM Poshan Goru Mudda Mid day Meals scheme


పీఎం పోషణ గోరుముద్ద పథకం అంటే ఏమిటి?
పీఎం పోషణ గోరుముద్ద పథకం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం. ఇదివరకే ఉన్న మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎపి జగన్నన్న గోరుముద్ద పథకాన్ని ప్రవేశపెట్టింది.
గోరుముద్ద పథకాన్ని 2020 జనవరి 21 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ పథకాన్ని ప్రవేశపెట్టడంతో, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందుబాటులో ఉన్న మధ్యాహ్నం భోజన మెనూలోనూ మార్పులు చేయబడ్డాయి.
ఈ పథకం ద్వారా, వారమంతా ప్రభుత్వ పాఠశాలల్లో లభించే ఆహారంలో పోషక దృక్పథాన్ని మెరుగుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తుంది.

సవరించిన మెనూ ఏమిటి?


Monday హాట్ పొంగల్ , బాయిల్డ్ ఎగ్ ,వెజ్ పులావ్ , గుడ్డు కర్రీ, చిక్కి
Tuesday చింతపండు పులిహోర, దొండకాయ చట్నీ,ఉడికించిన గుడ్డు ,రాగి జావ
Wednesday వెజిటేబుల్ రైస్, బంగాళదుంప కుర్మా, గ్రుడ్డు, చిక్కి
Thursday సాంబార్ అన్నం, నిమ్మకాయ పులిహోర, టొమాటో చట్నీ,గుడ్డు, రాగి జావ
Friday అన్నం, ఆకు కూర, కోడిగుడ్డు, చిక్కి
Saturday అన్నం, సాంబార్, పాయసం లేదా స్వీట్ పొంగల్, రాగి జావ

ఈ పథకాన్ని ఎవరు అమలు చేస్తారు?
ఈ పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు అనగా DEO లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గడిచిన నెలకు సంబంధించినటువంటి బిల్లులు DEO వారి ద్వారా ఐదో తేదీ లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన బిల్లు ల పేమెంట్ ప్రభుత్వం 10 వ తేది చెల్లిస్తుంది.

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #