చంద్రయాన్ -3 అనేది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టదలచిన చంద్రయాత్ర. భారత చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడవది.. ఈ రోజు (14 జూలై 2023) మధ్యాహ్నం 2.35 నిముషాలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది ఇస్రో
- చంద్రయాన్-2 లో లాగానే ఇందులో కూడా ఒక రోవరును, ఒక ల్యాండరునూ పంపుతారు. కానీ ఇందులో ఆర్బిటరు ఉండదు. దాని ప్రొపల్షను మాడ్యూలే రిలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది. ఈ ప్రొపల్షను మాడ్యూలు చంద్రుని చుట్టూ 100 కి.మీ. కక్ష్య వరకూ ల్యాండరును రోవరునూ తీసుకుపోతుంది.
సుమారు 3,84,000 కి.మీ ప్రయాణం..
- చంద్రయాన్ (Chandrayaan) సిరీస్‌లో ఇది మూడో ప్రయోగం. ఎల్బీఎం3-ఎం4 భారీ వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఈ ఉపగ్రహాన్ని ల్యాండర్, రోవర్ ప్రొపల్షన్ మాడ్యూల్తో అనుసంధానించారు. సుమారు 3,84,000 కి.మీ. ప్రయాణించి చంద్రుని నుంచి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది. ఆ తర్వాత జాబిల్లి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అవుతుందని ఇస్రో తెలిపింది. దీనిలో ఆర్బిటర్‌ను పంపడంలేదు. చంద్రయాన్ 2లో ప్రయోగించిన ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతోంది. దాన్నే ఇప్పుడు వినియోగించుకోనున్నట్లు ఇస్రో ఇదివరకు వెల్లడించింది.
చంద్రయాన్ -3 లక్ష్యాలు…
చంద్రయాన్-3 మిషన్ కోసం ఇస్రో మూడు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకుంది. అవి:
- చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా, మృదువుగా ల్యాండింగు చేయడం.
- చంద్రునిపై రోవర్ సంచరించే సామర్థ్యాలను గమనించడం, ప్రదర్శించడం
- చంద్రుని కూర్పును బాగా అర్థం చేసుకోవడానికి, చంద్రుని ఉపరితలంపై లభ్యమయ్యే రసాయనాలు, సహజ మూలకాలు, నేల, నీరు మొదలైన వాటిపై అక్కడే శాస్త్రీయ ప్రయోగాలు, పరిశీలనలు చేయడం. రెండు గ్రహాల మధ్య యాత్రలు చేసేందుకు అవసరమైన కొత్త టెక్నాలజీల అభివృద్ధి, ప్రదర్శన
అంతరిక్ష పరిశోధనలో కీలక అడుగు….
- ఇప్పటి వరకు అమెరికా (USA), రష్యా (Russia), చైనా (China) దేశాలు చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తమ వాహక నౌకలను ల్యాండ్ చేయగలిగాయి. ఈ మైలురాయిని సాధించిన నాలుగో దేశంగా అవతరించాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే.. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా 2019లో చంద్రయాన్-2 (Chandrayaan-3) ప్రయోగాన్ని చేపట్టింది. అయితే, చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్యండింగ్ సమయంలో విఫలమైంది. అంతకుముందు.. 2008లో చంద్రయాన్-1 (ల్యాండర్ లేకుండా ఆర్బిటర్, ఇంపాక్టర్తో జరిపిన ప్రయత్నం)ను చేపట్టింది. తాజాగా చేపడుతోన్న చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైతే మాత్రం భారత అంతరిక్ష పరిశోధనలో కీలక అడుగుపడినట్లే..!
ల్యాండింగ్‌కి కనీసం 15 నిముషాల సమయం పడుతుంది
చంద్రుడిపై సన్‌రైజ్ ఎలా ఉందన్న దానిపైనే ల్యాండింగ్ ఎప్పుడవుతుందన్నది ఆధారపడి ఉంటుంది. సన్‌రైజ్‌లో ఆలస్యం జరిగితే..ల్యాండింగ్ కూడా లేట్ అవుతుంది. కానీ…ఈ మిషన్‌లో అసలైన క్రూషియల్ పాయింట్ ఇదే. ల్యాండింగ్‌కి కనీసం 15 నిముషాల సమయం పడుతుంది. అందుకే…ఇస్రో మాజీ ఛైర్పర్సన్ కే శివన్ “15 మినిట్స్ ఆఫ్ టెర్రర్” అని డిఫైన్ చేశారు. ఒక్కసారి సేఫ్‌గా ల్యాండ్ అయిన తరవాత ల్యాండర్ (Vikram) నాలుగు సైంటిఫిక్ పేలోడ్స్‌ని ( scientific payloads) చంద్రుడి ఉపరితలంపై డిప్లాయ్ చేస్తుంది. అవే చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులను స్టడీ చేస్తాయి. ఈ మాడ్యూల్లో Spectro-polarimetry of HAbitable Planet Earth (SHAPE) పరికరం అమర్చి ఉంటుంది. భూమి ఎంత కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది..? ఎంత ఎమిట్ చేస్తోంది..? అనే డేటాని ఈ పరికరం సేకరిస్తుంది. ఇక రోవర్ ప్రగ్యాన్ (Pragyan Rover) కెమికల్ టెస్ట్‌ల ద్వారా లూనార్ సర్ఫేస్పై పరిశోధనలు చేపడుతుంది.
Leave a Reply