విధాన పరిషత్
(శాసన మండలి)
విధాన పరిషత్ రాష్ట్ర శాసన నిర్మాణశాఖలో రెండోసభ దీన్ని శాసనమండలి, ఎగువసభ, శాశ్వతసభ, పెద్దలసభ అని పిలుస్తారు.
విధాన పరిషత్ (శాసన మండలి) ఏ లేదా రద్దు
- ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ ఏర్పా టు లేదా రద్దుకు సం బంధించి విధానసభ ప్రత్యేక మెజారిటీతో తీర్మానాన్ని ఆమో దించి పార్లమెంటుకు పంపాలి.
- పార్లమెంటు సాధారణ మెజా రిటీతో ఏర్పాటు లేదా రద్దుకు సంబంధించి శాసనం చేస్తుంది.
విధాన పరిషత్ నిర్మాణం
- విధాన పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య, విధానసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3వ వంతు మించరాదు..
- విధాన పరిషత్ కనీస సభ్యుల సంఖ్య మండలిలో 5/6 వంతు మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఈ సభకు 1/6 వ వంతు మందిని నామినేట్ చేస్తారు.
విధాన పరిషత్ ఎన్నిక
- మొత్తం సభ్యులలో 1/3వ వం తు మంది సభ్యులను గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధు లు ఎన్నుకుంటారు.
- 1/3వ వంతు మంది సభ్యులు శాసనసభ సభ్యుల చేత ఎన్నిక చేయబడతారు
- మొత్తం సభ్యులలో 1/12వ వంతు సభ్యులను గ్రాడ్యు యేట్లు ఎన్నుకుంటారు.
- మొత్తం సభ్యుల్లో మరో 1/12వ వంతు మందిని రాష్ట్ర సెకండరీ స్థాయి పాఠశాలకు తక్కువ కాకుండా ఉండే విద్యాసంస్థల్లో కనీసం 3ఏళ్లు ఉపాధ్యాయు లుగా ఉన్నవారు ఎన్నుకుంటారు. సాహిత్యం, శాస్త్రీయ విజ్ఞానం, సామాజిక సేవ, కళలు, సహ కార రంగాల నుంచి గవర్నర్ నామినేట్ చేస్తారు.
విధాన పరిషత్ కాలపరిమితి
- విధాన పరిషత్ శాశ్వతసభ పరిషత్ సభ్యుల కాలపరిమితి – 6 ఏళ్లు
విధాన పరిషత్ సభ్యుల అర్హతలు
- భారత పౌరసత్వం ఉండాలి.
- 30 ఏళ్ల వయసు కలిగి ఉండాలి
- పార్లమెంట్ నిర్ణయించిన అర్హతలుండలి
శాసన మండలి ఉన్నరాష్ట్రాలు
- జమ్మూకశ్మీర్
- ఉత్తరప్రదేశ్
- బిహార్
- మహారాష్ట్ర
- కర్ణాటక
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
గమనిక
భారతదేశంలో పైన పేర్కొన్న 7రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఒకేసభ ఉంది.
- విధానసభను దిగువసభ, శాసన సభ, అసెంబ్లీ, మొదటిసభ అని పిలుస్తారు.
- విధాన సభ మొత్తం సభ్యుల సంఖ్య 60కి తగ్గరాదు.
- గరిష్ట సభ్యుల సంఖ్య 500కు మించరాదు.
- (గోవా, మిజోరం, సిక్కిం వంటి చిన్న రాష్ట్రాల్లో కనీస సభ్యుల సంఖ్యలో మినహాయింపు ఉంది)
Leave a Reply