Current Affairs December 2022 Telugu by Studybizz

  1. G20 Summit – ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కూటముల్లో ఒకటైన జీ-20 అధ్యక్ష బాధ్యతలను మనదేశం అధికారికంగా చేపట్టింది. ఈ నేపథ్యంలో మానవాళి మొత్తానికి ప్రయోజనం కోసం ‘ప్రాథమిక ఆలోచనా ధోరణిలో మార్పు’ అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అలాగే ఇది యుద్ధాల శకం కాదన్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే ఇతివృత్తం ప్రేరణతో ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. భారత్‌ జీ-20 ఎజెండా ప్రతిష్ఠాత్మకంగా, కార్యాచరణ ఆధారితంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని తెలిపారు. భారత్‌ అధ్యక్ష హోదాను వైద్యం, సామరస్యం, ఆశల అధ్యక్షతగా మార్చేందుకు కలిసి పనిచేద్దామన్నారు. మానవ-కేంద్రీకృతంగా ప్రపంచీకరణకు కొత్త నమూనా రూపొందించడానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.

జీ20 అధ్యక్ష పదవిని భారత్‌ అధికారికంగా చేపట్టిన సందర్భంగా అమెరికాతో పాటు ఫ్రాన్స్‌ తమ మద్దతును తెలియజేశాయి.

2. PMLA Amendments- కేంద్ర ప్రభుత్వం తన ఇటీవలి సవరణలో, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో సమాచారాన్ని పంచుకోవాల్సిన 15 ప్రభుత్వ సంస్థలను జాబితా చేసింది. PMLAలోని సెక్షన్ 66 ప్రకారం జాబితా సవరించబడింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంటే ఏమిటి?
ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), భారతదేశంలో ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి మరియు ఆర్థిక చట్టాలను అమలు చేయడానికి బాధ్యత వహించే ఆర్థిక గూఢచార సంస్థ. దీని మూలాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్‌లో గుర్తించవచ్చు, ఇది విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం, 1947 ప్రకారం మార్పిడి నియంత్రణ చట్టాల ఉల్లంఘనలను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేయబడింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్ 1957లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌గా పేరు మార్చబడింది.

3. ఇండియా: “మదర్ ఆఫ్ డెమోక్రసీ” అనే పుస్తకాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల విడుదల చేశారు. “ఇండియా: ప్రజాస్వామ్య తల్లి” పుస్తకం పురాతన కాలం నుండి భారతదేశం యొక్క ప్రజాస్వామ్య తత్వాన్ని ప్రదర్శించడం ప్రదర్శిస్తుంది. దీనిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ICHR) విడుదల చేసింది. ఈ అకడమిక్ పుస్తకంలో 30 వ్యాసాలు ఉన్నాయి.

4. Maternal Mortality Rate: రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రసూతి మరణాల నిష్పత్తి (MMR)పై ప్రత్యేక బులెటిన్‌ను విడుదల చేసింది. MMR కోసం జాతీయ ఆరోగ్య విధానం (NHP) లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా భారతదేశం గణనీయమైన మైలురాయిని సాధించిందని వెల్లడించింది.

భారతదేశంలో ఈ నిష్పత్తి 2014-16లో 100,000 జననాలకు 130 గా ఉంటే, 2018-20 నాటికి గణనీయంగా ఇది ప్రతి లక్షకు 97కి పడిపోయింది.

5. భారత సుప్రీం కోర్ట్, ఇటీవల గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (GIB) పక్షి జాతి ని రక్షించాలనే అభ్యర్థనను విచారిస్తున్నప్పుడు, ప్రాజెక్ట్ టైగర్‌కు అనుగుణంగా “ప్రాజెక్ట్ GIB” ఆలోచనను వెల్లడించింది.

గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (GIB) అనేది ప్రధానంగా రాజస్థాన్ మరియు గుజరాత్‌లలో కనిపించే పెద్ద పక్షి జాతి.
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ఈ జాతిని తీవ్రంగా అంతరించిపోతున్నట్లు వర్గీకరించింది.

6. Community Innovator Fellowship Program: కమ్యూనిటీ ఇన్నోవేటర్ ఫెలోషిప్ అప్లికేషన్ డిసెంబర్ 1, 2022న ప్రారంభించబడింది.
కమ్యూనిటీ ఇన్నోవేటర్ ఫెలోషిప్ అంటే ఏమిటి?
కమ్యూనిటీ ఇన్నోవేటర్ ఫెలోషిప్ (CIF) అనేది అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క కొత్త కార్యక్రమం. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) భారతదేశ సహకారంతో దీనిని అమలు చేస్తుంది.
దీని లక్ష్యం జ్ఞాన నిర్మాణాన్ని సులభతరం చేయడం మరియు ఔత్సాహిక కమ్యూనిటీ ఆవిష్కర్తలకు మౌలిక సదుపాయాల మద్దతును అందించడం మరియు వారి వ్యవస్థాపక ప్రయాణంలో వారికి సహాయం చేయడం.

7. Global Wage Report 2022-2023 – గ్లోబల్ వేజ్ రిపోర్ట్ 2022-2023: వేతనాలు మరియు కొనుగోలు శక్తిపై ద్రవ్యోల్బణం మరియు కోవిడ్-19 ప్రభావం” అనే నివేదికను అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ఇటీవల విడుదల చేసింది.

  1. National BC Commission Chairperson – జాతీయ బీసీ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా హన్స్‌రాజ్‌ – జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా మహారాష్ట్రకు చెందిన భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ (68) బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్రలోని చంద్రాపుర్‌ లోక్‌సభ స్థానం నుంచి 1996లో ఒకసారి, మళ్లీ 2004 నుంచి 2019 వరకు ఈయన ప్రాతినిధ్యం వహించారు.
  1. జాతీయ జీవవైవిధ్య మండలి ఛైర్మన్‌ బాధ్యతల స్వీకరణ – జాతీయ జీవవైవిధ్య మండలి (National Biodiversity Authority NBA) ఛైర్మన్‌గా సి.అచలేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 1986 భారత అటవీ సర్వీసుల (ఐఎఫ్‌ఎస్‌) బ్యాచ్‌కు చెందిన ఆయన అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర చీఫ్‌ కన్జర్వేటర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. అచలేందర్‌రెడ్డి స్వస్థలం జనగామ.
  1. ఛత్తీస్‌గఢ్‌లో 76 శాతానికి రిజర్వేషన్‌ బిల్లులను ఆమోదించిన అసెంబ్లీ ఛత్తీస్‌గఢ్‌లో రిజర్వేషన్ల కోటాను 76 శాతానికి పెంచుతూ ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇందుకు సంబంధించిన రెండు సవరణ బిల్లులను అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం భూపేశ్‌ బఘేల్‌ ప్రవేశపెట్టారు. వీటిని సభ ఆమోదించడంతో ఇక నుంచి ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్లు 76 శాతానికి పెరగనున్నాయి. ఈ బిల్లులకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఈ సవరణ బిల్లుల ప్రకారం.. షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ)కు 32%, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)కు 27%, షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ)కు 13%, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్‌)కు 4% కోటా లభించనుంది.
  1. Argentina has won Fifa 2022 world cup title – ఫిఫా 2022 వరల్డ్ కప్ ఫైనల్స్ విజేత అర్జెంటీనా.
    ARGENTINA vs FRANCE, FIFA ప్రపంచ కప్ ఫైనల్ 80,000-సీట్లు నిండిన లుసైల్ ఐకానిక్ స్టేడియంలో జరిగింది. ఫైనల్‌లో లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా 4-2తో పెనాల్టీలపై రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఫ్రాన్స్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో, అర్జెంటీనా 1986 తర్వాత తొలిసారిగా తమ మూడవ ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. అర్జెంటీనా గత ఏడాది కోపా అమెరికా టైటిల్ ను గెలుచుకుంది, ఇది 28 సంవత్సరాలలో ఈ దేశం సాధించిన మొట్టమొదటి ప్రధాన ట్రోఫీ కావడం విశేషం.

12. First Gold ATM – దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎం హైదరాబాద్‌లో ప్రారంభం

దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను హైదరాబాద్‌ బేగంపేటలో ప్రారంభించారు. డెబిట్, క్రెడిట్‌ కార్డులతో కావాల్సిన బంగారాన్ని ఇందులో డ్రా చేసుకోవచ్చు. అశోక్‌ రఘుపతి ఛాంబర్స్‌లోని గోల్డ్‌ సిక్కా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి గోల్డ్‌ ఏటీఎం ఒక ఉదాహరణని ఆమె అభివర్ణించారు. ఈ ఏటీఎం ద్వారా 99.99శాతం శుద్ధత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలు డ్రా చేసుకోవచ్చని గోల్డ్‌ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్‌ తరుజ్‌ తెలిపారు. బంగారు నాణేలతో పాటు వాటి నాణ్యత, గ్యారంటీ తెలిపే పత్రాలూ జారీ అవుతాయని వెల్లడించారు. అలాగే బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఏటీఎం స్క్రీన్‌పై కనిపిస్తాయని వెల్లడించారు.

  1. ఈ-సంజీవనిలో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ : ఈ-సంజీవనిని (ఉచిత టెలిమెడిసిన్‌ సర్వీస్‌) దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 8 కోట్ల మంది వినియోగించుకోగా 2.82 కోట్ల కాలర్లతో ఆంధ్రప్రదేశ్‌ తొలి స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఏపీ తర్వాత స్థానాల్లో వరుసగా పశ్చిమ బెంగాల్‌ (1 కోటి), కర్ణాటక (94.46 లక్షలు), తమిళనాడు (87.23 లక్షలు), మహారాష్ట్ర (40.70 లక్షలు), ఉత్తరప్రదేశ్‌ (37.63 లక్షలు), మధ్యప్రదేశ్‌ (32.83 లక్షలు), బిహార్‌ (26.24 లక్షలు), తెలంగాణ (24.52 లక్షలు), గుజరాత్‌ (16.73 లక్షలు) ఉన్నాయని పేర్కొంది.
  1. INS Mormugao – నేవీలోకి అధునాతన యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌’ – భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు మరింత పెరిగాయి. దేశీయంగా తయారు చేసిన స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ ‘ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌’ను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లాంఛనంగా నేవీలో ప్రవేశపెట్టారు. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌ను భారత్‌లో తయారైన అత్యంత శక్తిమంతమైన యుద్ధనౌకల్లో ఒకటిగా అభివర్ణించారు. హిందు మహాసముద్ర ప్రాంతంలో భారత ప్రయోజనాలను మన నౌకాదళం విజయవంతంగా పరిరక్షిస్తోందని తెలిపారు.
  1. ICAR-National Academy of Agricultural Research Management NAARM – నార్మ్‌ డైరెక్టరుగా డాక్టర్‌ సీహెచ్‌.శ్రీనివాసరావు – జాతీయ వ్యవసాయ పరిశోధన, యాజమాన్య అకాడమీ (నార్మ్‌) డైరెక్టరుగా డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. తొలి టర్మ్‌ కింద అయిదేళ్ల ఏడు నెలలు బాధ్యతలు నిర్వహించిన ఆయన మరో అయిదేళ్లు ఆ పోస్టులో కొనసాగనున్నారు. ఈ మేరకు జాతీయ నియామక కమిటీ రెండో సారి శ్రీనివాసరావును ఆ పోస్టుకు ఎంపిక చేసింది.
  1. దినసరి కూలీల ఆత్మహత్యల్లో తమిళనాడుకు అగ్రస్థానం, తెలంగాణది 4వ స్థానం. 2014 నుంచి 2021 మధ్య 8 ఏళ్ల కాలంలో మొత్తం 23,838 మంది కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారు. 2021లో 4,223 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయంలో తమిళనాడు (7,673), మహారాష్ట్ర (5,270), మధ్యప్రదేశ్‌ (4,657) తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభలో ఈ విషయం చెప్పారు.

17. దేశంలో తొలి ముస్లిం మహిళా ఫైటర్‌ పైలట్‌గా సానియా మీర్జా

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సానియా మీర్జా తొలి ముస్లిం మహిళా ఫైటర్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించనున్నారు. సానియాది మీర్జాపుర్‌లో ఓ కుగ్రామం. నాన్న టీవీ మెకానిక్‌. చిన్నతనం నుంచి ఆమెకు ఫైటర్‌ పైలట్‌ కావాలని కల. తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌ అవని చతుర్వేది ఆమెకు ఆదర్శం. అప్పటికే మన దేశంలో ఎంతో మంది వనితలు యుద్ధ విమానాలతో ఆకాశంలో అవలీలగా విన్యాసాలు చేస్తున్నారు.వీటన్నింటినీ చూసిన సానియా తన లక్ష్యాన్ని చేరుకునేందుకు జిల్లాలోని ఓ డిఫెన్స్‌ అకాడమీలో చేరారు. అక్కడ శిక్షణ తీసుకున్న తర్వాత ఎన్డీఏ పరీక్షలకు హాజరై 149వ ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించారు. అలా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌ కానున్న సానియా మీర్జా దేశంలోనే తొలి ముస్లిం మహిళా ఫైటర్‌ పైలట్‌గా చరిత్రకెక్కనున్నారు. 27న పుణెలోని ఎన్డీఏ కంద్వాస్‌లో చేరనున్నారు.

  1. Mrs World 2022-23 – ‘మిసెస్‌ వరల్డ్‌’గా 21 ఏళ్ల తర్వాత భారత సంతతి వ్యక్తి సర్గమ్‌ కౌశల్‌

మిసెస్‌ వరల్డ్‌ కిరీటం మన దేశాన్ని వరించి 21 ఏళ్లైంది. దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ‘మిసెస్‌ వరల్డ్‌’ పోటీలది. ఇప్పటివరకూ దేశానికి ఆ కిరీటాన్ని తీసుకొచ్చింది డాక్టర్‌ అదితి గోవిత్రికర్‌ మాత్రమే. అదీ 21 ఏళ్ల క్రితం. ఈ ఏడాది ‘మిసెస్‌ ఇండియా వరల్డ్‌’గా నిలిచిన తర్వాత 32 ఏళ్ల సర్గమ్‌ కౌశల్‌ ‘మిసెస్‌ వరల్డ్‌’ కిరీటాన్ని దేశానికి తేవడమే తన లక్ష్యమంది. అన్నట్టుగానే సాధించిందీ జమ్మూ అమ్మాయి. భర్త ఆది కౌశల్‌ భారత నౌకాదళ అధికారి. ఆయన వృత్తిరీత్యా విశాఖపట్నంలో ఉంటున్నారు. ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో పీజీ పూర్తి చేసిన ఈమె టీచర్‌గానూ పనిచేసింది. క్యాన్సర్‌ బాధిత పిల్లల కోసం సేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. 63 దేశాలకు చెందిన సౌందర్యరాశులు పాల్గొంటే వారందరినీ వెనక్కి నెట్టి మన సర్గమ్‌ కిరీటాన్ని దక్కించుకుంది. పాలినేసియా, కెనడా దేశాల భామలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

  1. భారత సంతతి వ్యక్తికి ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌’ – భారత సంతతికి చెందిన మోహన్‌ మాన్సిగాని, బ్రిటన్‌ రాజకుటుంబం నుంచి ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ)’ పురస్కారం అందుకున్నారు. ఉత్తర లండన్‌కు చెందిన మోహన్, సెయింట్‌ జాన్‌ అంబులెన్స్‌ ఛారిటీకి ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. సంస్థలో ఆయన సేవలకు గుర్తింపుగా గతేడాది బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 జన్మదిన వేడుకల్లో ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. తాజాగా ఎలిజబెత్‌ కుమార్తె ప్రిన్సెస్‌ అన్నే చేతుల మీదుగా దీన్ని అందుకున్నారు. ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ అయిన మోహన్‌.. క్యాజువల్‌ డైనింగ్‌ గ్రూప్‌లో క్రియేటివ్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. అనంతరం తన వ్యాపారాలను విక్రయించి స్వచ్ఛంద సంస్థల్లో సేవలందిస్తున్నారు.
  1. Agnikul Cosmos – దేశంలో మొదటి రాకెట్ ప్రైవేటు ప్రయోగ వేదికగా అగ్నికుల్ – దేశంలోనే ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో రాకెట్లను నింగిలోకి పంపేందుకు ప్రయోగ వేదికను సిద్ధం చేశారు. దీనికి అనుబంధంగా మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఎంసీసీ)ను నెలకొల్పారు. త్వరలో రాకెట్‌ ప్రయోగానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో ఇప్పటికే 3 ప్రయోగ వేదికలు ఉన్నాయి. వీటి నుంచి తరచూ రాకెట్‌ ప్రయోగాలను ఇస్రో చేపడుతోంది. సమీపంలోనే ప్రైవేటు లాంచ్‌ వెహికల్‌ కోసం తొలి ప్రత్యేక వేదికను అందుబాటులోకి తెచ్చారు. దీన్ని చెన్నైకు చెందిన అగ్నికుల్‌ స్టార్టప్‌ ఏర్పాటు చేయగా ఇస్రో, ఇన్‌స్పేస్‌లు ప్రోత్సాహం అందించాయి.
  1. మధ్యవర్తిత్వ కేంద్రం పేరు మార్పు – ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికలకు మన దేశం ముఖ్య స్థావరంగా మారనుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ‘న్యూ దిల్లీ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌’ పేరును ‘ఇండియా ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌’గా మార్చే బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ఈ బిల్లును లోక్‌సభ ఈ ఏడాది ఆగస్టులో ఆమోదించగా, ఎగువసభ సమ్మతి తెలిపింది. చిన్న చిన్న దేశాలు కూడా మధ్యవర్తిత్వ పరిష్కార వేదికల ఏర్పాటులో ఎంతో ముందున్నాయని మంత్రి తెలిపారు.

  1. నేపాలీ కాంగ్రెస్‌ పార్లమెంటరీ నేతగా ప్రధాని దేవ్‌బా
    నేపాలీ కాంగ్రెస్‌ పార్లమెంటరీ నేతగా ప్రధాని దేవ్‌బా నేపాల్‌ ప్రధానమంత్రి షేర్‌ బహదూర్‌ దేవ్‌బా అధికార నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నికయ్యారు. అయిదు సార్లు ప్రధానిగా సేవలు అందిస్తున్న 76 ఏళ్ల షేర్‌ బహదూర్, తన ప్రత్యర్థి, పార్టీ ప్రధాన కార్యదర్శి గగన్‌ కుమార్‌ థాపేపై 39 ఓట్ల ఆధిక్యంతో పార్లమెంటరీ నేతగా ఎన్నికైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత నవంబరు 20న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. వారం రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ దేశ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ రాజకీయ పార్టీలకు సూచించారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ పార్లమెంటరీ నేత ఎంపిక కోసం నిర్వహించిన అంతర్గత ఎన్నికలో షేర్‌ బహదూర్‌ దేవ్‌బా ఎన్నికయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా గెలుపొందిన సభ్యులు ఈ 22న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్లమెంటరీ సెక్రటేరియట్‌ అధికారులు తెలిపారు.

23. అంధుల టీ20 ప్రపంచకప్‌ భారత్‌ సొంతం చేసుకుంది. అంధుల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. బంగ్లాదేశ్‌ను 120 పరుగుల తేడాతో చిత్తు చేసి వరుసగా మూడోసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో మొదట భారత్‌ 20 ఓవర్లలో 277 పరుగుల భారీ స్కోరు చేసింది. సునీల్‌ రమేశ్‌ (136; 63 బంతుల్లో 24×4, 1×6), కెప్టెన్‌ అజయ్‌కుమార్‌ రెడ్డి (100; 50 బంతుల్లో 18×4) సెంచరీలు సాధించారు. మూడో వికెట్‌కు ఈ జోడీ 248 పరుగులు జత చేసింది. రమేశ్‌కు ఈ కప్‌లో ఇది మూడో శతకం. ఛేదనలో బంగ్లా నిర్ణీత ఓవర్లలో 157/3కే పరిమితమైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడకుండా టైటిల్‌ నిలబెట్టుకోవడం విశేషం. 2012, 2017 టోర్నీల్లోనూ మన జట్టు విజేతగా నిలిచింది.

24. UNESCO HERITAGE SITES: మూడు ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు
మూడు ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు భారత్‌లోని మూడు చారిత్రక స్థలాలను ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక (టెన్టెటివ్‌) జాబితాలో చేర్చుతూ యునెస్కో నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) ప్రకటించింది. గుజరాత్‌కు చెందిన అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడే మొఢేరా సూర్య దేవాలయం, చారిత్రక నగరం వడ్‌నగర్, ఈశాన్య రాష్ట్రాల ఆన్‌కోర్‌వాట్‌గా పిలిచే త్రిపురలోని ఉనాకోటీ రాతి నిర్మాణాలకు ఈ గౌరవం దక్కింది. ఇందులో వడ్‌నగర్‌ ప్రధాని మోదీ స్వస్థలం. వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాకు ఈ మూడు స్థలాలను ప్రతిపాదిస్తూ భారత ప్రభుత్వం పదిహేను రోజుల క్రితం నామినేషన్లు పంపించగా వాటిని యునెస్కో ఆమోదించింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మొత్తం ఆరు చారిత్రక ప్రదేశాలు భారత్‌ నుంచి వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

25. భారత సంతతివాసి వరాద్కర్‌ రెండోసారి ఐర్లాండ్‌ ప్రధాని బాధ్యతలు స్వీకరణ

భారత సంతతివాసి వరాద్కర్‌ రెండోసారి ఐర్లాండ్‌ ప్రధాని బాధ్యతలు స్వీకరణ భారత సంతతికి చెందిన లియో వరాద్కర్‌ ఐర్లాండ్‌ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఫిన్‌గేల్‌ పార్టీకి చెందిన ఈయనకు రొటేషన్‌ పద్ధతిలో అవకాశం వచ్చింది. 2017లో తొలిసారి ఐర్లాండ్‌ ప్రధానిగా ఎంపికైన 43 ఏళ్ల వరాద్కర్, ప్రపంచంలోని అతి కొద్ది మంది స్వలింగ సంపర్క నేతల్లో ఒకరు. ఆయన భాగస్వామి మాథ్యూ బారెట్‌. మెడికల్‌ ప్రాక్టీషనర్‌. వరాద్కర్‌ కూడా వైద్యుడే. ముంబయిలోని కేఈఎమ్‌ ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేశారు. లియో తండ్రి మహారాష్ట్రకు చెందిన అశోక్‌. తల్లి మిరియం ఐరిష్‌ వాసి.

26. భారత్‌ – అమెరికా రక్షణబంధంలో ముందడుగు
భారత్‌ – అమెరికా రక్షణబంధంలో ముందడుగు భారతదేశంతో రక్షణ బంధాన్ని పటిష్ఠపరచుకోవడానికి తోడ్పడే బిల్లును అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఉభయ సభలు ఆమోదించాయి. 85,800 కోట్ల డాలర్ల కేటాయింపులతో రూపొందించిన ఈ బిల్లు జాతీయ రక్షణ ప్రాధికార చట్టం (ఎన్‌డీఏఏ)గా మారింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతకం చేయనున్నారు. రష్యా ఆయుధాలపై భారత్‌ ఆధారపడవలసిన అవసరాన్ని తప్పించడానికి ఈ చట్టం తోడ్పడుతుంది. అత్యాధునిక ఆయుధాల రూపకల్పనకు సంయుక్త పరిశోధనకు, సైబర్‌ పోరాట సామర్థ్యాలను పెంపొందించడానికీ వీలు కల్పిస్తుంది. చైనా, రష్యా నుంచి పెరుగుతున్న పోటీని ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని సెనెట్‌ సాయుధ సర్వీసుల కమిటీ అధ్యక్షుడు జాక్‌ రీడ్‌ తెలిపారు. కృత్రిమ మేధ, క్వాంటమ్‌ కంప్యూటింగ్, హైపర్‌ సోనిక్‌ ఆయుధాల రూపకల్పనలో ఆ రెండు దేశాలను అధిగమించడం ఎన్‌డీఏఏ లక్ష్యమనీ, దీని కోసం అమెరికాలో అధునాతన యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాలు రూపొందించడానికి ఊతమిస్తుందని వివరించారు.


27. ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మీరాబాయికి రజతం. టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత, భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను అదరగొట్టింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సత్తాచాటింది. టోక్యో ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ హౌ జిహువా (చైనా)ను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది. 

28. ఐరాస సంఘం నుంచి ఇరాన్‌ బహిష్కరణ
ఐరాస సంఘం నుంచి ఇరాన్‌ బహిష్కరణ స్త్రీ-పురుష సమానత్వం, మహిళా సాధికారతలను పెంపొందించడానికి అంకితమైన ‘అంతర్జాతీయ అంతర్‌ ప్రభుత్వ సంఘం’ నుంచి ఇరాన్‌ను బహిష్కరించడానికి సమితి ఆర్థిక, సామాజిక మండలి (ఎకాసోక్‌)లో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటింగుకు భారత్‌ గైర్హాజరైంది.

29. Midhani wide plate mill : దేశంలోనే మొదటిదైన వైడ్‌ ప్లేట్‌ మిల్‌ను హైదరాబాద్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధాని)లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతికి అంకితం చేశారు. రూ.600 కోట్ల అంచనా వ్యయంతో 30 వేల టన్నుల వార్షిక సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం వైడ్‌ ప్లేట్‌ తయారీని రాష్ట్రపతి పరిశీలించారు. అనంతరం రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను గవర్నర్‌ తమిళిసై, మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి తిలకించారు. ప్రదర్శనలో మిధాని, బీడీఎల్, హెచ్‌ఏఎల్, భారత్‌ ఎలక్ట్రానిక్స్, ఆర్మర్డ్‌ వెహికల్‌ నిగమ్‌ లిమిటెడ్, డీఆర్‌డీవోకు చెందిన ఉత్పత్తులతో పాటు ప్రైవేటు అంకుర సంస్థల ఉత్పత్తులను తిలకించారు. యుద్ధ ట్యాంకులు, క్షిపణులు, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లతో పాటు డ్రోన్‌ గన్లను ఆసక్తిగా పరిశీలించారు.

30. FDI Investments – ఈ ఏడాది జనవరి – సెప్టెంబరు మధ్యకాలంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)లో ఆంధ్రప్రదేశ్‌ 10వ, తెలంగాణ 7వ స్థానాల్లో నిలిచాయి. ఈ తొమ్మిది నెలల్లో దేశంలోకి 42,509 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడులు రాగా అందులో ఆంధ్రప్రదేశ్‌కు 217 మిలియన్‌ డాలర్లు (0.51%) మాత్రమే దక్కాయి. తెలంగాణకు 1287 మిలియన్‌ డాలర్లు (3.02%) చేజిక్కాయి. 

31. చరిత్ర సృష్టించిన కోనేరు హంపి.. భారత అగ్రశ్రేణి చెస్‌ క్రీడాకారిణి, తెలుగమ్మాయి కోనేరు హంపి మరోసారి ప్రపంచ వేదికపై మెరిసింది. ప్రపంచ బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. కోనేరు హంపి ప్రపంచ బ్లిట్జ్‌ మహిళల ఛాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గింది. 17 రౌండ్లలో 12.5 పాయింట్లతో హంపి ద్వితీయ స్థానంలో నిలిచింది. తొలి అయిదు గేముల్లో మూడు ఓటములు చవిచూసిన ఆమె, తన చివరి 12 రౌండ్లలో ఒక్క పరాజయం లేకుండా పోడియం ఎక్కడం విశేషం. అసుబెయెవా (కజకిస్థాన్‌) పసిడి గెలిచింది. దిగ్గజ ఆటగాడు ఆనంద్‌ (2017) తర్వాత ఈ టోర్నీలో పతకం సాధించిన ఘనత హంపిదే. మరోవైపు 15 ఏళ్ల సవితశ్రీ ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళ విభాగంలో కాంస్యం గెలుచుకుంది.

32. జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌.. జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి నిఖత్‌ జరీన్‌ అదరగొట్టింది. ఇటీవల కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణంతో మెరిసిన నిఖత్, జాతీయ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచింది. 50 కేజీల ఫైనల్లో నిఖత్‌ 4-1తో అనామిక (ఆర్‌ఎస్‌పీబీ)పై నెగ్గి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. బౌట్‌లో అత్యధిక శాతం ఆధిపత్యం కనబరిచిన నిఖత్, ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!