పేద విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతి భావంతులైన విద్యార్థులను ఆర్థికంగా ఆదుకొని.. డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా లక్ష మందికి కేంద్ర ప్రభుత్వం ఈ ఉపకార వేతనాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
ఏడాదికి రూ.12 వేల ఆర్థిక ప్రోత్సాహం:
ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్షిప్ గా అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది.
NMMS స్కాలర్షిప్కు అర్హతలు:
ఏడో తరగతిలో 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు. తుది ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలో 55శాతం మార్కులు పొంది ఉండాలి.
ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదవుతూ ఉండాలి.
విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు.
NMMS స్కాలర్షిప్కు ఎంపిక విధానం:
రాత పరీక్ష ద్వారా విద్యార్థులను స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: ఈ స్కాలర్షిప్స్కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల వ్రాత పరీక్షలు నిర్వహిస్తారు.
NMMS స్కాలర్షిప్కు దరఖాస్తు విధానం:
రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విద్యార్ధుల దరఖాస్తులను ఆయా స్కూళ్లు సమర్పించాలి.
అనంతరం ఆ దరఖాస్తుల ప్రింటవుట్లను, ధ్రువీకరణ పత్రాలను డీఈవోలకు పంపాలి.
NMMS స్కాలర్షిప్కు అప్లికేషన్ ఫీ వివరాలు:
Description
Fee
General/ OBC/ EWS candidates
Rs.100/-
SC/ ST/ PWD candidates
Rs.50/-
NMMS స్కాలర్షిప్కు ముఖ్యమైన తేదీలు:
Description
Date (DD-MM-YY)
Starting date for online application
10-08-2023
Last date for Online application
25-09-2023
Last date for submission of printed nominal rolls at DEO office
Leave a Reply