Vande Bharat: సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభం.. టైమింగ్స్ మరియు స్టేషన్లు ఇవే

తెలుగు రాష్ట్రాల్లో రెండో వందే భారత్ నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే సికింద్రాబాద్ మరియు విశాఖపట్నం మధ్య మొదటి వందే భారత్ రైలును ప్రారంభించడగా, తరచుగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యం కోసం, కేంద్ర ప్రభుత్వం మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8 న జెండా ఊపి ప్రారంభించారు.

ఈ రైలు నంబర్లు ఎంత?

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు ఇప్పటికే నెంబర్ కేటాయించారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేటప్పుడు 20701, తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లేటప్పుడు 20702గా ఈ రైలు నెంబర్ ఉంటుంది.

వందే భారత్ రైలు టైమింగ్స్ ఏంటి?

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు టైమింగ్స్ ఇలా ఉన్నాయి. ఈ రైలు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం రెండున్నర గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతిలో మధ్యాహ్నం 03:15కి బయలుదేరి.. రాత్రి 11:45కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఏ ఏ స్టేషన్లో ఆగుతుంది?

సికింద్రాబాద్, తిరుపతి మధ్య నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో మాత్రమే ఆగుతుంది. గుంటూరులో 5 నిమిషాలు, మిగతా స్టేషన్‌లలో ఒక నిమిషం పాటు మాత్రమే నిలుపుతారు. మొత్తం 660.77 కి.మీ. దూరాన్ని ఎనిమిదిన్నర గంటల్లో చేరుకుంటుంది

ఏ స్టేషన్ కి ఎప్పుడు చేరుకుంటుంది?

సికింద్రాబాద్ నుంచి వెళ్లేటప్పుడు.. నల్గొండకి ఉదయం 07:20, గుంటూరుకి 09.50, ఒంగోలుకి 11.10, నెల్లూరుకి 12.30కి చేరుకుంటుంది.ఇక తిరుపతి కి మధ్యాహ్నం 2.30 చేరుతుంది. తిరుపతి నుంచి వచ్చేటప్పుడు… నెల్లూరుకి సాయంత్రం 05:20కి, ఒంగోలుకి 06:30కి, గుంటూరుకి రాత్రి 07:45, నల్గొండకి రాత్రి 10:10కి, ఇక సికింద్రాబాద్ కి రాత్రి 11.45 కి చేరుతుంది చేరుకుంటుంది.

ప్రారంభోత్సవం రోజున అంటే.. ఏప్రిల్ 8న మాత్రం సికింద్రాబాద్ నుంచి ఉదయం 11:30 గంటలకు రైలు ప్రారంభమవుతుంది. తొలి రోజున నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్‌లో ఆగుతుంది.

ప్రయాణించే దూరం

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చేరుకునేందుకు ఎనిమిదిన్నర గంటల సమయం పడుతుంది. ఈ రైలు సగటు వేగం గంటకు 77.73 కిలోమీటర్లు మాత్రమే..!

కోచ్ వివరాలు

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్‌లో మొత్తం 8 కోచ్‌లు ఉంటాయి. ఇందులో నాలుగు చైర్ కార్, మరో నాలుగు ఎగ్జిక్యూటివ్ ఛైర్ కారు కోచ్‌లు. ఐతే టికెట్ల ధరలపై మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది.

టికెట్ ధరల వివరాలు

సికింద్రాబాద్-తిరుపతి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ టికెట్టు ధరలు

స్టేషన్Chair Car ధరExecutive chair car ధర
నల్గొండ ₹470₹900
గుంటూరు₹865₹1620
ఒంగోలు ₹1075₹2045
నెల్లూరు ₹1270₹2455
తిరుపతి ₹1680₹3080

తిరుపతి- సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ టికెట్టు ధరలు

స్టేషన్Chair Car ధరExecutive chair car ధర
నెల్లూరు ₹555₹1060
ఒంగోలు ₹750₹1460
గుంటూరు ₹955₹1865
నల్గొండ ₹1475₹2730
సికింద్రాబాద్₹1625₹3030
Pm Modi flagging off Tirupathi Vande Bharat

One response to “Vande Bharat: సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభం.. టైమింగ్స్ మరియు స్టేషన్లు ఇవే”

  1. MMTS Phase 2 – ఎంఎంటిఎస్ లోకల్ ట్రైన్ ఫేజ్ 2 ప్రారంభం.. ట్రైన్ టైమింగ్స్ ఇవే – Current Affairs

    […] ఇది చదవండి: సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ టైమ… […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page